PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 17 NOV 2020 5:57PM by PIB Hyderabad

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)

· గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ్ కేసులు 29,163

· కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య అధికం; గత 24 గంటలలో కోలుకున్నవారు 40,791 మంది

· ఈరోజు వరకు కోలుకున్నవారు 82,90,370 మంది

· కోలుకున్నవారి శాతం 93.42% కు చేరిక

· దేశవ్యాప్తంగా అత్యధికస్థాయిలో పరీక్షలు జరిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు 12,65,42,907

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

వరుసగా రెండో రోజు కూడా 30 వేల లోపు కొత్త కోవిడ్ కేసులు ; ఒకటిన్నర నెలలుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

భారత్ లో వరుసగా రెండో రోజు కూడా కొత్తగా 30 వేల లోపే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. గడిచిన 24 గంటలలో 29,163 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. గడిచిన పది రోజులలో ఈ సంక్య 50 వేల లోపే ఉంటూ వస్తోంది. గత 24 గంటలలో 40,791 మంది కోలుకోగా ఇదే సమయంలో వచ్చిన కొత్త కేసులు 29,163 మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు కూడా ప్రభుత్వం బాగా పెంచింది. ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 12,65,42,907 కి చేరాయి. దీనివలన పాజిటివ్ శాతం 7.01% కి చేరింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,53,401కి చేరగా వీరు మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో కేవలం 5.11% మాత్రమే. ఈరోజు వరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 82,90,370కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 93.42% కు చేరింది. గత 24 గంటలలో కోలుకున్నవారిలో 72.87% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరిలో కేరళలో అత్యధికంగా 6,567 మంది కోలుకోగా, పశ్చిమ బెంగాల్ లో 4,376 మంది, ఢిల్లీలో 3,560 మంది కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్ గా నమోదైన కేసులలో 75.14% పది రాష్ట్రాలలో నమోదు కాగా ఢిల్లీలో 3,797 కొత్త కేసులు, పశ్చిమ బెంగాల్ లో 3,012, కేరళలో 2,710 నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 449 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. వారిలో 78.4% మంది కేవలం పది రాష్ట్రాలకు చెందినవారే. అత్యధికంగా 22.76% (99 మరణాలు) ఢిల్లీలో నమోదు కాగా, మహారాష్ట్రలో 60, పశ్చిమ బెంగాల్ లో 53 సంభవించాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673438

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యుటివ్ బోర్డ్ 147వ సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ హర్ష వర్ధన్

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యుటివ్ బోర్డ్ డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన 147 వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి దాక్టర్ హర్ష వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673402

ప్రధాని పిలుపుకు అనుగుణంగా స్థానికత కోసం గొంతెత్తిన ఆధ్యాత్మిక గురువులు

ఆత్మ నిర్భర్ భారత్ దిశలో స్థానికత దిశలో ప్రచారం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఆధ్యాత్మిక గురువులకు విజ్ఞప్తిచేశారు. నిన్న ఆయన చేసిన విజ్ఞప్తికి ప్రధాన ఆధ్యాత్మిక గురువులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రధాని పిలుపుకు సంత్ సమాజ్ ఎంతో ఉత్సాహంతో స్పందించింది. ఆత్మ నిర్భర్ భారత్ కోసం స్థానిక ఉత్పత్తులకే గొంతెత్తేలా అంకితభావంతో ప్రజలకు ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. జైనాచార్య శ్రీ విజయ్ వల్లభ సూరీశ్వర్ జీ మహారాజ్ 151వ జయంతి సందర్భంగా నిన్న శాంతి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673439

వర్చువల్ విధానంలో జరిగిన బ్రిక్స్-2020 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని ప్రసంగ పాఠం:

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673482

స్కాలర్ షిప్పుల పథకం కింద డబ్బు పంపిణీపై సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ వివరణ

స్కాలర్ షిప్పుల పథకం కింద విద్యార్థులకు అందజేసే స్కాలర్ షిప్పులు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం కావటంతో విద్యార్థుల కష్టాలు రెట్టింపయ్యాయంటూ కొన్ని పత్రికలలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం మీద వాస్తవాలతో వివరణ ఇవ్వటానికి సామాజిక న్యాయ, సాధికారత విభాగం ముందుకొచ్చింది. ఈ విభాగం కింద షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, డీ నోటిఫై అయిన తెగలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వంటి లక్షిత వర్గాలకు స్కాలర్ షిప్పులు అందిస్తుంది. ఇలా నేరుగా అందించటం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం సహకారం తీసుకుంటూ పంపిణీ జరుపుతుంది. కోవిడ్ సమయంలో కూడా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడకుండా ఉండేందుకు ఈ పంపిణీ సంస్థలతో మంత్రిత్వశాఖ సమన్వయం చేస్తూ వచ్చింది. కీలక పథకంగా భావించే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల పంపిణీలో భాగంగా డిమాంద్ ను ముందుగా అంచనావేసి కేంద్ర ప్రభుత్వం తన 75% వాటాను 2020 జూన్ నాటికే అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదలచేసింది. అవసరాలకు అనుగుణంగా మిగిలిన 25% సొమ్మును కూడా వరుసగా విడుదలచేస్తూ వస్తోంది.

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673484

ప్రధానమంత్రికి తన నివేదికను సమర్పించిన ఆర్థిక సంఘం

15వ ఆర్థిక సంఘ చైర్మన్, సభ్యులు నిన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి తమ నివేదిక ప్రతిని అందజేశారు. 2020 నవంబఎ 4నే ఈ కమిషన్ ఈ నివేదికను భారత రాష్టపతికి అందజేసిన విషయం తెలిసిందే. సంఘం చైర్మన్ శ్రీ ఎన్ కె సింగ్ సభ్యులైన శ్రీ అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూఒ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రమేశ్ చంద్, కార్యదర్శి శ్రీ అర్వింద్ మెహతా తో కలిసి ఈ నివేదిక అందజేత కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ సంఘం రేపు కేంద్ర ఆర్థికమంత్రికి కూడా నివేదిక ప్రతిని అందజేస్తుంది. చర్యానివేదిక రూపంలో వివరణను కూడా జోడించిన ఈ నివేదికను ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా పార్లమెంటు ముందుంచుతుంది

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673349

ట్రైబ్స్ ఇండియా ఉత్పత్తుల సంఖ్యను విస్తరించిన ట్రైఫెడ్

గిరిజన ప్రాంతాలలో సేకరించి అమ్మే ఉత్పత్తుల సంఖ్యను ట్రైఫెడ్ ఇప్పుడు మరింత విస్తరించింది. ప్రధానంగా రోగనిరోధకశక్తిని పెంచే అటవీ ఉత్పత్తులను తాజాగా సేకరించి ఆర్గానికి ఉత్పత్తులుగా మార్కెట్ చేయటానికి ఇటీవలి కాలంలో చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా సాగుతున్న ఈ విస్తరణలో భాగంగా ట్రైబ్స్ ఇండియా సంస్థ కొత్తగా మరిన్ని ఉత్పత్తులను ఈ జాబితాలో చేర్చింది. ఈసారి జగదల్పూర్ జైల్లో ఉన్న ఖైదీలు ఉత్పత్తి చేసినవాటిని కూడా చేర్చింది. స్థానికత కోసం గొంతెత్తుదామన్న ప్రధాని పిలుపుకు అనుగుణంగా ట్రైఫెడ్ సంస్థ నిస్సహాయులుగా ఉన్న గిరిజన ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పెంచే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గిరిజనుల జీవితాలలో సమూలమైన మార్పులు తెచ్చి వారి జీవనోపాధిని మెరుగు పరచే క్రమంలో ట్రైబ్స్ ఇండియా అనే ఈ-మార్కెట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఈ ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా దేశణ్ నములూలలనుంచి సేకరించిన అటవీ ఉత్పతులను, గిరిజన హస్తకళారూపాలను ప్రదర్శించి మరింతమందికి అందుబాటులోకి తెస్తోంది. ట్రైబ్స్ ఇండియా వారి ఈ-మార్కెట్ ప్లేస్ వలన లక్షలాది గిరిజనుల సాధికారత పెంచటానికి వీలవుతోంది. ఇందులో సహజసిద్ధమైన, వైవిధ్య భరితమైన సుస్థిర ఉత్పత్తులు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు వెలుగులోకి వస్తున్నాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673343

పిఐబి క్షేత్రస్థాయి అధికారులనుంచి అందిన సమాచారం

· అస్సాం: అస్సాం లో 186 మంది కొత్తగా కోవిడ్ పాజిటివ్ బాధితులుగా నమోదయ్యారు. 405 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 210454 కు చేరగా ఇప్పటివరకు చికిత్సపూర్తి చేసుకొని డిశ్చార్జ్ అయినవారు 206041 మంది. చికిత్సలో ఉన్నవారు 3446 మంది కాగా మృతులు 964 మంది.

· కేరళ: శబరిమలకు వెళ్ళే యాత్రికులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విజ్ఞప్తి చేశారు. శబరిమలకు వెళ్ళేవాళంతా కచ్చితంగా కోవిడ్ నెగటివ్ ధ్రువపత్రం సమర్పించాలన్నారు. కరోనా సంక్షోభం మొదలయ్యాక ఇది మొదటి శబరిమల యాత్ర గనుక భక్తుల సంఖ్యను రోజుకు 1000 మందికే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించారు. వారాంతంలో మాత్రం 2000 మందిని అనుమతిస్తారు. ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ వైరస్ విజృంభించే ప్రమాదముందని, ఫలితాలు అనూహ్యంగా ఉండవచ్చునని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పరీక్షల సంఖ్యతో పోల్చినప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గవర్నర్ అరిఫ్ ముహమ్మద్ ఖాన్ కు కరోనా నెగటివ్ అని తేలటంతో ప్రభుత్వ వైద్య కళాశాలనుంచి ఆయనను డిశ్చార్జ్ చేశారు.

· తమిళనాడు: పాండిచ్చేరిలో కోవిడ్ కేసులు బాగా తగ్గుతూ ఈ రోజు 13 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ క్ర్సులలో మరణాలు 1.67 శాతానికే పరిమితమయ్యాయి. కోవిడ్ వాక్సిన అందుబాటులోకి రాగానే వాక్సిన ఇవ్వాల్సిన ఆరోగ్య సిబ్బంది సమాచారాన్ని తమిళనాడు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి వాక్సిన్ కోవిషీల్డ్ రెండో దశ ట్రయల్స్ లో ఉంది. రాష్ట్రంలో మాస్కులు ధరించటం బాగా తగ్గిపొవటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె రాధాకృష్నన్ఇ జిల్లా అధికారులకు లేఖలు రాశారు. జిల్లాయంత్రాంగం ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించకూడదని ఆ లేఖలో హెచ్చరించారు. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నంత మాత్రాన నిర్లక్ష్యం తగదన్నారు.

· కర్నాటక: కర్నాటకలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కాలేజీలు తెరచుకున్నాయి. అయితే హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంది. అందరూ తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్న నిబంధన విధించటం గందరగోళానికి దారితీసింది. సర్టిఫికెట్లు తీసుకురాని అనేకమంది విద్యార్థులు దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలదగ్గర గుమికూడి ఉండటం కనిపించింది. శానిటైజేషన్ చేసిన తరువాత సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను కూడా తెరచారు. గడగ్ లో గత 28 రోజులలో ఒక్క కోవిడ్ మృతి కూడా నమోదు కాలేదు. సకాలంలో బాధితులను గుర్తించి చికిత్సకు తరలించటం, వెంటనే తగిన చికిత్స అందించటం, డాక్టర్లు, ఇతరవైద్య సిబ్బంది అంకిత భావంతో చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందని జిల్లా యంత్రాంగం చెబుతోంది.

· ఆంధ్రప్రదేశ్: నాలుగు నెలల్లో మొదటిసారిగా రాష్ట్రంలో కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య సోమవారం నాడు 1000 కి లోపు పడిపోయింది. 13 జిల్లాలో 11 జిల్లాలు వెయ్యి లోపు కేసులు నమోదు చేశాయి. దీంతో కొత్త కేసులు 753 కు పరిమితమయ్యాయి. మొత్తం నమోదైన కోవిడ్ కేసులు 8.54 లక్షలు కాగా, 8.3 లక్షలమంది కోలుకున్నారు. . వారిలో 1500 మందికి పైగా గత 24 గంటల్లో కోలుకున్నారు. మరోవైపు 13 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,881 కు చేరింది. ఇలా ఉండగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే . ఆర్ ప్రతాప్ రెడ్దికి కోవిడ్ పాజిటివ్ గా నిఒర్థారణ అయింది. ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు జిల్ల పరిషత్ పాఠశాల విద్యార్థులు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.

· తెలంగాణ: గత 24 గంటలలో కొత్త కోవిడ్ కేసులు 952. కోలుకున్నవారు 1602 మంది, మరణాలు 3 నమోదయ్యాయి. కొత్త కేసులు 952 లో 150 కేసులు జిహెచ్ ఎం సి నుంచి నమోదయ్యాయి. . మొత్తం కేసులు: 2,58,828; చికిత్సలో ఉన్నవి: 13,732; మరణాలు 1410; కోలుకున్నవారు: 2,43,686 కాగా కోలుకున్న శాతం 94.14%. దేశవ్యాప్తంగా ఇది is 93.4 శాతం ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సామాజిక, విద్యా సంబంధ, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యకలాపాలను 200 మందికి లోబడి అనుమతించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇది 100 మందికే పరిమితమైంది.

· మహారాష్ట్ర: సోమవారం నాడు మహారాష్ట్రలో 2,535 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత ఐదునెలలలో అత్యల్పం కావటం విశేషం. కొత్త పాజిటివ్ కేసులు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. కోలుకుంటున్నవారి శాతం 92.49 నమొదు కాగా మరణాల శాతం 2.63 కి చేరింది. అయితే, ముంబయ్ నగరంలో మాత్రం ఒక్క రోజులోనే, 409 కొత్త కెసులు వచ్చాయి.

· గుజరాత్ : అహమ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నిన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు. 1200మ్ పడకల ఆస్పత్రిలో ప్రత్యేకంగా 100 వెంటిలేటర్లతో ఒక వార్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలి పండుగల నేపథ్యంలో రోజువారీ పరీక్షల సంఖ్య కూడా పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్సపొందుతూ ఉన్నవారు 12,456 మంది కాగా, వారిలో 62 మంది వెంటిలేటర్లమీద ఉన్నారు. నిన్న ఐదుగురు మరణించారు. .మొత్తం మరణాలు 3808కు చేరాయి. .

· రాజస్థాన్: సోమవారం కోవిడ్ కేసులు కొద్దిగా పెరిగాయి. రాజధాని జైపూర్ నగరంలొనే సోమవారం 538 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం కొత్త కేసుల్లో ఇది నాలుగోవంతు. గడిచిన రెండు రోజుల్లో నగరంలో 1036 కేసులు వచ్చాయి. నవంబర్ మొదటి 16 రోజుల్లో జైపూర్ వాటా 20% గా నమోదైంది. .నవంబర్ 16 వరకు మొత్తం కేసులు 30,993 నమోదయ్యాయి. .

· మధ్యప్రదేశ్: చాలా రోజుల తరువాత మధ్యప్రదేశ్ లో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 500 లోపుకు పడిపోయాయి. పాజిటివ్ శాతం 4.6 కు తగ్గింది. నిన్న నాలుగు జిల్లాల్లో కొత్త కేసులు వచ్చాయి. 35 జిల్లాల్లో చికిత్సలో ఉన్నవారు పది మంది కంటే తక్కువగా ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో 50 లోపు ఉన్నారు. గరిష్ఠంగా భోపాల్ లో 1421 మంది చికిత్సలో ఉన్నారు. ఇండోర్ లో 89 మంది ఉన్నారు.

· గోవా: కొత్త కోవిడ్ కేసులు బాగా తగ్గుతూ ఉన్నాయి. సోమవారం నాడు రాష్టంలో చికిత్సలో ఉన్నవారు1500 లోపే తేలారు. 285 మంది కోలుకోగా అది కొత్త కేసులకు రెట్టింపు సంఖ్య. పాజిటివ్ శాతం 10 కాగా నిన్న కోలుకున్నవారి శాతం 95 కు చేరింది.కొత్తగా వ్యాధి సోకుతున్నవారి సంఖ్య తగ్గుతూ ఉండటంతో మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. . ఇప్పటివరకు 664 మరణాలు నమోదుకాగా అత్యధికంగా సెప్టెంబర్ లోనే చనిపోవటం గమనార్హం. .

నిజ నిర్థారణ

Image

*******(Release ID: 1673573) Visitor Counter : 122