ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా రెండో రోజు కూడా 30 వేలలోపు కొత్త కోవిడ్ కేసులు

ఒకటిన్నర నెలలుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

Posted On: 17 NOV 2020 11:27AM by PIB Hyderabad

భారత్ లో వరుసగా రెండో రోజు కూడా కొత్తగా 30 వేల లోపే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. గడిచిన 24 గంటలలో 29,163 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు.  గడిచిన పది రోజులలో ఈ సంక్య 50 వేల లోపే ఉంటూ వస్తోంది.

 

కోవిడ్ వ్యాపించకుండా అనుసరించాల్సిన వైఖరిని, పాటించాల్సిన జాగ్రత్తలను సక్రమంగా పాటించటం వల్లనే ఇది సాధ్యమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. యూరప్, అమెరికా దేశాలలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారత్ లో అదుపులో ఉండటం విశేషం. కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. గత 24 గంటలలో 40,791 మంది కోలుకోగా ఇదే సమయంలో వచ్చిన కొత్త కేసులు  29,163 మాత్రమే వచ్చాయి.

 

దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు కూడా ప్రభుత్వం బాగా పెంచింది. ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 12,65,42,907 కి చేరాయి. దీనివలన పాజిటివ్ శాతం 7.01% కి చేరింది.

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,53,401కి చేరగా వీరు మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో  కేవలం 5.11%  మాత్రమే. ఈరోజు వరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 82,90,370కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 93.42% కు చేరింది. గత 24 గంటలలో  కోలుకున్నవారిలో 72.87% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  వీరిలో కేరళలో అత్యధికంగా  6,567 మంది కోలుకోగా, పశ్చిమ బెంగాల్ లో 4,376 మంది, ఢిల్లీలో 3,560 మంది కోలుకున్నారు.

కొత్తగా పాజిటివ్ గా నమోదైన కేసులలో 75.14% పది రాష్ట్రాలలో నమోదు కాగా  ఢిల్లీలో 3,797 కొత్త కేసులు,  పశ్చిమ బెంగాల్ లో  3,012, కేరళలో  2,710 నమోదయ్యాయి.

గడిచిన 24 గంటలలో 449 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు.వారిలో 78.4% మంది కేవలం పది రాష్ట్రాలకు చెందినవారే. అత్యధికంగా 22.76% (99 మరణాలు) ఢిల్లీలో నమోదు కాగా, మహారాష్ట్రలో 60, పశ్చిమ బెంగాల్ లో 53 సంభవించాయి.

***

 


(Release ID: 1673438) Visitor Counter : 227