ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 17 న జ‌రిగే మూడో వార్షిక బ్లూంబర్గ్ న్యూ ఎకాన‌మీ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 17 NOV 2020 12:17PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 17 న భారత కాలమానం ప్ర‌కారం సాయంత్రం 6:30 గంట‌ల వేళ‌ మూడో వార్షిక బ్లూంబర్గ్ నూత‌న ఆర్థిక వేదిక కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించ‌నున్నారు. 

బ్లూంబ‌ర్గ్ న్యూ ఎకాన‌మీ ఫోర‌మ్ ను 2018 లో శ్రీ మైఖేల్ బ్లూంబ‌ర్గ్ స్థాపించారు. ఈ వేదిక ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కు ఎదుర‌వుతున్న జ‌టిల‌మైన స‌వాళ్ళ‌కు ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప‌రిష్కార మార్గాల‌ దోవను చూపే సిస‌లైన సంభాష‌ణ‌ల‌లో భాగ‌ం పంచుకొనే సాముదాయిక నాయ‌కుల‌ను ఒక చోటుకు తీసుకువచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంది.  మొదటి వేదిక‌ ను సింగ‌పూర్ లో నిర్వ‌హించ‌గా, రెండో వార్షిక వేదిక ను బీజింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది.  కాగా ఈ సంద‌ర్భాలలో ప్ర‌పంచ ఆర్థిక నిర్వ‌హ‌ణ‌, వ్యాపారం- పెట్టుబ‌డి, సాంకేతిక విజ్ఞానం, ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, కేపిట‌ల్ మార్కెట్ లు, జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న‌, అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని ముందుకు పోవ‌డం వంటి అనేక అంశాలు చ‌ర్చ‌ కు వచ్చాయి.

ఈ సంవ‌త్స‌రం లో, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి గుప్పిట్లో చిక్కుకొన్న నేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు మళ్లీ కొత్త శ‌క్తి ని అందించడం, రాబోయే కాలానికి తగిన వ్యూహాన్ని రూపొందించడం పై తాజా ఫోరమ్ లో చ‌ర్చ‌ లు చోటు చేసుకోనున్నాయి.


***


(Release ID: 1673402) Visitor Counter : 226