ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అంగ్ సాన్ సూ కీ, ఎన్ ఎల్ డి పార్టీకి ప్ర‌ధాని అభినంద‌న‌లు

Posted On: 12 NOV 2020 10:38PM by PIB Hyderabad

మ‌య‌న్మార్ ఎన్నిక‌ల్లో అంగ్ సాన్ సూకీ, ఎన్ ఎల్ డి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. 
ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినందుకుగాను అంగ్ సాన్ సూకీ, ఎన్ ఎల్ డికి నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానంటూ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ట్వీటు చేశారు. మ‌య‌న్మార్ లో ప్ర‌జాస్వామ్యం నెల‌కొల్పే దిశ‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల్లోభాగంగా విజ‌య‌వంతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌న వున్న సంప్ర‌దాయ బంధాల‌ను, స్నేహాల‌ను బ‌లోపేతం చేసుకోవ‌డానికి వీలుగా మీతో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఎదురు చూస్తూ వున్నానంటూ ప్ర‌ధాని త‌న ట్వీటులో పేర్కొన్నారు. 

***


(Release ID: 1672522) Visitor Counter : 122