జౌళి మంత్రిత్వ శాఖ
#Local4Diwali పేరిట ప్రచారం ప్రారంభించిన జౌళి మంత్రిత్వ శాఖ స్వదేశీ హస్తకళా వస్తువులను కొనడం, బహుమతిగా ఇవ్వడం ద్వారా దీపావళి జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి
Posted On:
11 NOV 2020 1:15PM by PIB Hyderabad
హస్తకళలు, భారతీయ సాంస్కృతిక వారసత్వ చిహ్నాలు. దేశంలో ముఖ్యమైన జీవనోపాధి మార్గాలు. హస్తకళలు, అనుబంధ వృత్తుల్లో 55 శాతానికి పైగా అతివలే ఉన్నందున, మహిళా సాధికారతకు ఇది కీలక రంగం.
స్వదేశీ హస్తకళా వస్తువుల వినియోగం మన అలవాటుగా మారాలని, హస్తకళాకారుల గురించి అందరికీ చెప్పాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర జౌళి శాఖ మంత్రి కూడా ప్రజలకు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు:
"ఈనెల 9న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో, మనమంతా కలిసి స్వదేశీ తయారీ వస్త్రాలు, హస్తకళా వ్యాపారాలకు మద్దతుగా నిలుద్దాం. ఆప్తులకు వినయంగా ఇచ్చే మట్టి ప్రమిదలైనా, ఇంటికి పనికివచ్చే దుప్పట్లు, కిటికీ తెరలు, హస్తకళా వస్తువులైనా సరే, ప్రతి కొనుగోలును ఈ దీపావళి గుర్తుంచుకుంటుంది. చేనేత, హస్తకళాకారులు, స్థానిక, చిన్న వ్యాపారాల ద్వారా దీపావళి అమ్మకాలను ప్రోత్సహించడానికి మీ సామాజిక మాధ్యమ ఖాతాల్లో వాటిని ప్రదర్శించడంతోపాటు, '#Local4Diwali'ను ఉపయోగించండి. మీ ఇంట్లో ఉపయోగించడానికి లేదా బహుమతిగా ఇవ్వడానికి ఇష్టపడి తీసుకున్న వస్తువు ఫొటోను సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రదర్శిచడంతోపాటు, ఎవరి నుంచి కొన్నారో వారిని ట్యాగ్ చేయండి. దీనిద్వారా ఈ కఠిన పరిస్థితుల్లో అమ్మకాలకు చేయూతనిద్దాం. అవసరంలో ఉన్నవారికి అవకాశాలను పునఃసృష్టించడానికి మీ మద్దతు సాయపడుతుంది".
(Release ID: 1671905)
Visitor Counter : 221
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada