ప్రధాన మంత్రి కార్యాలయం

ఒఆర్ఒపి కి 5 సంవత్సరాలైన సందర్భంలో పూర్వ సైనికులకు నమస్కరించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2020 6:28PM by PIB Hyderabad

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఒఆర్ఒపి) శనివారం 5 వ సంవత్సరం పూర్తి చేసుకొన్న సందర్భం లో పూర్వ సైనికులకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నమస్కరించారు.

‘‘భారతదేశం మన దేశ ప్రజల ను ధైర్య సాహసాలతో రక్షిస్తున్న మన ఘనమైన జవానుల శ్రేయస్సు ను దృష్టి లో పెట్టుకొని భారతదేశం అయిదు సంవత్సరాల క్రితం, ఇదే రోజున, ఒక చరిత్రాత్మకమైన అడుగును వేసింది.  ఒఆర్ఒపి అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక మహత్వపూర్ణ సందర్భం.  ఒఆర్ఒపి కోసం భారతదేశం దశాబ్దాల పాటు ఎదురుచూసింది.

మన పూర్వ సైనికుల కు, వారి విశేష సేవలకు గాను, నేను ప్రణామం చేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***

 


(రిలీజ్ ఐడి: 1671061) సందర్శకుల సూచీ సంఖ్య : : 206