ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో తగ్గుదల బాటలో దూసుకెళుతున్న చికిత్స పొందుతున్నవారి సంఖ్య
ప్రపంచస్థాయిలో ప్రతి పది లక్షల్లో అతి తక్కువ కేసులున్న దేశాల్లో ఒకటి
వరుసగా మూడో రోజు కూడా చికిత్సలో ఉన్నది 6 లక్షల లోపే
17 రాష్ట్రాల్లో ప్రతి పది లక్షలమందిలో కేసులు జాతీయ సగటు కంటే తక్కువ
Posted On:
01 NOV 2020 11:29AM by PIB Hyderabad
కోవిడ్ తో చికిత్స పొందుతున్న కేసులు భారత్ లో గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. వరుసగా మూడో రోజు కూడా చికిత్సలో ఉన్న కేసులు 6 లక్షల లోపే ఉన్నాయి. ఇలా ఆరు లక్షల లోపు కేసులుండటం గడిచిన మూడు నెలల కిందట మాత్రమే జరిగింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 5,70,458 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పుడు ఇంకా చికిత్సలో ఉన్నవారు 6.97 శాతానికి తగ్గిపోయారు. దీన్ని బట్టి ఈ శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నట్టు అర్థమవుతోంది.
సమగ్రంగా పరీక్షలు జరపటం, సకాలంలో ఆనవాళ్ళు పట్టుకోవటం, వేగంగా ఆస్పత్రికి తరలించటం అనే కేంద్ర ప్రభుత్వపు ముప్పేట వ్యూహాన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థిరంగా అమలు చేయటం. ప్రామాణిక విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలోను, ఐసొలేషన్ లో ఉన్నవారికి చికిత్స అందించటం వలన కోవిడ్ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయగలిగారు.
కోవిడ్ మీద పోరులో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న వ్యూహానికి అనుగుణంగా, పోరాడుతున్న తీరుకు తగినట్టుగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉంది. కర్నాటకలో గత 24 గంటలలో చాలా వేగంగా తగ్గుదల నమొదైంది.
చికిత్స పొందుతున్నవారి సంఖ్య వేగంగా తగ్గుతూ రావటం వలన ప్రతి పది లక్షలమందిలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉన్న దేశాల సరసన భారత్ నిలిచింది. భారత్ లో ప్రతి పది లక్షల మందిలో 5,930 మంది కరోనా బారినపడ్దారు.
17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి 10 లక్షలమందిలో పాజిటివ్ కేసులు జాతీయ సగటు కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యాయి.
భారత్ దేశంలో కోవిడ్ మరణాలు బాగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో 470 మరణాలు నమోదయ్యాయి. ప్రతి పది లక్షల జనాభాలో మరణాల సంఖ్య విషయానికొస్తే ప్రపంచంలో అతి తక్కువగా నమోదైన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ లో 88 మరణాలు నమోదైంది.
21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి పది లక్షల జనాభాకు నమోదైన మరణాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గుదల బాటలో కొనసాగుతూ ఉండటానికి కారణం కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటమే. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 74,91,513. కోలుకున్నవారికీ, చికిత్సపొందుతూ ఉన్నవారికి మధ్య అంతరం 69 లక్షలు దాటి 69,21,055 కు చేరింది. ఇలా కోలుకుంటున్నవారు పెరిగే కొద్దీ అంతరం మరింత పెరుగుతూ వస్తోంది.
ఎక్కువమంది కోలుకుంటున్నకొద్దీ దేశవ్యాప్తంగా కోలుకుంటున్నవారి శాతం పెరుగుతూ 91.54% చేరింది. గడిచిన 24 గంటలలో 58,684 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో గత 24 గంటల్లో వచ్చిన కొత్త పాజిటివ్ కేసులు 46,963. ఈ కొత్త కేసులలో 76% కేవలం 10 రాష్టాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వీటిలో కర్నాటక, కేరళ, మహారాష్ట్ర గరిష్ఠంగా ఏడేసి వేలకు పైగా కేసులు డిశ్చార్జ్ అయినట్టు నమోదు చేసుకోగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నాలుగేసి వేలకు పైగా డిశ్చార్జ్ అయిన కేసులు జోడించాయి.
గత 24 గంటలలో 46,963 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 77% పది రాష్ట్రాలలోనే ఉన్నాయి. 7,000 కు పైగా కొత్త కేసులు వచ్చిన కేరళ ఇప్పటికీ ఇంకా అధిక సంఖ్యలో కోవిడ్ బాధితులను నమోదు చేసుకుంటున్న రాష్ట్రంగా ఉంది. ఐదేసి వేలకు పైగా కేసులు నమోదైన మహారాష్ట్ర, ఢిల్లీ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
గత 24 గంటలలో 470 మంది కోవిడ్ బాధితులు చనిపోగా, వారిలో 78% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వారిలో 15% మరణాలతో ( 74 మరణాలు) మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
****
(Release ID: 1669283)
Visitor Counter : 214
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam