హోం మంత్రిత్వ శాఖ
'రాష్ట్రీయ ఏక్తా దివాస్' పురస్కరించుకొని న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్‌లో ప్రత్యేక కార్యక్రమం
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్
“సర్దార్ పటేల్ గారి ఉక్కులాంటి దృఢ నాయకత్వం, భక్తి మరియు దేశభక్తి మాకు నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయి”: కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి ప్రజలకు రాష్ట్ర ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ. దేశం తరపున గొప్ప దేశభక్తుడైన సర్దార్ పటేల్ గారికి నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి
"జాతీయ ఐక్యత యొక్క సారాంశం వివరించి ప్రతి భారతీయుడి హృదయంలో నిలిచిపోయిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారికి నమస్కారం" అమిత్ షా
"చెల్లాచెదురుగా ఉన్న వందలాది సంస్థానాలను స్వాతంత్య్రానంతర సర్దార్ పటేల్ ఏకం చేసి.. నేటి బలమైన భారతదేశానికి పునాది వేశారు. ఈ దిశగా ఆయన చేసిన గొప్ప కృషి, నిర్ణయాత్మక నాయకత్వం మరియు మాతృభూమి పట్ల పటేల్ కనబరిచిన అసమానమైన నిబద్ధతను దేశం ఎప్పటికీ మరచిపోదు ” కేంద్ర హోంమంత్రి
Posted On:
31 OCT 2020 12:08PM by PIB Hyderabad
'రాష్ట్రీయ ఏక్తా దివాస్' పురస్కరించుకొని ఈ రోజు న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్‌లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. 'రాష్ట్రీయ ఏక్తా దివాస్‌స సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ “సర్దార్ పటేల్ గారి ఉక్కులాంటి దృఢ నాయకత్వం, భక్తి మరియు దేశభక్తి మాకు నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయి” అని అన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు. “దేశం యొక్క ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తున్నానని మరియు నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢమైన దృష్టి మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞను తీసుకుంటాను. నా దేశం యొక్క అంతర్గత భద్రతను నిర్ధారించడానికి నా స్వంత సహకారం అందించాలని నేను నిశ్చయించుకున్నాను ” అని కేంద్ర హోంమంత్రి ప్రతిజ్ఞ చేశారు.
ట్విట్టర్‌లో శ్రీ అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పిస్తూ ఆ గొప్ప దేశభక్తుడికి కృతజ్ఞతలు తెలిపారు. "జాతీయ ఐక్యత యొక్క సారాంశం వివరించి ఆ దిశగా విశేష కృషి చేసి ప్రతి భారతీయుడి హృదయంలో నిలిచిపోయిన భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారికి నమస్కారం. మన స్వాతంత్య్రానంతర చెల్లాచెదురుగా ఉన్న వందలాది సంస్థానాలను సర్దార్ పటేల్ ఏకం చేసి నేటి బలమైన భారతదేశానికి పునాది వేశారు. ఈ దిశగా ఆయన చేసిన గొప్ప కృషి, నిర్ణయాత్మక నాయకత్వం, మాతృభూమి పట్ల పటేల్ కనబరిచిన అసమానమైన నిబద్ధతను దేశం ఎప్పటికీ మరచిపోదు"అని అమిత్ షా అన్నారు.
“భారతదేశాన్ని ఏకం చేయడం నుండి సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం వరకు, సర్దార్ పటేల్ తన జీవితంలో ప్రతి క్షణాన్ని దేశం ఐక్యత మరియు సమైక్యత కోసం అంకితం చేశారు. అంతటి గొప్ప దేశభక్తుడు, భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కు మన గొప్ప దేశం తరఫున నా నివాళులు అర్పిస్తున్నాను”. అని అమిత్ షా తెలిపారు.
****
(Release ID: 1669096)
Visitor Counter : 257
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam