మంత్రిమండలి
భారతదేశానికి చెందిన ఐసిఎఐ కి, పాపువా న్యూ గినీ కి చెందిన సిపిఎ కు మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
21 OCT 2020 3:25PM by PIB Hyderabad
ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్, పాపువా న్యూ గినీ (సిపిఎ పిఎన్‌జి) కి మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలు పాపువా న్యూ గినీ లో సామర్ధ్యాల పెంపుదలకు, అకౌంటింగ్, ఫైనాన్షియల్, ఆడిట్ నాలెజ్ బేస్ ను పటిష్టపరచేందుకు కలసికట్టుగా కృషి చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందం.
అమలు వ్యూహం- లక్ష్యాలు :
ఈ క్రింద పేర్కొన్న రంగాలలో ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ), కి చెందిన సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్, పాపువా న్యూ గినీ (సిపిఎ పిఎన్‌జి) లు కలసి పని చేయనున్నాయి:
- పాపువా న్యూ గినీ లో సాంకేతిక కార్యక్రమాలను, చర్చా సభల ను, సమ్మేళనాలను ఏర్పాటు చేసి, వాటిని నిర్వహించడం;
- కార్పొరేట్ గవర్నెన్స్, టెక్నికల్ రిసర్చ్- అడ్వైజ్, క్వాలిటీ అశ్యోరన్స్, ఫోరెన్సిక్ అకౌంటింగ్, కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవెలప్ మెంట్ (సిపిడి) లతో పాటు, ఇరు పక్షాల హితం ముడిపడి ఉండే మరే ఇతర అంశాలలో సైతం సహకారాన్ని నిలబెట్టుకోవడం;
- భారతదేశం లోనూ, పాపువా న్యూ గినీ లోనూ అకౌంటెన్సీ వృత్తి కి సంబంధించి అందుబాటులో ఉన్న ఆంక్షలు లేనటువంటి సమాచారాన్ని రెండు పక్షాలు పరస్పరం వెల్లడి చేసుకోవడం, అవసరమైనప్పుడు సిపిఎ, పిఎన్‌జి పరీక్ష కోసం నిర్ధిష్ట అంశాల లో మాడ్యూల్స్ ను అభివృద్ధిపరచడం;
- విద్యార్థుల, ఫేకల్టీ ల ఆదాన, ప్రదాన కార్యక్రమాలను మొదలుపెట్టడం;
- పాపువా న్యూ గినీ లో అకౌంటింగ్, ఫైన్సాన్స్, ఆడిట్ రంగాల లో అల్పకాలిక వృత్తిసంబంధి కోర్సులను అందజేయడం.
ప్రభావం:
భారతదేశ చార్టర్డ్ అకౌంటెంట్లు (సిఎ) స్థానిక వ్యాపారులకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంశాల లో సహాయం అందిస్తూ వస్తున్నారు. వారు మంచి పేరు ను కూడా తెచ్చుకొన్నారు. ప్రతిపాదిత ఎమ్ఒయు తో ఈ భరోసా ఇంకా పటిష్టం అవుతుందన్న అంచనా ఉంది. ఐసిఎఐ కి పిఎన్ జి చాప్టర్ సహా ఆస్ట్రేలేశియా-ఒసీనియా ప్రాంతం లో సభ్యుల సంఖ్య 3000 కు పైబడింది. తాజా ఎమ్ఒయు మాధ్యమం ద్వారా సిపిఎ, పిఎన్‌జి కి అందే సహాయం ఈ ప్రాంతం లో ఇప్పటికే క్రియాశీలంగా ఉన్న ఐసిఎఐ సభ్యులకు లబ్ధి చేకూర్చగలదు. అంతేకాకుండా, ఐసిఎఐ సభ్యులకు మరింత ప్రోత్సామం కూడా అందగలదు.
పూర్వరంగం:
భారతదేశం లో చార్టర్డ్ అకౌంటెట్ల వృత్తి ని క్రమబద్దీకరించడానికి ‘‘చార్టర్డ్ అకౌంటెంట్ల చట్టం,1949’’ పరిధి లో ఒక చట్టబద్ధ సంస్థ గా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్ పాపువా న్యూ గినీ (సిపిఎ పిఎన్‌జి) ని పాపువా న్యూ గినీ లో అకౌంటింగ్, ఆడిటింగ్ సంబంధిత ప్రమాణాలను నిర్దేశించడం కోసం, అకౌంటెన్సీ వృత్తి కి సంబంధించిన హితాలను ప్రోత్సహించడం కోసం అకౌంటెంట్స్ చట్టం, 1996 పరిధిలో ఒక ప్రతిష్టాత్మకమైన అకౌంటింగ్ వృత్తి సంబంధిత సంస్థ గా ఏర్పాటు చేయడమైంది.
***
(Release ID: 1666516)
Visitor Counter : 177
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada