PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
20 OCT 2020 6:05PM by PIB Hyderabad
(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)
#Unite2FightCorona
#IndiaFightsCorona
*మూడు నెలల అనంతరం తొలిసారిగా కొత్త కేసుల సంఖ్య 50,000 కంటే తక్కువకు పడిపోయాయి.
*మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య లో 10 శాతం కంటే తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు ప్రస్తుతం మరింత తగ్గి 7.5 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి.
*కోవిడ్ కేసుల రికవరీ రేటు మరింత పెరిగి 88.63 శాతానికి చేరింది.
*అత్యధిక రికవరీరేటు కలిగిన దేశం కేవలం ఇండియా మాత్రమే. అంతేకాదు అంతర్జాతీయంగా అత్యంత తక్కువ మరణాల రేటు కలిగిన దేశం కూడా (1.52 శాతం)
*అద్భుతమైన శాస్త్రవిజ్ఞాన సమాజం, మంచి శాస్త్రవిజ్ఞాన సంస్థలు ఇండియా బలం. ప్రత్యేకించి కోవిడ్ -19 పోరాట సమయంలో గత కొద్దినెలలుగా ఇది తోడ్పడింది.
ఇండియా కీలక మైలు రాళ్లను దాటింది.కోవిడ్ కొత్త కేసుల సంఖ్య తొలిసారిగా గత 3 నెలల తర్వాత కేసుల సంఖ్య 50,000 కంటే తక్కువకు పడిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసులలో 10 శాతం కంటే తక్కువ ఉన్నాయి.యాక్టివ్ కేసులు మరింతగా పడిపోయి ప్రస్తుతం 7.5 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి.
కోవిడ్ పై పోరాటంలో ఇండియా ఎన్నో మైలురాళ్లను దాటింది. గత 24 గంటలలో కొత్తగా నిర్ధారణ అయిన కోవిడ్ కేసుల సంఖ్య 50 ,000 కంటే తక్కువ ( 46,790) గా ఉన్నాయి. మూడు నెలల వ్యవధిలో తొలిసారిగా కేసులు ఈ స్థాయికి పడిపోయాయి. జూలై 28న కోవిడ్ కొత్త కేసుల సంఖ్య 47,703 గా ఉండేవి. మరో విజయం ఏమంటే యాక్టివ్ కేసుల సంఖ్య 10 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7.5 లక్షల కంటే తక్కువ (7,48,538 )గా ఉన్నాయి. అంటే మొత్తం కేసులలో 9.85 శాతం. యాక్టివ్ కేసులు తగ్గడంతోపాటు రికవరీ రేటు కూడా విపరీతంగా పెరిగింది. మొత్తం రికవర్ అయిన కేసుల సంఖ్య67 లక్షలు దాటింది. అంటే (67,33,328).యాక్టివ్ కేసులు, రికవర్ అయిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రికవర్ అయిన కేసుల సంఖ్య ప్రస్తుతం 59,84,790 గా ఉండగా , గత 24 గంటలలో 69,720 మంది కోలుకున్నారు. జాతీయ స్థాయిలో కోలుకున్న వారి సగటు 88.63 శాతానికి పెరిగింది. కొత్తగా రికవర్ అయిన కేసులలో 78 శాతం ప్రధానంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఒకే రోజు 15 ,000 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకుని మహారాష్ట్ర ముందుభాగాన ఉండగా , కర్ణాటక 8 వేలకు పైగా రికవరీలతో రెండో స్థానంలో ఉంది.కొత్తగా నిర్ణారణ అయిన కేసులలో 75 శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి గా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక,కేరళ రాష్ట్రాలు కొత్తగా నిర్ణారణ అయిన కేసులలో 5 ,000 కేసులు ఈ రాష్ట్రాలలోనే ఉన్నాయి.గత 24 గంటలలో 587 మరణాలు సంభవించాయి.ఇందులో 81 శాతం కేసులు పదిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి .ఈరోజు రెండో రోజు కూడా మరణాల సంఖ్య 600 కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఒకరోజు గరిష్ఠ మరణాల సంఖ్య 125 గా ఉన్నాయి. అత్యధిక రికవరీలు కలిగిన ఏకైక దేశం ఇండియా. అలాగే అంతర్జాతీయంగా మరణాల రేటు తక్కువగా ఉంది. ఇవాళ మరణాల రేటు 1.52 శాతం వద్ద ఉంది.
మరిన్ని వివరాలకు.చూడండి.....
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666108
ఇండియాలో స్పష్టంగా కనిపిస్తున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ ప్రభావం
14 రాష్ట్రాలలో పిల్లల్లో తగ్గిన నులిపురుగులు, 9 రాష్ట్రాలలో గణనీయంగా తగ్గిన నులిపురుగుల సమస్య
పిల్లలలో నులిపురుగుల సమస్య ప్రజారోగ్య సమస్యగా ఉంటున్నది. సాయిల్ ట్రాన్స్‌మిటెడ్ హెల్‌మిన్‌థియాసిస్ _ఎస్‌టిహెచ్ ఇది పేగుల్లో ఇన్‌ఫెక్షన్ గురిచేసే నులిపురుగుల సమస్య.ఇది పిల్లల ఎదుగుదల పైన వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి వి ఏర్పడవచ్చు.ఇందుకు క్రమంత ప్పకుండా నులిపురుగుల నివారణ మందులు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీనివల్లపిల్లల్లో,కౌమారదశలోని వారిలో ఎస్‌టిహెచ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితులు మెరుగుపడడానికి ఇది ఉపకరిస్తుంది.తద్వారా మెరుగైన ఆరోగ్యం, పోషకాలు పిల్లలకు అందడానికి వీలు కలుగుతుంది.
2015లో , జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం (ఎన్‌డిడి) నిర్వహిస్తున్నారు. దీనిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. సంవత్సరంలో రెండుసార్లు పాఠశాలలు,అంగన్‌వాడీలలో ఒక రోజుకార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఆల్బెండజోల్ టాబ్లెట్‌ను నులిపురుగుల నివారణకు పిల్లలు,కౌమారదశలోని వారికి సామూహిక మందుల పంపిణీ కార్యక్రమం కింద అందజేయడం జరుగుతుంది. అంతర్జాతీయంగా ఈకార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈ ఏడాది మోదట్లో దేశంలో చివరి రౌండ్ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో (కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేయడం జరిగింది) 11 కోట్లమంది పిల్లలు, కౌమారదశలోనివారికి ఆల్బెండజోల్ టాబ్లెట్‌ను 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పంపిణీ చేయడం జరిగింది.
మరిన్నివివరాలకు....
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666096
రానున్న సుదీర్ఘ పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జనాందోళన్ అమలుపై గుజరాత్ ఉ పముఖ్యమంత్రి శ్రీ నితిన్‌భాయ్ పటేల్ తో చర్చించిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్‌పటేల్‌తో, ఆ రాష్ట్ర వైద్యవిద్య , ఆరోగ్య శాఖ మంత్రితో అన్ని జిల్లాల కలెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో మాట్లాడారు.ప్రస్తుతం దేశం కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి సంబంధించి 10 వ నెలలో ఉందని గుర్తు చేస్తూ డాక్టర్ హర్షవర్ధన్, దేశంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 7,72,000 ఉన్నాయని, నెల ముగిసేలోపు ఇవి 10 లక్షల కన్నా తక్కువే ఉంటాయని ఆయన అన్నారు.గత 24 గంటలలో 55,722 కేసులు నమోదయ్యాయని, అలాగే 66,396 మంది వివిధ ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. కోవిడ్ కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం 86.3 రోజులు అయిందని,దేశంలో మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటనున్నదని ఆయన తెలిపారు. గుజరాత్‌లో కోవిడ్ నియంత్రణ గురించి ప్రస్తావిస్తూ, ఇంతకు ముందు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన గుజరాత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, దేశంలో కోవిడ్ కేసుల రికవరీ రేటు 88.26 శాతం ఉండగా గుజరాత్ లో రికవరీ రేటు 90.57 శాతంగా ఉందన్నారు. ప్రతి పదిలక్షల మందికి, 77,785 పరీక్షలు నిర్వహించినందుకు ఆయన రాష్ట్రాన్నిఅభినందించారు. దేశ సగటు ప్రతి పది లక్షలకు 68.901 పరీక్షలు ఉన్నాయన్నారు. రానున్న పండగల సీజన్, శీతాకాలం సందర్భంగా రానున్న మూడు నెలలు ముప్పు ఉందని, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బ తినకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖానికి మాస్క్ ,లేదా ఫేస్ కవర్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం తప్పని సరి అన్న ప్రధానమంత్రి సందేశాన్ని చిట్టచివరి పౌరుడివరకూ చేరాలని ఆయన అన్నారు. ఎక్కడైనా దీనిని పాటించని వారుంటే గమనించాలన్నారు. కోవిడ్ నిరోధానికి అనుగుణంగా మనం వ్యవహరించడం సులభమని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు...
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665942
గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం 2020 నుద్దేశించి కీలకోపన్యాసం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం 2020 నుద్దేశించి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి , సైన్సు, ఆవిష్కరణలపై పెట్టుబడి పెట్టే సమాజాల చేతిలో భవిష్యత్తును రూపుదిద్దుకుంటుందని అన్నారు.హ్రస్వదృష్టికలిగిన విధానాలతో కాకుండా సైన్సు, ఆవిష్కరణలపై ముందుగానే పెట్టుబడి పెట్టినట్టయితే, వాటి ఫలితాలు సరైన సమయంలో అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణల ప్రయాణం ప్రజల భాగస్వామ్యం, కొలాబరేషన్లతో రూపుదిద్దుకోవాలని ఆయన అన్నారు. సైన్సు ఏకాకిగా అభివృద్ధిలోకి రాలేదని, గ్రాండ్ ఛాలెంజెస్ కార్యక్రమానికి ఈ విలువలు తెలుసునని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి టీమ్ వర్క్ ప్రాధాన్యతను అంతర్జాతీయంగా తెలియజెప్పిందని చెప్పారు. వ్యాధులకు భౌగోళిక హద్దులు లేవని జాతి , రంగు, విశ్వాసాలు, స్త్రీలా పురుషులా అన్నదానితో సంబంధం లేదని అన్నారు. ఇందులో పలు అంటు వ్యాధులు, అంటువ్యాధులు కానివీ ఉన్నాయని ఇవి ప్రజలపై ప్రభావం చూపుతున్నాయన్నారు.ఇండియాలోని శాస్త్రవిజ్ఞాన సమాజం, శాస్త్రవిజ్ఞాన సంస్థలు దేశానికి గొప్ప ఆస్తిగా ఉన్నాయని, ముఖ్యంగా గత కొద్దినెలల్లో ఇది రుజువైందని ఆయన అన్నారు. కోవిడ్ నియంత్రణ దగ్గరనుంచి ,సామర్ధ్యాల నిర్మాణం వరకు వారు ఎన్నో అద్భుతాలు సాధించారని ఆయన అన్నారు. దేశ జనాభా ఎక్కువ అయినప్పటికీ దేశంలో కోవిడ్ మరణాలు స్వల్పంగా ఉన్నాయని ఇది, ప్రజల భాగస్వామ్యంతో ఇది సాధించడం జరిగిందని అన్నారు. రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి చెప్పారు. కేసుల పెరుగుదల రేటు పడిపోయిందన్నారు. 88 శాతం అత్యధిక రికవరీ రేటు కలిగిఉన్నామన్నారు. కోవిడ్‌కు వాక్సిన్ అభివృద్ధిలో ఇండియా ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. దేశంలో 30 రకాల వాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు.ఇందులో మూడు అడ్వాన్స్‌డ్ దశలో ఉన్నాయన్నారు. ఇండియా ఇప్పటికే వాక్సిన్ పంపిణీ కి సంబంధించి సువ్యవస్థిత పంపిణీపై పనిచేస్తున్నదని తెలిపారు. డిజిటిలైజ్‌డ్ నెట్‌వర్క్ దానితోపాటుడిజిటల్ హెల్త్ ఐడి వంటి వాటిని దేశప్రజల ఇమ్యునైజేషన్‌కు వాడనున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
మరిన్ని వివరాలకు.....
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665979
గ్రాండ్ ఛాలెంజ్ వార్షిక సమావేశం 2020 లో ప్రధానమంత్రి కీలకోపన్యాసం పూర్తి పాఠం కోసం
చూడండి....
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666075
ఇండియా ఒమన్ 9వ సంయుక్త కమిషన్ వర్చువల్ సమావేశం
ఇండియా ,ఒమన్ సంయుక్త కమిషన్ 9వ సమావేశం (జెసిఎం) నిన్న వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి , హిజ్ ఎక్సలెన్సీ క్వాయిస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్, సుల్తనేట్ ఆఫ్ ఒమన్ వాణి్జ్య పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఉభయ పక్షాలనుంచి వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వశాఖల ప్రతినిధుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువైపులా వాణఙ్యం, పెట్టుబడుల సంబంధాలలో ఇటీవలి పరిణామాలు సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఉభయపక్షాలూ తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించాయి. వాణిజ్య, ఆర్ధిక సంబంధాలలో ఉపయోగించకుండా ఉన్న శక్తిని మరింతగా ఉపయోగించేందుకు ఒక దేశం మరోదేశంలో పెట్టుబడులు పెట్టేందుకువ్యాపారాలను , వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి , విస్తరింపచేయడానికి తమ చిత్తశుద్ధిని ప్రకటించాయి.కోవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊహించని రీతిలో ఏర్పడిన ఆరోగ్య,ఆర్దిక పరిస్తితిపై కూడా ఇరుపక్షాలూ తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
మరిన్ని వివరాలకు
మరిన్ని వివరాలకు : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665998
పిఐబి ఫీల్డ్ ఆఫీసులనుంచి సమాచారం
*అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్‌లో కోవిడ్ యాక్టివ్ కేసులు 2833 గా ఉన్నాయి. నిన్న 238 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 10,780
*అస్సాం: అస్సాంలో 34,956 పరీక్షలు నిర్వహించగా 698 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 2 శాతంగాఉంది. అస్సాంలో 1530 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసులు 2,01,407. కోలుకున్న వారు 85.99 శాతం. యాక్టివ్ కేసులు 13.56 శాతంగా ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఒక ట్వీట్‌లో తెలిపారు.
* మేఘాలయ: కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 2.069 గా ఉన్నాయి. మొత్తం బిఎస్ఎఫ్, సాయుధ బలగాలు100, మొత్తం ఇతరులు 1969, మేఘాలయలో మొత్తం కోలుకున్నవారు 6,392 మంది.
*మిజోరం : మిజోరంలో నిన్న 27 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.మొత్తం కేసులు 2,280. యాక్టివ్ కేసులు 129
*నాగాలాండ్ : కోవిడ్ 19 స్థానిక వ్యాప్తి నుంచి కమ్యూనిటీ వ్యాప్తిగా మారుతుందన్న భయాల మధ్య నాగాలాండ్ కోవిడ్ కేసుల సంఖ్య 8000 దిశగా వెళుతున్నది. సోమవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 7,953.
*సిక్కిం : గత 24 గంటలలో సిక్కింలో మరో రెండు మరణాలు సంభవించాయి. సిక్కింలో కోవిడ్ మరణాల సంఖ్య 62 కు చేరింది.
* మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ప్రైవేటు వైద్యులందరూ రోజుకు కనీసం రెండు మూడు గంటలు కోవిడ్ సెంటర్లను సందర్శించి ,కోవిడ్ నియంత్రణ చర్యలలో పాల్గోనాలని ఆదేశాలు ఇచ్చినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాజేష్ తోపే తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని కోవిడ్ కేంద్రాలకు కొంత సమయం కేటాయించాల్సిందిగా ఆయన ప్రైవేటు వైద్యులను కోరారు. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో మరణాల రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టిపెట్టాల్సిందిగా కోరారు. నిపుణుల మార్గనిర్దేశంలో మరణాల రేటు తగ్గించవచ్చని ఆయన అన్నారు. మహారాష్ట్రలో సోమవారం నాడు 5,984 కేసులు నమోదు కాగా 15,069 మంది కోలుకున్నారు. దీనితో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1.73 లక్షలకు తగ్గింది.
*గుజరాత్ : గుజరాత్‌లో కోవిడ్ కొత్త కేసులు , గత 90 రోజులలో తొలిసారిగా వెయ్యికంటే తక్కువకు చేరాయి. ఇలా ఉండగా, కోవిడ్ నియంత్రణ విషయంలో కేంద్రం గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందించింది. వీడియో కాన్ఫరెన్సుద్వారా జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఇంతకు ముందు కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న గుజరాత్, రికవరీలలో ,పరీక్షలలో అద్భుత ప్రగతి సాధించిందని అన్నారు. గుజరాత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 14,277
*రాజస్థాన్ : రాజస్థాన్‌లో సోమవారం మరో 12 కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 1760కి చేరింది. తాజాగా 1960 కేసులు నమోదు కావడంతో కోవిడ్ కేసుల సంఖ్య 1,75, 266 కుచేరింది. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఆరోగ్య బులిటన్ ప్రకారం , రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,52,573 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో యాక్టవ్ కేసుల సంఖ్య 20,893.
*ఛత్తీస్‌ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లో కోవిడ్ 19 కేసుల సంఖ్య సోమవారం నాటికి 1.62 లక్షలకు చేరింది. నిన్న 2,376 కేసులు నమోదయ్యాయి. రాయ్‌పూర్ జిల్లాలో 196 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 39,285 కు చేరింది. 523 మంది మరణించారు. జాంజ్‌గిర్- చంపా లలో 200 కొత్త కేసులు ,బిలాస్‌పూర్ లో 195 కేసులు,దుర్గ్‌లో 101 కేసులు రాయగఢ్‌లో 172 కేసులు నమోదయ్యాయి.
*కేరళ: ఎర్నాకుళంలో కోవిడ్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈరోజు మరో నలుగురు కోవిడ్ వైరస్ బారినపడ్డారు. దీనితో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 1186 కుచేరింది. జిల్లాలోని పోలీస్‌క్యాంప్‌లో 70 మంది పోలీసులకు ఈరోజు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం 5,022 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 92,731 మంది పేషెంట్లు చికిత్సపొందుతున్నారు. 2.77 లక్షల మంది ప్రజలు వివిధ జిల్లాలలో పరిశీలనలో ఉన్నారు.
*తమిళనాడు : సుమారు ఆరునెలల విరామం తర్వాత సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్.టి.ఒ) తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రస్తుత కోవిడ్ మహమ్మారినేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రవాణా డాక్యుమెంట్లను ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య గడువు ముగిసే వాటిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఐఐటి మద్రాసు తమ కోర్సు వర్క్‌ను సరళం చేసింది. విద్యార్ధులు సగం కోర్సులను ఎంపిక చేసుకోవచ్చని, ఒక సెమిస్టర్‌ను విదేశాలలో అయినా చదవచ్చని తెలిపింది. కోవిడ్ లాక్‌డౌన్ అనంతరం తిరుపూరు పరిశ్రమలు తిరిగి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. యూరప్, ఇతర దేశాలలో కోవిడ్ 19 రెండోదశ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ఎగుమతులపై వారు ఆందోళన చెందుతున్నారు.
*కర్ణాటక : ఏడు నెలల విరామం అనంతరం కర్ణాటక- తమిళనాడు మధ్య తొలి ప్రయాణికుల రైలు అక్టోబర్ 23న నడవనుంది. నవరాత్రి,దీపావళి పండగలను పురస్కరించుకుని దీనిని నడపనున్నారు. నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యుఆర్) అక్టోబర్ 23, డిసెంబర్ 2 వ తేదీ మధ్య ఐదు జతల పండగ రైళ్లను నడపనుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో కోవిడ్ కు సంబంధించి పరిస్థితిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ సమీక్షించారు. ఆయన ఇటీవల వర్షాలు, వరదలకు గురైన కాల్బుర్గి, బాగల్‌కోట్, కొప్పాల్, యాద్గిర్ బెలగావి, విజయపుర డిప్యూటి కమిషనర్లతో ఆయన మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
*ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆరోజున పాఠశాలలు ప్రారంభమౌతాయా లేదా అన్నది చూడవలసి ఉంది. శ్రీశైలం సున్నిపెంటలో ఒక పాఠశాలకు చెందిన 29 మంది విద్యార్ధులు కోవిడ్ బారినపడినట్టు తేలడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కర్నూలు జిల్లా డిఇఒ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పడిపోయాయి. సోమవారం నాడు కోవిడ్ కేసుల సంఖ్య 3000కంటే తక్కువకు పడిపోయాయి. రెండో దశ కోవిడ్ వ్యాప్తి ఉండవచ్చని ఐసిఎంఆర్ హెచ్చరించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆరోగ్య శాఖను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ ఆదేశించారు. ఈ విషయమై ప్రజలలో అవగాహన కల్పించాలని ముందస్తుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.
*తెలంగాణ : తెలంగాణాలో గత 24 గంటలలో 1486 కొత్త కేసులు నమోదు కాగా, 1891 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ఇందులో జిహెచ్ఎంసి నుంచి 235 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,24,545. యాక్టివ్ కేసులు 21,098, మరణాలు 1282, కోవిడ్ నుంచి కోలుకున్న వారు 2,02,577. వైద్య అధికారులు పేషంట్లవద్దకు వెళ్లాలని, ఫ్లూ వంటి లక్షణాలు కలిగిన వారికి తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.
FACT CHECK
***
(Release ID: 1666258)
Visitor Counter : 250