ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ముఖ్యమైన మైలురాళ్లను అధిగమించిన భారత్
3 నెలల తర్వాత మొదటిసారి కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 50,000 కన్నా తక్కువగా ఉన్నాయి
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 10% కన్నా తక్కువే
ఇంకా తగ్గిన క్రియాశీల కేసులు; ఇపుడు 7.5 లక్షల కన్నా తక్కువే
Posted On:
20 OCT 2020 11:09AM by PIB Hyderabad
కోవిడ్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారతదేశం అనేక ముఖ్యమైన మైలురాళ్లను దాటింది. గత 24 గంటల్లో కొత్తగా నిర్ధారించబడిన కేసులు దాదాపు మూడు నెలల్లో మొదటిసారిగా 50,000 (46,790) కన్నా తక్కువకు పడిపోయాయి. జూలై 28 న కొత్త కేసులు 47,703.
ప్రతిరోజూ అధిక సంఖ్యలో కోవిడ్ రోగులు కోలుకోవడం, మరణాల రేటు తగ్గుముఖం పట్టడంతో, చురుకైన కేసులను నమోదు చేయడంలో భారతదేశం స్థిరమైన ధోరణి కొనసాగుతోంది. ఈ విజయ పరంపరలో క్రియాశీల కేసుల శాతం 10% కన్నా తక్కువకు పడిపోయాయి. నేడు దేశం యొక్క మొత్తం పాజిటివ్ కేసులు 7.5 లక్షల (7,48,538) కన్నా తక్కువ మరియు మొత్తం కేసులలో కేవలం 9.85% మాత్రమే ఉన్నాయి.
.
సమగ్ర మరియు అధిక దేశవ్యాప్త పరీక్ష, సత్వర మరియు సమర్థవంతమైన నిఘా, ట్రాకింగ్, శీఘ్రంగా ఆసుపత్రిలో చేరడం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్ సమర్థవంతంగా పాటించడం ఈ విజయానికి కారణం. కేంద్రం వ్యూహం ప్రకారం రాష్ట్రాలు / యుటిల సహకార, కేంద్రీకృత మరియు సమర్థవంతమైన చర్యల ఫలితం ఇది. ఈ విజయం దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న వైద్యులు, పారామెడిక్స్, ఫ్రంట్‌లైన్ కార్మికులు, అన్ని ఇతర కోవిడ్-19 యోధుల నిస్వార్థ సేవ, అంకితభావానికి గొప్ప ఉదాహరణ.
రికవరీలలో విశేషమైన పెరుగుదలతో అనుబంధంగా క్రియాశీల కేసులు తగ్గాయి. కోలుకున్న మొత్తం కేసులు 67 లక్షలు (67,33,328) దాటాయి. క్రియాశీల కేసులు మరియు కోలుకున్న కేసుల మధ్య వ్యత్యాసం స్థిరంగా పెరుగుతోంది. ఆ సంఖ్య ఈ రోజు 59,84,790 వద్ద ఉంది. 69,720 మంది రోగులు గత 24 గంటల్లో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ రికవరీ రేటు మరింత 88.63 శాతానికి పెరిగింది. కొత్తగా కోలుకున్న కేసులలో 78% 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నట్లు గమనించబడింది .మహారాష్ట్ర 15,000 కి పైగా ఒకే రోజు రికవరీలతో ఆధిక్యంలో కొనసాగుతోంది, తరువాత కర్ణాటక 8,000 కన్నా ఎక్కువ రికవరీలతో ఉంది.
కొత్తగా నిర్ధారించిన వాటిలో 75% కేసులు 10 రాష్ట్రాలు మరియు యుటిల నుండి వచ్చినవి. కొత్తగా ధృవీకరించబడిన కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళ నుండే 5,000 ఉన్నాయి.
గత 24 గంటల్లో 587 కేసులలో మరణాలు సంభవించాయి. వీటిలో, దాదాపు 81% పది రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నాయి. వరుసగా రెండవ రోజు మరణాలు 600 కన్నా తక్కువ. మహారాష్ట్ర గరిష్టంగా ఒకే రోజు మరణాలను (125 మరణాలు) నివేదించింది.
అత్యధిక రికవరీలు సాధించిన ఏకైక దేశం భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప మరణాల రేటును కలిగి ఉంది. ప్రస్తుతం ఇది 1.52% వద్ద ఉంది.
****
(Release ID: 1666108)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam