ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం
రెండో రోజు కూడా 8 లక్షల లోపే బాధితులు
20 వేలకంటే తక్కువ కేసులున్న రాష్టాలు 22
Posted On:
18 OCT 2020 10:56AM by PIB Hyderabad
భారత్ లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య తగ్గుముఖం పడుతున్న ధోరణి కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండో రోజు కూదా బాధితుల సంఖ్య 8 లక్షల లోపే ఉంది. ప్రస్తుతం 7,83,311 మంది కోవిడ్ బాధితులు చికిత్సపొందుతూ ఉన్నారు. దేసంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా ప్రస్తుతం 10.45%.
జాతీయ స్థాయిలో ఇలాంటి ధోరణి కొనసాగుతుండగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 20 వేల లోపు మాత్రమే చికిత్సలో ఉన్నట్టు తేలింది.
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే 20,000 కు పైగా, 50,000 లోపుగా కేసులు చికిత్సలో ఉన్నాయి. 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే 50,000 కు పైగా కేసులున్నాయి.
కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం వల్లనే చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పటివరకూ మొత్తం కోలుకున్నవారి సంఖ్య 65,97,209 కు చేరింది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 58 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే అది 58,13,898.
జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి 88.03% చేరుకుంది. గడిచిన 24 గంటలలో 72,614 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారు 61,871 మందిగా నమోదయ్యారు.
కొత్తకేసులలో 79% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో ఒకే రోజు అత్యధికంగా 10,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 9,000 కేసులతో కేరళది రెండో స్థానం.
గత 24 గంటలలో 1033 మరణాల్ఉ నమోదయ్యాయి. వీటిలో దాదాపు 86% మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లోనే రికార్డయ్యాయి. 44% పైగా (463 మంది) తాజామరణాలు మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి.
****
(Release ID: 1665627)
Visitor Counter : 263
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam