ప్రధాన మంత్రి కార్యాలయం

కెన‌డా లో జ‌రిగే ఇన్ వెస్ట్ ఇండియా స‌మావేశాన్ని ఉద్దేశించి కీల‌కోప‌న్యాసం ఇవ్వ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 OCT 2020 11:32AM by PIB Hyderabad

కెన‌డా లో ఈ రోజు సాయంత్రం 6.30 గంట‌ల‌కు జరగనున్న ఇన్ వెస్ట్ ఇండియా కాన్ఫెరెన్సు ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కీల‌కోప‌న్యాస‌మివ్వనున్నారు.

కెన‌డా కు చెందిన వ్యాపార స‌ముదాయానికి భార‌త‌దేశం లో పెట్టుబ‌డి కి గ‌ల అవ‌కాశాలను గురించిన అన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయాల‌నే, భార‌త‌దేశాన్ని పెట్టుబ‌డి కి ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన కేంద్రం గా క‌ళ్ళ‌కు క‌ట్టాల‌నే ఉద్దేశ్యాలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయ‌డ‌మైంది.

బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇన్ వె స్ట్‌మెంట్ ఫండ్‌ లతో పాటు విమాన‌యానం, ఎల‌క్ట్రానిక్స్‌, త‌యారీ వంటి రంగాల‌కు చెందిన కంపెనీలు, స‌ల‌హా సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాల ప్ర‌తినిధులు ఈ స‌మావేశం లో పాలుపంచుకొనే అవకాశాలు ఉన్నాయి.


***  (Release ID: 1662712) Visitor Counter : 148