ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ మీద పోరులో కీలకమైన మైలురాయి దాటిన భారత్ వరుసగా 2 వారాలుగా చికిత్సలో ఉన్నవారు10 లక్షలలోపే
Posted On:
05 OCT 2020 11:10AM by PIB Hyderabad
కోవిడ్ మీద జరుపుతున్న పోరులో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగి చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య వరుసగా రెండు వారాలుగా ఎలాంటి అంతరాయం లేకుండా 10 లక్షల లోపే కొనసాగుతోంది.
కేంద్ర ప్రభుత్వ సారధ్యంలో “ పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు” అనే మూడంచెల వ్యూహాన్ని ఒక సంపూర్ణ దృక్పథంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వలన ఇది సాధ్యమైంది. దేశవ్యాప్తంగా కరోనా నిర్థారణ పరీక్షలు చురుగ్గా చేపట్టటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటంతోబాటు అతి తక్కువ సమయంలోనే బాధితులను గుర్తించి, వారి వలన వ్యాధిసోకే అవకాశమున్నవారి ఆనవాలు గుర్తించటం తగిన ఫలితాలనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ప్రామాణిక చికిత్సా విధానాలవలన చికిత్సకు ఒక ప్రామాణికత ఏర్పడి అన్ని ఆస్పత్రులూ వీటిని అమలు చేస్తూ వ్యాధి తీవ్రతను అదుపు చేయగలిగాయి.
గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 76,737 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కొత్తగా 74,442 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ విధంగా చూసినప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా వ్యాధి సోకినవారికంటే కోలుకున్నవారు ఎక్కువమంది ఉంటున్నారు.
ఇప్పటివరకు భారతదేశంలో కోలుకున్నవారి సంఖ్య 55,86,703 కు చేరింది. ప్రతిరోజూ సగటున కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటం వల్లజాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారిశాతం క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అది 84.34% చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 75% మంది 10 రాష్ట్రాలనుంచే నమోదు కావటం కూడా గమనించవచ్చు. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న 15,000 మందికి పైగా కోలుకోగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక ఆరష్ట్రాల్లో ఏడేసి వెవేలమందికి పైగా కోలుకున్నట్టు నమోదైంది.
భారతదేశంలో ఇప్పటికీ చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఈ రోజు 9,34,427 గా నమోదైంది. అంటే, మొత్తం పాజిటివ్ కేసులలో ప్రస్తుతం దేశం మీద చికిత్స భారం ఉన్నది 14.11% మంది విషయంలోనే. దీనివలన క్రమంగా తగ్గుముఖం పడుతున్న ధోరణి స్పష్టంగా కనబడుతోంది. చికిత్సలో ఉన్న కేసుల్లో దాదాపు 77% కేసులు 10 రాష్జ్ట్రాల్లోనే ఉన్నాయి.
కొత్తగా దేశవ్యాప్తంగా 74,442 పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ఇలా కొత్తగా నమోదైన కేసులలో 78% కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 12,000 కేసులు నమోదు కాగా, కర్నాటకలో 10,000 కి పైగా కేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటల్లో 903 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 82% మరణాలు 10 రాష్ట్రాల్లోనే జరిగాయి. 36% మరణాలు ( 326 మంది) కేవలం మహారాష్ట్రలోనే జరగగా 67 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
****
(Release ID: 1661709)
Visitor Counter : 231
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam