హోం మంత్రిత్వ శాఖ
కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా మరణానికి నివాళిగా రేపు సంతాప దినం
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2020 12:43PM by PIB Hyderabad
కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా గత నెల 29వ తేదీన మరణించారు. ఆయన గౌరవార్ధం రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతిరోజూ జాతీయ జెండాలు ఎగురవేసే భవనాలపై, రేపు సగం వరకు అవనతం చేస్తారు. రేపు అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 1661350)
సందర్శకుల సూచీ సంఖ్య : : 138
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam