ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో 83% పైబడ్డ కోలుకున్నవారి శాతం చికిత్సలో ఉన్నవారికంటే 41.5 లక్షలు అధికంగా కోలుకున్నవారు
Posted On:
29 SEP 2020 12:19PM by PIB Hyderabad
భారత్ లో కోవిడ్ నుంచి బైటపడుతున్నవారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా పాజిటివ్ గా నమోదవుతున్నవారి కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో పాజిటివ్ కేసులలో కోలుకున్నవారి శాతం 83% పైబడింది. గడిచిన 24 గంటల్లో 84,877 మంది కోవిడ్ పాజిటివ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్ గా నమోదైనవారి సంఖ్య 70,589 గా తేలింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 51,01,397 అయింది.
కొత్తగా కోలుకున్నట్టు నమోదైన కేసులలో 73% పది రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. ఒక రోజులో కోలుకున్న వారి సంఖ్యలో మహారాష్ట్ర 20,000 కేసులతో మొదటి స్థానంలో ఉండగా 7,000 కు పైగా కేసులు నమోదు చేసుకున్న కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

కోలుకుంటున్నవారి శాతం స్థిరంగా పెరుగుతూ వస్తూ ఉండటం వల్ల చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది. ఆ విధంగా చికిత్సలో ఉన్నవారు 9.47.576 మంది ఉండగా కోలుకున్నవారి సంఖ్య 41.5 లక్షలు (41.53.831) దాటింది. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 5.38 రెట్లు ఎక్కువగా ఉన్నారు.
మొత్తం పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో ఇప్పటికీ చికిత్స పొందుతున్నవారు 15.24% మాత్రమే. పైగా ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రింది చిత్రపటాలు చూస్తే మొదటి పది రాష్ట్రాలలో 23-29 మధ్య మారుతూ వచ్చిన పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది.


గడిచిన 24 గంటల్లో 70,589 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 రాష్ట్రాలదే 73% వాటా. మహారాష్ట్రలో అత్యధికంగా 11,000 కు పైగా కేసులు నమోదు కాగాఆ తరువాత స్థానంలో ఉన్న కర్నాటకలో 6,000 కు పైగా నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 776 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 10 రాష్ట్రాల్లోనే 78% మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 23% (180మంది) చనిపోగా తమిళనాడులో 23% (70 మంది) మరణాలు నమోదయ్యాయి.

****
(Release ID: 1660007)
Visitor Counter : 214
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada