ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దిగ్గజ సంగీతకారుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మ‌ర‌ణం ప‌ట్ల దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసిన ఉప‌రాష్ట్రప‌తి

ఇది నాకు తీవ్ర భావోద్వేగపు క్షణంః ఉపాధ్యక్షుడు

Posted On: 25 SEP 2020 2:16PM by PIB Hyderabad

దిగ్గజ సంగీతకారుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం ప‌ట్ల‌ ఉపరాష్ట్రపతి సంతాపం తెలియ‌జేశారు.

ఉప‌రాష్ట్రప‌తి పూర్తి సంత‌ప ప్రకటన ఈ కింది విధంగా ఉంది-

“చాలా దశాబ్దాలుగా నాకు ప‌రిచ‌య‌స్తుడైన శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం యొక్క విషాద మరణం గురించి తెలుసుకున్నప్పుడు నేను షాక్‌కు గుర‌య్యాను. ఇది నిజంగా సంగీత ప్రపంచానికి తీర‌ని నష్టం మరియు వ్యక్తిగతంగా నాకు ఇది తీవ్ర భావోద్వేగపూరిత‌ క్షణం. ఎస్‌పీబీ అని లేదా బాలు అని అసంఖ్యాకులైన అత‌ని  ఆరాధకులు ప్రేమతో పిలుచుకొనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నా స్వస్థలమైన నెల్లూరుకు చెందిన వారు. ఆయ‌న‌ శ్రావ్యమైన గానం, మ‌రియు మాతృభాష పట్ల ఆయనకు ఉన్న మక్కువ, అసాధార‌ణరీతిలో ప్రతిభావంతులైన న‌వ‌త‌రం యువ సంగీతకారుల‌ను, ప్ర‌తిభావంతులుగా తీర్చిదిద్దిన తీరును గురించి విన్నప్పుడ‌ల్లా
అద్భుతంగా అనిపించేంది.  బాలు నా హృదయంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది సంగీత ప్రియుల హృదయాలలో శూన్యతను వదిలివెళ్లాడు. అత‌ని మ‌ధుర‌మైన గ‌ళం.. దుర‌దృష్టవ‌శాత్తూ విష వైర‌స్ కార‌ణంగా శాశ్వ‌తంగా మూగ‌బోయింది. బాలు ఉత్సాహపూరితమైన చిరునవ్వు,  అంద‌రినీ అల‌రించే ర‌స‌రంజ‌క‌మైన హాస్యం మ‌న మ‌ది జ్ఞాపకాల్లో ఎల్లప్పుడూ ని‌లిచి ఉంటాయి. అతని అసాధారణమైన పాటలు మన చెవుల్లో మోగుతూనే ఉంటాయి మరియు రాబోయే కొనేండ్ల పాటు మన స్మ‌ర‌ణ‌లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నాకు ఎంతో సుప‌రిచితుడైన ఈ మేటి సంగీతకారుడికి గౌరవప్రదమైన నివాళి అర్పిస్తున్నాను. ఊహించని ఈ అపార నష్టాన్ని తట్టుకునే శక్తిని ఎస్‌పీ బాలు కుటుంబానికి ఇవ్వాల‌ని సర్వశక్తిమంతుడైన ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను”.

                                   

*****



(Release ID: 1659188) Visitor Counter : 242