ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
10 రాష్ట్రాలు/యూటీల్లోనే కొత్త కేసుల్లో 75 శాతం నమోదు
Posted On:
24 SEP 2020 1:05PM by PIB Hyderabad
వరుసగా ఆరో రోజు కూడా, కొవిడ్ కొత్త కేసుల సంఖ్య కన్నా రికవరీల సంఖ్య అధికంగా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,508 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 75 శాతం 10 రాష్ట్రాలు/యూటీల్లోనే
నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఒక్క రాష్ట్రం నుంచే 21 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వరుసగా 7 వేలు, 6 వేలకు పైగా కేసులతో కొనసాగుతున్నాయి.
గత 24 గంటల్లో 1,129 మంది కరోనాతో మరణించారు. వీటిలో 83 శాతం 10 రాష్ట్రాలు/యూటీల్లోనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 479 కాగా, ఉత్తరప్రదేశ్‌లో 87, పంజాబ్‌లో 64 మంది
చనిపోయారు.
కరోనా పరీక్షల మౌలిక సదుపాయాలు దేశవ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. ఇప్పటివరకు 1082 ప్రభుత్వ, 728 ప్రైవేటు పరీక్ష కేంద్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 1,810 ఉన్నాయి. గత 24 గంటల్లో చేసిన పరీక్షల సంఖ్య 11,56,569తో కలిపి, మొత్తం పరీక్షల సంఖ్య 6.74 కోట్లను దాటింది.
****
(Release ID: 1658687)
Visitor Counter : 173
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam