ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

రబీ పంటల 2021-22 వ్యాపార సీజన్లో కనీస మద్దతు ధరల పెంపునకు మంత్రిమండలి ఆమోదం

Posted On: 21 SEP 2020 7:05PM by PIB Hyderabad

కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన సందర్భంగా- దేశవ్యాప్తంగా నిర్దేశిత రబీ పంటలకు 2021-22 వ్యాపార సీజన్‌లో కనీస మద్దతు ధరల పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా ఈ మేరకు తీర్మానించింది. దేశ పౌష్టికత అవసరాలు, మారుతున్న ఆహార ధోరణుల దృష్ట్యానేగాక పప్పుదినుసులు, నూనె గింజల దిగుబడిలో స్వావలంబన సాధన దిశగా ఈ పంటలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం సాపేక్షంగా కాస్త ఎక్కువగానే నిర్ణయించింది.

అన్నిరకాల రబీ పంటల 2021-22 వ్యాపార సీజన్‌ (ఆర్‌ఎంఎస్‌)లో కనీస మద్దతు ధరలివే

పంటలు

ఆర్‌ఎంఎస్‌ 2020-21లో ఎంఎస్‌పీ

(క్వింటా/రూ)

ఆర్‌ఎంఎస్‌2020-21లో ఎంఎస్‌పీ

(క్వింటా/రూ)

ఉత్పత్తి*ఖర్చు

2020-21

(క్వింటా/రూ)

ఎంఎస్‌పీ పెంపు

(క్వింటా/రూ)

ఖర్చుపై

లాభం

(శాతంలో)

గోధుమ

1925

1975

960

50

106

బార్లీ

1525

1600

971

75

65

కంది

4875

5100

2866

225

78

కాయధాన్యం

(మసూర్‌)

4800

5100

2864

300

78

ఆవజాతి/

ఆవాలు

4425

4650

2415

225

93

కుసుమ

5215

5327

3551

112

50

* కూలీల ఖర్చు/ఎద్దులు-యంత్రాల అద్దె, భూమికౌలు, విత్తనాలు-ఎరువులు-పోషకాలు-నీటిపారుదల రుసుము, పనిముట్లపై తరుగుదల వగైరా ఉత్పాదకాల వ్యయం, వ్యవసాయ భవనాలు, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ తదితరాలు.. ఇతర ఖర్చులు, కుటుంబ శ్రమ విలువ.

   కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి ప్రభావం, పర్యవసానంగా దేశవ్యాప్త దిగ్బంధం అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యలవల్ల 2020-21 రబీపంటల వ్యాపార సీజన్‌ (ఆర్‌ఎంఎస్‌) సమయంలో సరికొత్త రికార్డుస్థాయిన 39 మిలియన్ టన్నుల గోధుమల సేకరణ నమోదైంది. ఆర్‌ఎంఎస్ 2019-20తో పోలిస్తే ఇది 22 శాతం అధికం కాగా, సుమారు 43 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ప్రస్తుత మహమ్మారి ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

  1. ఎంఎస్‌పీ పెంపుతోపాటు రైతుల గరిష్ఠ ప్రయోజనం కోసం సేకరణ ప్రక్రియ బలోపేతం చేయబడింది.
  2. కోవిడ్ మహమ్మారి వేళ గోధుమ సేకరణ కేంద్రాల సంఖ్య 1.5 రెట్లు, పప్పు దినుసులు-నూనె గింజల సేకరణ కేంద్రాల సంఖ్య 3 రెట్లు పెంచబడ్డాయి.
  3. మహమ్మారి పరిస్థితుల నడుమ రూ.75,000 కోట్లతో 390 లక్షల టన్నుల గోధుమలు సేకరించబడ్డాయి. నిరుటితో పోలిస్తే ఇది 15 శాతం అధికం.
  4. ‘పీఎం-కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన’ ప్రారంభంలో రూ.93,000 కోట్లు పంపిణీ చేయగా, దాదాపు 10 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.
  5. ‘పీఎం-కిసాన్‌’ కింద కోవిడ్ మహమ్మారి సమయాన దాదాపు 9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.38000 కోట్ల దాకా ప్రయోజనం లభించింది.
  6. గడచిన 6 నెలల్లో 1.25 కోట్ల కొత్త కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ అయ్యాయి.
  7. వేసవి పంటల సాగులో 57 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనాలు వేయగా, నిరుటితో పోలిస్తే ఇది 16 లక్షల హెక్టార్లు అధికం. అలాగే ఖరీఫ్‌ విషయంలోనూ నిరుటితో పోలిస్తే 5 శాతం ఎక్కువ.
  8. కోవిడ్ మహమ్మారి వేళ ‘ఈ-నామ్’ విపణుల సంఖ్య 585 నుంచి 1000కి పెరిగింది. నిరుడు ఈ-నామ్‌ వేదికపై రూ.35000 కోట్ల వ్యాపారం జరిగింది.
  9. రాబోయే ఐదేళ్లలో రూ.6850 కోట్లతో 10,000 రైతు ఉత్పత్తుల సంస్థలు (ఎఫ్‌పీవో) ఏర్పాటు కానున్నాయి.
  10. గడచినత నాలుగేళ్లలో ‘పంటల బీమా పథకం’ కింద రైతులు రూ.17,500 కోట్ల రుసుము చెల్లించగా, పరిహారం కింద రూ.77,000 కోట్లు పొందారు.
  11. ‘పంటల బీమా పథకం’ స్వచ్ఛంద చేయబడింది.
  12. కిసాన్ రైలు ప్రారంభించబడింది.

***


(Release ID: 1657447) Visitor Counter : 368