ప్రధాన మంత్రి కార్యాలయం

లేహ్ లో భారత సాయుధ దళాల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం యొక్క పాఠం

Posted On: 03 JUL 2020 5:50PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జయ్

భారత్ మాతా కీ జయ్

మిత్రులారా, మీరు ప్రదర్శించిన ఈ యొక్క తెగువ, మీ యొక్క పరాక్రమం, మరి భరత మాత గౌరవాన్ని కాపాడడం కోసం మీరు వ్యక్తపరచినటుటవంటి సమర్పణ భావం తుల లేనటువంటివి.  మీ స్ఫూర్తి కూడాను ప్రపంచం లో మరెవ్వరికీ తీసిపోనిది.  ఎటువంటి కఠిన పరిస్థితుల లో, ఎంతటి ఎత్తు న మీరు తల్లి భారతి కి డాలు వలె ఉండి రక్షిస్తున్నారో, ఆమె కు సేవ చేస్తున్నారో, దానితో పోటీ పడడం కోసం యావత్తు ప్రపంచం లోనే ఎవ్వరూ ముందుకు రాజాలరు.

మీ సాహసం మీరు మోహరించిన శిఖరస్థలం కంటే కూడా ఉన్నతమైంది.  మీ నిశ్చయం మీరు అనునిత్యం మీ అడుగుల తో కొలిచే ఆ లోయ కంటే దృఢమైంది.  మీ భుజాలు మీ చుట్టుప్రక్కల నిలచివున్న ఆ పర్వత పంక్తుల వలె బలం గా ఉన్నాయి.  మీ లోపలి ఇచ్ఛాశక్తి దరిదాపుల గల గిరులంత అచలమైంది.  ఈ రోజు న మీ మధ్య కు వచ్చి నిలబడ్డ నాలో ఇటువంటి
 భావనలు రేకెత్తుతున్నాయి.  నేను నా స్వీయ నేత్రాలతో దీనిని చూడగలుగుతున్నాను. 

మిత్రులారా,

మాతృభూమి రక్షణ, భద్రత ల బాధ్యత మీ అందరి చేతులలో, మీలోని బలమైన విశ్వాసం లో ఉంది.  అదే మీకు చలించని విశ్వాసాన్ని అందిస్తోంది.  నాకే కాదు, దేశ భద్రత కు మీరు ఇస్తున్న భరోసా పై యావత్తు భారతదేశం లో అపారమైన విశ్వాసం ఉంది.  సరిహద్దుల లో మీ అస్తిత్వం దేశవాసులందరి లో దేశం  కోసం రేయింబవళ్లు పని చేయాలన్న ఉత్తేజాన్ని నింపుతుంది.  మీరు, మీ త్యాగం, మీ ప్రయత్నాలే స్వయంసమృద్ధియుత భారత్ సంకల్పాన్ని మరింత పటిష్ఠం చేస్తాయి.  ఇప్పుడు మీరు, మీ స్నేహితులు చాటిన ధైర్యం ప్రపంచం మొత్తానికి భారతదేశం బలం ఏమిటన్న సందేశాన్ని ఇచ్చింది. 

ఇప్పుడు మహిళా సైనికుల ను కూడా ముందు వరుస లో నేను చూస్తున్నాను. సరిహద్దులలో, అదీ యుద్ధ భూమి లో కనిపిస్తున్న ఈ దృశ్యమే ఒక ప్రత్యేక స్ఫూర్తి.

మిత్రులారా, 

జాతీయ కవి రాంధారీ సింహ్ దినకర్ ఈ విధం గా రాశారు-

జిన్ కే సింహనాద్ సే సహమీ। ధర్తీ రహీ అభీ తక్ డోల్।।
కలమ్ , ఆజ్ ఉన్ కీ జయ్ బోల్। కలమ్ ఆజ్ ఉన్ కీ జయ్ బోల్।।

అందుకే నేను ఈ రోజు న మీ యొక్క సాహసాన్ని నా మాటల తో ప్రశంసిస్తూ మీ అందరికీ అభివాదం తెలియచేస్తున్నాను.  గల్ వాన్ లోయ లో అమరులైన నా సాహసోపేత సైనికులందరికీ మరోసారి నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. దేశంలో ప్రతి ఒక్క ప్రదేశం- తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం- అన్ని ప్రాంతాల కు చెందిన వారు వారి శౌర్యాన్ని చూపారు.  ఈ రోజు న సాహసవంతులైన సైనికుల ముందు భారతదేశం లోని ప్రతి ఒక్కరు తల వంచి అభివాదం చేస్తున్నారు.  మీ సాహసం పట్ల, మీ పరాక్రమం పట్ల ఈ రోజు న భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి ఎంతో గర్వపడుతున్నారు.


మిత్రులారా, 

సింధు ప్రాంతం ఆశీస్సులతోనే ఈ రోజు న ఈ భూమి మహోజ్వలం గా ఉంది. లేహ్-లద్దాఖ్ నుండి కర్ గిల్, సియాచిన్ ల వరకు, రిజాంగలా లోని హిమశిఖరాల నుండి గల్ వాన్ లోయ లోని శీతల జల స్రవంతి వరకు ప్రతి ఒక్క శిఖరం, ప్రతి ఒక్క పర్వతం, ప్రతి ఒక్క మూల, ప్రతి ఒక్క రాయి మీ సాహసాని కి సాక్షి గా నిలుస్తాయి.  ఇక్కడ ఉన్న 14 దళాల పరాక్రమాన్ని తెలిపే కథ లు ప్రతి ఒక్కరి కి తెలుసును.  ఎవరికి లొంగని మీలోని సాహసాన్ని యావత్తు ప్రపంచం వీక్షించింది.  మీ వీర గాథ లు ఇంటింటిలో ప్రతిధ్వనిస్తున్నాయి. భరత మాత శత్రువులు కూడాను మీలో రగిలిన జ్వాల ను, మరి మీ యొక్క క్రోధాన్ని కాంచారు. 

మిత్రులారా,

భారతదేశాని కి శిఖరభాగం అయిన లద్దాఖ్ యావత్తు 130 కోట్ల మంది భారతీయుల గౌరవాని కి ప్రతీక.  దేశం కోసం త్యాగాల కు సిద్ధం గా ఉండే దేశ భక్తుల భూమి ఇది.  ఈ నేల కుశాక్ బకులా రిన్ పోంఛే వంటి గొప్ప దేభక్తుల ను  అందించింది.  ఈ రిన్ పోంఛే గారే, శత్రువుల అపవిత్ర ఉద్దేశాల కు విరుద్ధం గా స్థానిక ప్రజల ను కూడగట్టారు.  రిన్ పోంఛే ఆధ్వర్యం లో ఇక్కడ విభజన ను జనింపచేయాలన్న ప్రతి ఒక్క కుతంత్రాన్ని లద్దాఖ్ కు చెందిన దేశభక్తులైన ప్రజలు విఫలం చేశారు.  ఆయన కృషి నుండి లభించిన స్ఫూర్తి పరిణామంగానే  భారతదేశాని కి, భారతీయ సైన్యాని కి ‘లద్దాఖ్ స్కౌట్’ పేరిట పదాతి దళాన్ని ఏర్పాటు చేసే ప్రేరణ అందింది.  ఈ రోజు న లద్దాఖ్ ప్రజలు సాధారణ పౌరులుగానే కాకుండా సైనికులు గా కూడా ప్రతి ఒక్క స్థాయి లో భారతదేశాన్ని పటిష్ఠపరచడంలో వారి వంతు గా అద్భుతమైన పాత్ర ను పోషిస్తున్నారు.

మిత్రులారా, మన దగ్గర ఒక నానుడి ఉంది-

‘ఖడ్గేన్ ఆక్రమ్య వందితా ఆక్రమణ:  
పుణియా, వీర్ భోగ్య వసుంధరా’ అని.

తమ శక్తి తోను, ఆయుధాల తోను మాతృభూమి ని రక్షించే వారు సాహసులు.  ఈ భూమి సాహసుల దే.  మాతృభూమి రక్షణ కు,  భద్రత కు మా మద్దతు, బలం, సంకల్పం పూర్తి గా అంకితం.  ఆ సామర్థ్యం, సంకల్పం మీ కళ్ల లో ఇప్పుడు నేను చూస్తున్నాను.  మీ వదనాల లో అది చాలా స్పష్టం గా కనిపిస్తోంది.  వేలాది సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నో దాడుల ను, దురాగతాల ను తిప్పికొట్టిన భూమి కి చెందిన కథానాయకులే మీరంతా.  వేణునాదం ఊదే కృష్ణుని ఆరాధించడం ఒక్కటే కాదు, సుదర్శన చక్రాన్ని ప్రయోగించే కృష్ణుని కూడా మనం ఆదర్శం గా తీసుకుంటాం.  ఇదే మన గుర్తింపు. ఆ స్ఫూర్తి తోనే భారతదేశం ప్రతి ఒక్క దాడి అనంతరం మరింత బలోపేతం అవుతోంది.

మిత్రులారా,

దేశం యొక్క, ప్రపంచం యొక్క, మానవ జాతి యొక్క పురోగతి కి శాంతి, స్నేహం కీలకం అని ప్రతి ఒక్కరి విశ్వాసం.  కానీ బలహీనులు ఎన్నటికీ శాంతి ని సాధించలేరని, అసలు శాంతి ప్రక్రియ నే ప్రారంభించలేరని కూడా మనం ఎరుగుదుము.  శాంతి సాధన కు ప్రధానం గా కావలసింది ధైర్యం.  నీరు, భూమి, ఆకాశం, అంతరిక్షం.. ఎందులో అయినా.. భారతదేశం ప్రాబల్యం పెంచుకుంటోందంటే దాని లక్ష్యం మానవాళి సంక్షేమమే.  భారతదేశం ఈ రోజు న ఆధునిక ఆయుధాల ను తయారు చేసుకొంటున్నా, సైన్యాని కి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నా, దాని వెనుక స్ఫూర్తి మానవాళి సంక్షేమమే.  అదే విధం గా త్వరిత గతి న ఆధునిక మౌలిక సదుపాయాల ను కల్పించుకొంటున్నామన్నా దాని లక్ష్యమూ అదే.

ప్రపంచ యుద్ధం లో అయినా, ప్రపంచాని కి శాంతి పరిరక్షక దళాన్ని పంపించినా, అందులో పాల్గొన్న వీరులు ఎంత పెద్ద పాత్ర ను పోషించిందీ ప్రపంచానికి పరిచితమైన సంగతే.  మనం ఎప్పుడూ మానవాళి  పరిరక్షణ కోసమే కృషి చేశాము.  మీరందరూ భారతదేశాని కి చెందిన ఈ లక్ష్యం కోసం, ఈ సంప్రదాయం కోసం, ఈ సమున్నతమైనటువంటి సంస్కృతి ని పరిరక్షించడం కోసం పాటుపడుతున్న వీరులే. 

మిత్రులారా,

ప్రముఖ కవి తిరువళ్లువర్ గారు వందలాది సంవత్సరాల క్రితం ఇలా చెప్పారు-

‘మరమానమ్ మాండ్ వడిచ్చేలవ్ తెట్రమ్
యేనా నాన్గే యేమమ్ ప‌డయీక్కు’ అని.

ఈ మాటల కు- పరాక్రమం, గౌరవం, మర్యాదపూర్వకమైన నడవడిక తాలూకు సంప్రదాయం, ఇంకా విశ్వసనీయత.. ఈ నాలుగు గుణాలు ఏ దేశ సైన్యం లో అయినా ప్రతిబింబిస్తూ ఉంటాయి - అని భావం.  భారతీయ సేనలు ఎల్లప్పుడూ ఇదే దారి న సాగుతున్నాయి.

మిత్రులారా,

వలస రాజ్య విస్తార వాదం యొక్క యుగం సమాప్తమైపోయింది, ఈ యుగం వికాసవాద యుగం.  వేగం గా మారుతున్నటువంటి కాలం లో అభివృద్ధివాదమే ప్రాసంగికంగా ఉంది.  ప్రస్తుత ఆవశ్యకత సైతం అభివృద్ధివాదమే; మరి ఇదే భవిష్యత్తు కు ఆధారం గా కూడాను ఉంది.  గడచిపోయిన శతాబ్దుల లో మానవ జాతి కి మిగతా అన్నిటి కంటే అధికం గా కీడు ను తెచ్చిపెట్టింది విస్తారవాదమే.  అది మానవాళి ని నష్టపరచాలనుకొంది; అది సదా ప్రపంచ శాంతి కి కూడా అపాయాన్ని కొనితెచ్చింది.

ఇంకా మిత్రులారా, మీరు మరువకండి, అటువంటి శక్తులు మటుమాయం కావడానికో, లేదంటే తప్పనిసరై మడమ తిప్పవలసి రావడానికో చరిత్రే సాక్షిగా నిలచింది అనే సంగతి ని.  ప్రపంచానికి సదా ఈ అంశం అనుభవం లోకి వచ్చింది.  అలాగే ఈ అనుభవం ఆధారం గానే ఇప్పుడు మళ్లీ యావత్తు ప్రపంచం విస్తరణ వాదాన్ని వ్యతిరేకించాలని నిశ్చయించుకొన్నది.  ఇవాళ ప్రపంచం అభివృద్ధివాదాని కి అంకితమై ఉంది; అభివృద్ధి కై స్వేచ్ఛాయుతమైన స్పర్ధ కు ఆహ్వానం పలుకుతున్నది కూడాను.

మిత్రులారా,

నేను ఎప్పుడు దేశరక్షణ కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నా గాని ఇద్దరు మాతల ను గుర్తు చేసుకుంటాను.  వారిలో ఒకరు భరత మాత అయితే, మరొకరు మీ వంటి పోరాట యోధుల కు జన్మనిచ్చిన మాతృమూర్తులు.  నా నిర్ణయాలన్నిటి గీటురాయి ఇదే.  ఆ లక్ష్యంతోనే మీ గౌరవం, మీ కుటుంబాల ఆదరం, భారత మాత ను సురక్షితం గా నిలపడం.. వీటి కి నేను సర్వాధిక ప్రాధాన్యాన్ని కట్టబెడుతూ ఉన్నాను.

సైన్యాని కి అత్యాధునిక ఆయుధాలు కానివ్వండి లేదా మీ కోసం అవసరమైన సామగ్రి కానివ్వండి, వీటన్నిటి మీద మేము అధిక శ్రద్ధ ను తీసుకొంటున్నాము.  సరిహద్దు ప్రాంతాల లో మౌలిక సదుపాయాలపైన పెట్టుబడి ని ఇప్పుడు మూడింతలు చేశాము.  రోడ్లు, వంతెన ల నిర్మాణం తో సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి.  ప్రస్తుతం అన్ని రకాల వస్తువులు మీకు త్వరిత గతి న అందడమే వీటి వల్ల మీకు చేకూరిన అతి పెద్ద ప్రయోజనం.

మిత్రులారా,

సేనల లో మరింత మెరుగైన సమన్వయం కోసం దీర్ఘ కాలం గా ఏదైతే ఆశ ఉండిందో- అది చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి ని ఏర్పాటు చేయాలన్న అంశం కానివ్వండి, లేదా జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించడం కానీయండి, లేదా ఒక ర్యాంకు-ఒక పింఛన్ నిర్ణయాన్ని తీసుకోవడం కానివ్వండి, లేదా మరి మీ కుటుంబం యొక్క బాగు ను గురించి పట్టించుకోవడం మొదలుకొని విద్యాబుద్ధుల ను చెప్పించడం వరకు సరి అయినటువంటి వ్యవస్థ ను కల్పించడానికై నిరంతర కృషి , దేశం ఈ రోజు న ప్రతి ఒక్క స్థాయి లో మన సేనలు మరియు సైనికుల ను బలోలపేతం చేసేందుకు పనిచేస్తూ వస్తున్నది. 

మిత్రులారా,

భగవాన్ గౌతమ బుద్ధుడు ఈ విధం గా అన్నారు-

సాహసం యొక్క సంబంధం నిబద్ధత తోను, ఒప్పించడం తోను ఉంటుంది అని. సాహసమంటే దయాగుణాన్ని కలిగివుండడం.  సాహసం ఏది అంటే- నిర్భయం గా ఉండవలసిందిగాను మరియు చెక్కుచెదరక నిలచి సత్యం పక్షాన్ని వహించాలని మనకు బోధించేదే.  సాహసం ఏది అంటే ఏదయితే మనకు మంచి ని మంచిగా చెప్పే, ఇంకా మంచి పని ని చేసే శక్తి ని ఇస్తుందో.

మిత్రులారా,

దేశ వీర పుత్రులు గల్ వాన్ లోయ లో చూపిన అటువంటి అసాధారణ సాహసం పరాక్రమాని కి పరాకాష్ఠ గా ఉన్నది. దేశం మిమ్మల్ని చూసుకొని గర్విస్తున్నది.  మీతో పాటు గా మన ఐటిబిపి యొక్క జవానులు కానీయండి, బిఎస్ఎఫ్ లోని సహచరులు కానీయండి, మన బిఆర్ఓ ఇంకా ఇతర ఇతర సంస్థ ల జవానులు కానివ్వండి, కఠిన పరిస్థితుల లో పనిచేస్తున్నటువంటి ఇంజీనియర్ లు కానివ్వండి, శ్రమికులు కానివ్వండి; మీరంతా అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు.  ప్రతి ఒక్కరు భుజం భుజం కలిపి తల్లి భారతి యొక్క సేవ కు అంకితమయ్యారు.

ఈ రోజు న దేశం మీ కఠోర శ్రమ కారణం గా పలు వైపరీత్యాల పై సమాంతరం గా పోరాటం చేస్తోంది.  మీరందరూ అదిస్తున్న స్ఫూర్తి తో అత్యంత సంక్లిష్టమైన సవాళ్ల ను కూడా మేమందరం దీటు గా ఎదుర్కొనగలుగుతున్నాము.  మీరందరూ దేశ సరిహద్దుల ను కాపాడుతున్నారు.  మనందరం కలిసికట్టు గా మా కలల ను, మీ కల
ల ను సాకారం చేయగల భారతదేశాన్ని నిర్మించడానికి పరిశ్రమిద్దాము. 130 కోట్ల మంది భారతీయులు ఎటువంటి వెనుకడుగు ను వేయరని హామీ ఇవ్వడానికే నేను ఈ రోజు ఇక్కడ కు వచ్చాను. మనం శక్తివంతమైన, స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని ఆవిష్కరిస్తాము.  దీనిని మనం సాధించి తీరుతాము
.  మరి మీ అందరి నుండి ఎప్పుడు ప్రేరణ అందితే ఆత్మనిర్భర్ భారత్ తాలూకు సంకల్పం సైతం మరింత శక్తి ని పుంజుకొంటుంది.

మీ అందరికీ మరోసారి హృదయాంతరాళం లో నుండి  అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.  మీ అందరికీ అనేకానేక ధన్యవాదము లు. నాతో కలసి బిగ్గర గా పలకండి -

‘భారత్ మాతా కీ జయ్’

‘భారత్ మాతా కీ జయ్’

‘వందే మాతరమ్’

‘వందే మాతరమ్’

‘వందే మాతరమ్’.

ధన్యవాదము లు.

***
 (Release ID: 1655022) Visitor Counter : 325