ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా-ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 04 JUN 2020 12:21PM by PIB Hyderabad

 

ఇక్సె లన్సి, నమస్కారం.

అన్నిటి కంటే ముందు, నేను ఆస్ట్రేలియా లో కోవిడ్-19 వల్ల బాధితులైన కుటుంబాలు మరియు ప్రజలు అందరికి నా తరఫు న, అలాగే యావత్తు భారతదేశం తరఫు న నా సంతాపాలను వ్యక్తం చేయదలచుకొన్నాను.  ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి ప్రపంచం లో అన్ని రకాల వ్యవస్థల ను ప్రభావితం చేసివేసింది.  మరి మన శిఖర సమ్మేళనం యొక్క ఈ డిజిటల్ రూపం ఇటువంటి ప్రభావాల తాలూకు ఒక ఉదాహరణ గా నిలచింది.

ఇక్సె లన్సి, ఈ యొక్క డిజిటల్ మాధ్యమం ద్వారా మీతో భేటీ అవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను, అయితే నాకు ఒకింత నిరుత్సాహం గా కూడా ఉంది; ఎందుకు అంటే మిమ్ముల ను ఉత్సాహం గా భారతదేశం లోకి స్వాగతించే అవకాశం మాకు ప్రాప్తించనే లేదు.  తొలుత జనవరి లో మరి ఆ తరువాత గడచిన మాసం లో మీరు భారతదేశాన్ని సందర్శిస్తారు అని మేము వేచివున్నాము,  కానీ దురదృష్టవశాత్తు, మీ యొక్క రెండు సందర్శన ల ను మనం వాయిదా వేసుకోవలసి వచ్చింది.  నేటి మన ఈ సమావేశం భారతదేశానికి మీ సందర్శన తాలూకు లోటు ను భర్తీ చేయజాలదు.  పరిస్థితి ఒకసారి బాగయిందీ అంటే, మీరు కుటుంబ సమేతం గా త్వరలో భారతదేశాన్ని సందర్శించే ప్రణాళిక ను వేసుకోవలసిందిగాను మరి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది గాను ఒక మిత్రుని గా నేను మిమ్ములను కోరుతున్నాను.  

ఇక్సె లన్సి, భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాలు బహుముఖీనమైనవి మరియు ప్రగాఢమైనవీనూ.  మరి ఈ యొక్క గాఢత మన ఉమ్మడి విలువలు, ఉమ్మడి హితాలు, ఉమ్మడి భౌగోళిక స్థానీయత, ఇంకా ఉమ్మడి లక్ష్యాల నుండి వ్యక్తం అవుతోంది.  గడచిన కొన్ని సంవత్సరాల కాలం లో, మన సమకారం మరియు మన సమన్వయం వేగ గతి ని సంతరించుకొన్నది.  మన సంబంధాల పగ్గాల లో ఒక చివర మీ వంటి ఒక బలమైన మరియు దార్శనికుడైన నేత చేతిలో ఉండడం భాగ్యం.  ఆస్ట్రేలియా మరియు భారతదేశం ల మధ్య సంబంధాలు మరింత బలవత్తరం గా మారడానికి ఇదే పరిపూర్ణ కాలమని, ఇదే పరిపూర్ణమైన అవకాశం అని నేను నమ్ముతున్నాను. 

మన స్నేహాన్ని బలోపేతం చేసుకొనేందుకు మనకు గొప్ప సంభావ్యతలు ఉన్నాయి.  ఈ సాధ్యత లు వాటి తో పాటు సవాళ్ల ను కూడా కొనితెస్తాయి.  ఈ సంభవనీయత ను వాస్తవంలోకి ఎలాగ మలచుకోవాలనే సవాళ్లు కూడా ఉన్నాయి.  అదే జరిగిందా అంటే ఇరు దేశాల పౌరులు, వ్యాపారాలు, విద్యావిషయాలు, పరిశోధకులు, ఇత్యాది లంకె లు దృఢతరమవుతాయి;  మన సంబంధం ఏ విధం గా మన ప్రాంతం యొక్క మరి ప్రపంచం యొక్క స్థిరత్వానికి ఒక అంశం గా ఎలాగ కాగలుగుతుంది;  మనం కలిసికట్టుగా ప్రపంచ హితం కోసం ఎలా పాటుపడగలుగుతాము; ఇటువంటి దృష్టికోణాల ను పరిశీలించవలసిన అవసరం ఉంది.

 

ఇక్సె లన్సి, సమకాలిక ప్రపంచం లో ఒక దేశం పైన మరొక దేశం పెట్టుకొంటున్నటువంటి ఆశ లు, అలాగే మన మీద మన పౌరులు పెట్టుకొంటున్నటువంటి ఆశ లు కూడా పెరిగిపోయాయి.  ప్రజాస్వామిక విలువల ను పంచుకోవడం ద్వారా, ఈ యొక్క ఆశల ను నెరవేర్చే బాధ్యత మనం ఇద్దరి మీద ఉంది.  అందుకని, ప్రజాస్వామ్యం, చట్ట నియమాలు, స్వేచ్చ, పరస్పర ఆదరణ, అంతర్జాతీయ సంస్థ ల పట్ల గౌరవం మరియు పారదర్శకత్వం, ఇత్యాది ప్రపంచ సంక్షేమకర విలువల ను పరిరక్షించవలసినటువంటి, వాటి ని నిలబెట్టవలసినటువంటి పవిత్రమైన బాధ్యత కూడా మన మీద ఉంది.  ఇది ఒక రకం గా భవిష్యత్తు కై మనం అందించేటటువంటి ఒక సంప్రదాయం గా మిగిలింది.  ఈ రోజు న- ఎప్పుడైతే ఈ విలువల ను వేరు వేరు విధాలు గా సవాలు చేయడం జరుగుతోందో- మనం మన సంబంధాల ను పటిష్టపరచుకోవడం ద్వారా వాటి ని బలపరచగలుగుతాము.

ఇక్సె లన్సి, ఆస్ట్రేలియా తో సంబంధాల ను ఒక సమగ్రమైనటువంటి మరియు సత్వరమైనటువంటి రీతి న విస్తరింపచేసుకోవడానికి భారతదేశం వచనబద్ధురాలై ఉంది.  ఇది మన రెండు దేశాలకే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మరియు ప్రపంచానికి కూడాను ముఖ్యం.  వివిధ సంస్థాగత సంభాషణ లు మన సంబంధాల కు మరింత సారాన్ని సమకూర్చుతుండటం పట్ల నేను సంతోషిస్తున్నాను.  ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాలు కూడా నిరంతరం గా జరుగుతున్నాయి.  వ్యాపారం మరియు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతున్నాయి.  అయితే నేను ఈ యొక్క విస్తృతి తోను, ఈ యొక్క గమనం తోను సంతృప్తి చెందానని నేను చెప్పను.  మీ వంటి ఒక నేత మా మిత్ర దేశానికి నాయకత్వం వహిస్తుంటే, మన సంబంధాల లో అభివృద్ధి తాలూకు గతి కి సంబంధించినటువంటి ప్రమాణం కూడా తాహతు కు మించింది గా ఉండాలి.  మనం మన ద్వైపాక్షిక సంబంధాల ను కోంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ స్థాయి కి పెంచుకొంటున్నందుకు గాను నేను చాలా ప్రసన్నుడిని అయ్యాను.

ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి కాలం లో మన కోంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ పోషించవలసిన పాత్ర మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది.  ఈ విశ్వమారి ప్రసరింపచేసే ఆర్థిక మరియు సామాజిక అనుషంగ ప్రభావాల నుండి బయటపడడం కోసం ప్రపంచానికి ఒక సమన్వయభరితమైనటువంటి మరియు సహకారపూరితమైనటువంటి సమీపమార్గం అవసరపడుతుంది. 

ఈ సంక్షోభాన్ని ఒక అవకాశం గా చూడాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.  భారతదేశం లో, సమగ్రమైన సంస్కరణ ల ప్రక్రియ ను ఒకదానిని దాదాపు గా అన్ని రంగాల లో మొదలుపెట్టడమైంది.  అది క్షేత్ర స్థాయి లో త్వరలో ఫలితాల ను చూపనుంది.  ఈ గడ్డు కాలం లో ఆస్ట్రేలియా లోని భారతీయ సముదాయాన్ని మరీముఖ్యం గా భారతీయ విద్యార్థుల ను మీరు కాపాడినటువంటి తీరు కు గాను మీకు నేను ప్రత్యేకం గా కృత‌జ్ఞత‌ల ను వ్యక్తం చేస్తున్నాను. 

***
 


(Release ID: 1655002) Visitor Counter : 218