రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎయిరో ఇండియా 21 వెబ్సైట్ను ప్రారంభించిన భారత రక్షణ మంత్రి; ఆసియాలోనే అతిపెద్ద ఎయిరోషోకు మొదలైన స్పేస్ బుకింగు

Posted On: 11 SEP 2020 1:21PM by PIB Hyderabad

కర్ణాటకలోని ఎలహంకలోని వాయుసేన స్టేషన్లో  13వ ఎడిషన్ ఏయిరో ఇండియా-21ను 3 ఫిబ్రవరి 2021 నుండి 7 ఫిబ్రవరి 2021 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్సైటు https://aeroindia.gov.in కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్  ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ షోకు సంబంధించిన స్పేస్ బుకింగును ఈ వెబ్సైటును సందర్శించవచ్చు.

 

సందర్శకులుగానీ ప్రదర్శకులుగానీ ఈ షోకు సంబంధించి ఎటువంటి సమాచారమైనా లాదా రక్ష మంత్రిత్వ శాఖవారి ఇటీవలి విధి విధానాలు మరియు దేశీయ ఏయిర్ క్రాఫ్టులకు మరియు హెలికాఫ్టర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైటు ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని రక్షణ మంత్రి ఆశించారు.

అవకాశం కోసం ఆన్లైన్ ద్వారా ముందుగా  రుసుములు చెల్లించి నమోదు చేసుకున్న ప్రదర్శకులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది. 31 అక్టోబర్ 2020 రోజుకు గానీ ముందుగా గానీ నమోదు చేసుకునే ప్రదర్శకులకు రాయితీ కల్పించబడుతుంది.

వ్యాపారస్తులు మరియు సందర్శకులు కొరకు అన్ని పనిదినాల్లో వెబ్సైట్ ద్వారా ఈ షో టికెట్లను పొందవచ్చు.  ఈ కార్యక్రమాన్ని ప్రచురించడానికి మరియు ప్రసారం చేయడానికి ప్రసారమాధ్యమాలకు చెందినవారు కూడా ఈ వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొనవచ్చు.  ఇందకు సంబంధించిన సమాచారం లేదా సందేహాలను ఈ వెబ్సైట్లో నిర్దేశించిన ప్రశ్నల విభాగంలో తమ సందేహాలను మరియు సూచనలను పంపవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణలో  ఆరోగ్యానికి సంబంధించి నియమ నింబంధనలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోబడతాయి.

కొవిడ్-19కు సంబంధించిన మార్గదర్శకాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకుంటూనే ఈ షోలో పాల్గొనే అభ్యర్థులకు ఆత్మవిశ్వాసం పెంచే విధంగా చర్యలను చేపట్టనున్నారు.  

ఇటీవల రష్యాను సందర్శించిన భారత రక్షణ మంత్రి  శ్రీ రాజ్ నాథ్ సింగ్ రష్యాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ ఎయిరో షో-21 పాల్గొనవలసిందిగిగా రష్యా రక్షణ మంత్రిని ఆహ్వానించారు. వారితోపాటు రష్యాకు చెందిన పారిశ్రామిక వర్గాలవారిని మరియు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ దేశాలను కూడా ఇందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి(రక్షణ ఉత్పత్తులు) శ్రీ రాజ్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1653306) Visitor Counter : 159