ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పరీక్షల సంఖ్య అత్యధిక స్థాయిని తాకుతూ కొనసాగుతోంది

గడచిన 24 గంటల్లో 11.5 లక్షల పరీక్షలు నిర్వహించారు

Posted On: 09 SEP 2020 1:10PM by PIB Hyderabad

దేశంలో కొవిడ్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య ఒక్క రోజులో అత్యధికంగా దాదాపు 75,000 నమోదు అయితే, పరీక్షల సంఖ్య కూడా అదే స్థాయిలో ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఏ రోజుకారోజు కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 11.5 లక్షల పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించారు. 

అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. రోజు వారీ పరీక్షలు ఇప్పటికే 11 లక్షలు దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో 11,54,549 పరీక్షలు నిర్వహించడం ద్వారా జాతీయ స్థాయిలో రోగనిర్ధారణ పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయగలిగింది. 

WhatsApp Image 2020-09-09 at 10.45.34 AM.jpeg

With this achievement, the cumulative tests have crossed 5.18 crore (5,18,04,677).

WhatsApp Image 2020-09-09 at 10.45.16 AM.jpeg

సకాలంలో రోగ నిర్ధారణ ద్వారా తగిన చికిత్స కోసం ముందుగానే పాజిటివ్ కేసులను గుర్తించి వెంటనే ఐసొలేషన్ లో ఉంచడం కానీ ఆసుపత్రిలో చేర్చడానికి కానీ విలువైన అవకాశాలను కల్పించింది. ఇది మరణాల రేట్లు (ఈ రోజు 1.69%) తగ్గించడానికి, త్వరితగతిన కోలుకోవడానికి దోహదపడింది. విస్తరించిన డయాగ్నొస్టిక్ ల్యాబ్ నెట్‌వర్క్, దేశవ్యాప్తంగా సులభంగా పరీక్షించడానికి సదుపాయాలు ఇందుకు తగు ఊతమిచ్చాయి. దీని వల్ల ఒక మిలియన్ మందిలో టెస్ట్ (టిపిఎం) లు జరిగిన వారి సంఖ్య 37,539 కు పెరిగింది. ఇది స్థిరమైన ఎగువకు సాగే ధోరణిని కొనసాగిస్తోంది. జనవరి 2020 లో పూణేలోని ఒక పరీక్షా ప్రయోగశాల నుండి, నేడు దేశం 1678 ల్యాబ్‌లతో ప్రభుత్వ రంగంలోని 1040 ల్యాబ్‌లు మరియు 638 ప్రైవేట్ ల్యాబ్‌లతో సహా బలోపేతం అయ్యింది.


• రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 854 (ప్రభుత్వం: 469 + ప్రైవేట్: 385) 

• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 703 (ప్రభుత్వం: 537 + ప్రైవేట్: 166) 

• సీబీనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 121 (ప్రభుత్వం: 34 + ప్రైవేట్: 87) 

కోవిడ్-19కి ససంబంధించి ఖచితమైన, తాజా సమాచారాన్ని, మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకోడానికి ఈ లింక్ చుడండి. 

https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA.

కోవిడ్-19 కి సంబంధించి సాంకేతిక సందేహాలు ఉంటె వాటిని ఈ మెయిల్ కి పంపండి: technicalquery.covid19[at]gov[dot]in ఇతర సందేహాలను ఈ అడ్రస్ కి మెయిల్ చేయండి :  ncov2019[at]gov[dot]in and @CovidIndiaSeva .

కోవిడ్-19 కి సంబంధించిన సందేహాలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నంబర్ల ద్వారా కూడా నివృతి చేసుకోవచ్చు: +91-11-23978046 or 1075 (Toll--19 పై రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో హెల్ప్ లైన్ నంబర్ల జాబితా ఈ సైట్ లో లభ్యమవుతాయి. 

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf 

****



(Release ID: 1652783) Visitor Counter : 161