ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి – ఇప్పటివరకు సాధించిన ప్రగతి

పిఎంజికెపి పథకం కింద 42 కోట్లకు పైగా పేద ప్రజలు

రూ. 68,820 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందుకున్నారు

Posted On: 08 SEP 2020 1:00PM by PIB Hyderabad

రూ. 1.70 లక్షల కోట్ల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజిలో భాగంగా మహిళలు, పేద వృద్ధ పౌరులు, రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు, నగదు సాయాన్ని ప్రకటించింది. ఈ ప్యాకేజీ త్వరితగతిన అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షించాయి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద సుమారు 42 కోట్ల మంది పేద ప్రజలు రూ. 68,820 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందుకున్నారు.

 

  • పిఎం- కిసాన్ పథకంలో 8.94 కోట్ల మంది లబ్దిదారులకు తొలి వాయిదా చెల్లింపుల కోసం రూ. 17,981 కోట్లు ముందుగానే విడుదలయ్యాయి.
  • ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాదారుల్లో 20.65 కోట్ల మంది మహిళలకు (100 శాతం) తొలి వాయిదా కింద రూ. 10,325 కోట్లు ఖాతాలలో జమ అయ్యాయి. రెండో వాయిదా కింద 20.63 కోట్ల మంది (100 శాతం) మహిళా జన్ ధన్ ఖాతాదారులకు రూ. 10,315 కోట్లు జమ అయ్యాయి. మూడో వాయిదాలో 20.62 కోట్ల మంది (100 శాతం)కి రూ. 10,312 కోట్లు జమ అయ్యాయి.
  • 2.81 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు వాయిదాలలో రూ. 2,814.5 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 2.81 కోట్ల మంది లబ్దిదారులకూ రెండు వాయిదాలలో ప్రయోజనాలు బదిలీ అయ్యాయి.
  • భవన & ఇతర నిర్మాణ కార్మికులు 1.82 కోట్ల మంది రూ. 4,987.18 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందుకున్నారు.

 

  1. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 75.04 కోట్ల మంది లబ్దిదారులకు 2020 ఏప్రిల్ మాసంలో 37.52 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. మే నెలలో 74.92 కోట్ల మందికి 37.46 లక్షల టన్నులు, జూన్ నెలలో 73.24 కోట్ల మంది లబ్దిదారులకు 36.62 లక్షల టన్నులు పంపిణీ అయ్యాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం మరో 5 నెలల పాటు (నవంబర్ వరకు) పొడిగించింది. అప్పటి నుంచి 98.31 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. జూలైలో 72.18 కోట్ల మంది లబ్దిదారులకు 36.09 లక్షల టన్నులు, ఆగస్టులో 60.44 కోట్ల మందికి 30.22 లక్షల టన్నులు చొప్పున పంపిణీ అయ్యాయి. సెప్టెంబర్ మాసంలో 7వ తేదీవరకు 3.84 కోట్ల మంది లబ్దిదారులకు 1.92 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి.
  2. దీనికి తోడు ప్రధాన మంత్ర గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కిందనే 18.8 కోట్ల మంది లబ్దిదారులకు 2020 ఏప్రిల్, జూన్ మధ్య 5.43 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు పంపిణీ అయ్యాయి. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం మరో 5 నెలలు (నవంబర్ వరకు) పొడిగించింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 4.6 లక్షల మెట్రిక్ టన్నుల శెనగలను ప్రభుత్వం క్షేత్ర స్థాయికి పంపించింది. జూలై నెలలో అర్హత గల 10.3 కోట్ల కుటుంబాలకు 1.03 లక్షల మెట్రిక్ టన్నుల శెనగలు పంపిణీ అయ్యాయి. ఆగస్టు నెలలో లబ్దిదారులైన 2.3 కోట్ల కుటుంబాలకు 23,258 టన్నుల మేరకు శెనగలు పంపిణీ అయ్యాయి. సెప్టెంబర్ మాసంలో 7వ తేదీవరకు 15 లక్షల కుటుంబాలకు 1475 టన్నుల శెనగలు పంపిణీ అయ్యాయి. అక్టోబర్ మాసం కోసం 80 వేల కుటుంబాలకు 86 టన్నులు, నవంబర్ మాసం కోసం 40 వేల కుటుంబాలకు 40 టన్నుల మేరకు శెనగలు ఇప్పటికే పంపిణీ అయ్యాయి.
  3. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద వలస శ్రామికులకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, శెనగలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాలు సమర్పించిన గణాంకాల ప్రకారం వలస శ్రామికుల సంఖ్య 2.8 కోట్లుగా అంచనా తేలింది. ఆగస్టు వరకు గడచిన పంపిణీ కాలంలో 5.32 కోట్ల మంది వలస ప్రజలకు 2.67 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. అంటే సగటున నెలకు 2.66 కోట్ల లబ్దిదారులకు ఆహార ధాన్యాలు అందాయి. ఈ సంఖ్య వలస జనాభా అంచనా మొత్తంలో సుమారు 95 శాతం. అలాగే, ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద 1.64 కోట్ల వలస కుటుంబాలకు 16,417 మెట్రిక్ టన్నుల శెనగలు పంపిణీ అయ్యాయి. సగటున నెలకు 82 లక్షల కుటుంబాలు ఈ సాయం అందుకున్నాయి.

 

  • ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) కింద లబ్దిదారులు మొత్తం 8.52 కోట్ల గ్యాస్ సిలిండర్లు కోరగా... 2020 ఏప్రిల్, మే మాసాల కోసం ఇప్పటికే ఆ మొత్తం పంపిణీ పూర్తయింది. జూన్ మాసంలో 3.27 కోట్ల పిఎంయువై ఉచిత సిలిండర్లు లబ్దిదారులకు పంపిణీ అయ్యాయి. జూలైలో 1.05  కోట్లు, ఆగస్టులో 89 లక్షల సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సెప్టెంబర్ మాసంలో ఇప్పటిదాకా 15 లక్షల సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
  • 36.05 లక్షల మంది ఇపిఎఫ్ఒ సభ్యులు రూ. 9,543 కోట్ల మేరకు తమ ఇపిఎఫ్ఒ ఖాతాల నుంచి తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్సులను ఆన్ లైన్ ద్వారా ఉపసంహరించుకొని లబ్ది పొందారు.
  • 43 లక్షల మంది ఉద్యోగులకు 24 శాతం ఇపిఎఫ్ వాటా కింద రూ. 2476 కోట్లు బదిలీ అయ్యాయి. మార్చి నెలలో 34.19 లక్షల మంది ఉద్యోగులకు 514.6 కోట్ల మేరకు లబ్ది చేకూరింది. ఏప్రిల్ మాసంలో 32.87 లక్షల మంది ఉద్యోగులకు రూ. 500.8 కోట్లు, మే నెలలో 32.68 లక్షల ఉద్యోగులకు రూ. 482.6 కోట్లు, జూన్ నెలలో 32.21 లక్షల ఉద్యోగులకు రూ. 491.5 కోట్లు, జూలైలో 30.01 లక్షల మంది ఉద్యోగులకు రూ. 461.9 కోట్లు, ఆగస్టు నెలలో 1.77 లక్షల మంది ఉద్యోగులకు రూ. 24.74 కోట్లు అందాయి.
  • ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ: పెంచిన రేటు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా నోటిఫై అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 195.21 కోట్ల వ్యక్తి పని దినాల మేరకు పని జరిగింది. వేతనాలు, పరికరాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడానికి గాను రాష్ట్రాలకు రూ. 59,618 కోట్లు విడుదలయ్యాయి.
  • జిల్లా ఖనిజ నిధి (డిఎంఎఫ్) నుంచి 30 శాతం నిధులను వినియోగించాలని రాష్ట్రాలను కోరడం జరిగింది. ఆ మొత్తం రూ. 3,787 కోట్లు అవుతుంది. ఇప్పటిదాకా రూ. 343.66 కోట్లు ఖర్చు చేశారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ

07/09/2020 వరకు మొత్తం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ

పథకం

లబ్దిదారుల సంఖ్య

నగదు మొత్తం

పిఎంజెడివై

మహిళా ఖాతాదారులకు మద్ధతు

1వ వాయిదా - 20.65 కోట్లు (100 శాతం)

2వ వాయిదా - 20.63 కోట్లు

3వ వాయిదా - 20.62 కోట్లు (100 శాతం)

1వ వాయిదా -  రూ. 10,325 కోట్లు

2వ వాయిదా -  రూ. 10,315 కోట్లు

3వ వాయిదా -  రూ. 10,312 కోట్లు

ఎన్.ఎస్.ఎ.పి (వృద్ధ వితంతువులు, దివ్యాంగులు, వృద్ధ పౌరులు)కి సాయం

2.81 కోట్లు (100 శాతం)

రూ. 2,814 కోట్లు

పిఎం- కిసాన్ కింద రైతులకు

ముందస్తు చెల్లింపులు

8.94 కోట్లు

రూ. 17,891 కోట్లు

భవన & ఇతర

నిర్మాణ కార్మికులకు సాయం

1.82 కోట్లు

రూ. 4,987 కోట్లు

ఇపిఎఫ్ఒకి 24 శాతం వాటా

43 లక్షలు

రూ. 2,476 కోట్లు

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన

1వ వాయిదా - 7.43 కోట్లు

2వ వాయిదా - 4.43 కోట్లు

3వ వాయిదా - 1.82 కోట్లు

 

రూ. 9,700 కోట్లు

మొత్తం

42.08 కోట్లు

రూ. 68,820 కోట్లు

 

***



(Release ID: 1652474) Visitor Counter : 272