ప్రధాన మంత్రి కార్యాలయం

తెలుగు సినీనటుడు శ్రీ జయ ప్రకాశ్ రెడ్డి కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 SEP 2020 2:31PM by PIB Hyderabad

తెలుగు చలనచిత్ర నటుడు శ్రీ జయ ప్రకాశ్ రెడ్డి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘జయ ప్రకాశ్ రెడ్డి తనదైన నటనా శైలి తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్ర లో ఆయన అనేక మరపురాని పాత్రలను పోషించారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరని  లోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకుంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


***


(रिलीज़ आईडी: 1652326) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam