రాష్ట్రపతి సచివాలయం
ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కోవిడ్ మహమ్మారి సమయంలో డిజిటల్ విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్రను ప్రశంసించిన రాష్ట్రపతి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బాలలను తీర్చదిద్దనున్న జాతీయ విద్యావిధానం
Posted On:
05 SEP 2020 1:19PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 47 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ( సెప్టెంబర్ 5, 2020) వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి ,జాతీయ ఉపాధ్యాయ అవార్డులు గెలుచుకున్న వారిని అభినందించారు. పాఠశాల విద్యను గుణాత్మకంగా మెరుగుపరచడంలో వారు తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. జాతీయ అవార్డులు గెలుచుకున్నవారిలో 40 శాతం మంది మహిళలు ఉన్నారని అంటూ, విద్యాబోధకులుగా మహిళ పాత్రను రాష్ట్రపతి కొనియాడారు.
దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ కు నివాళులర్పిస్తూ , రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాధాకృష్ణన్ దార్శనికులని,రాజనీతిజ్ఞుడని మరీ ముఖ్యంగా ఒక అసాధారణ ఉపాధ్యాయుడని ఆయన అన్నారు. రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అంటే, దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా, అలాగే విద్యాబొధకులందరిపట్ల గౌరవసూచకంగా ఉపాధ్యాయదినోత్సవం జరుపుకోవడమని అని ఆయన అన్నారు. మనం మన ఉపాధ్యాయుల అంకితభావం , విద్యార్ధుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారి అత్యద్భుత పాత్రను గౌరవించేందుకు ఇది మంచి అవకాశం ఇస్తుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల నిబద్ధత ఏ పాఠశాలకైనా పునాది వంటిదని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు నిజమైన దేశ నిర్మాతలని,పిల్లలకు జ్ఞానాన్ని అందించడంలో, శీల నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకమని ఆయన అన్నారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన సవాలు వంటి పరిస్థితులలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, పిల్లలకు విద్య నేర్పేందుకు ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకుంటున్నారని అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన దిశగా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలలను మెరుగుపరుచుకోవడాన్ని ప్రశంసిస్తూ రాష్ట్రపతి, ఉపాధ్యాయులు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నైపుణ్యాలను నిరంతరం మెరుగు పరుచుకుంటూ ఉండాలని, ఆ రకంగా విద్యాబోధనను మరింత ప్రభావ వంతంగా తీర్చిదిద్ది , విద్యార్ధులు కొత్త టెక్నిక్‌ల పట్ల అవగాహన కలిగి ఉండేలా చేయాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులతో చేతులు కలిపి విద్యార్ధి నూతన రంగాల గురించి అధ్యయనం చేసేలా వారిలో ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించడానికి ఆన్‌లైన్ విద్యా వ్యవస్థ దోహదపడుతున్నదని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న వారు, లేని వారి మధ్య అంతరం గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గిరిజనులు, దూరప్రాంతాలలోని వారు లబ్ధిపొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జాతీయ విద్యావిధానం గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, నూతనంగా ప్రవేశపెట్టిన విధానం, బాలలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినదని చెప్పారు. ఈవిషయంలో వివిధ స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని రూపొందించినట్టు చెప్పారు. ఈ విధానాన్ని విజయవంతం చేయడంలో ప్రయోజనకరంగా తీర్చిదిద్దడడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర వహిస్తారని ఆయన తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయులను సమర్ధులుగా చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. విద్యారంగానికి అత్యుత్తమైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని రాంనాథ్ కోవింద్ అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్వాగతోపన్యాసం చేయగా, విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే వందన సమర్పణ చేశారు.
రాష్ట్రపతి హిందీ సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
****
(Release ID: 1651590)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam