భారత ఎన్నికల సంఘం

వివిధ రాష్ట్రాల్లో చేపట్టనున్న ఉపఎన్నికల నిర్వహణ ప్రక్రియ.

Posted On: 04 SEP 2020 2:41PM by PIB Hyderabad

వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణ గురించి ఈ రోజు కమిషన్ సమావేశం జరిగింది.  ప్రస్తుతం, శాసనసభ / పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు 65 స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి,  వీటిలో వివిధ రాష్ట్రాల రాష్ట్ర శాసనసభలలో 64 ఖాళీలు,  పార్లమెంటరీ నియోజకవర్గానికి 1 (ఒకటి) ఖాళీలు ఉన్నాయి. 

కొన్ని చోట్ల అదనపు సాధారణ భారీ వర్షాలు మరియు మహమ్మారి వంటి ఇతర అవరోధాలతో సహా అనేక అంశాల దృష్ట్యా తమ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ అనేక సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు / ముఖ్య ఎన్నికల అధికారులు పంపిన నివేదికలు మరియు సమాచారాన్ని కమిషన్ సమీక్షించింది. 

బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. 2020 నవంబర్ 29వ తేదీ లోపు ఈ ఎన్నికలు పూర్తి కావల్సిఉంది.   మొత్తం 65 స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు, బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలను కూడా, ఒకే సమయంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.  సి.ఏ.పి.ఎఫ్. / ఇతర శాంతిభద్రతల కదలికలతో పాటు సంబంధిత వస్తు రవాణా సమస్యలను  పరిష్కరించడానికి వీలుగా ఉంటుందనేది, ఈ ఎన్నికలను ఒకే సారి నిర్వహించడానికి గల ప్రధానకారణాలలో ఒకటి. 

ఈ ఉప ఎన్నికలతో పాటు బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఎన్నికల కమీషన్ తగిన సమయంలోప్రకటిస్తుంది .  

*****



(Release ID: 1651298) Visitor Counter : 156