ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్యలో అత్యున్నత స్థాయికెదిగిన భారత్

గత 24 గంటల్లో కోలుకున్నవారు 68,584 మంది

26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 70% దాటిన కోలుకున్నవారి శాతం

Posted On: 03 SEP 2020 3:00PM by PIB Hyderabad

గడిచిన 24  గంటల్లో అత్యధికంగా 11.7 లక్షలకు పైగా కోవిడ్ శాంపిల్స్ పరీక్షలు జరగగా భారత్ మరో అంశంలో కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకేరోజు దేశంలో 68,584 కోవిడ్ బాధితులు కోలుకున్నారు. గత 24గంటల్లో ఈ రికార్డు నమోదైంది. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య దాదాపు 30 లక్షలు (2,970,492) గా నమోదైంది.

దీంతో భారత్ లో కోలుకున్న బాధితులశాతం 77% (77.09%) పైబడింది. చికిత్సలో ఉన్న 8,15,538  మందికంటే  కోలుకున్నవారి సంఖ్య  21.5 లక్షలు ఎక్కువగా ఉంది. అంటే, చికిత్సలో ఉన్నవారికి 3.6 రెట్లు ఎక్కువగా కోలుకున్నవారున్నారు.  ఆ విధంగా అత్యధిక సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో చికిత్స అందించాల్సినవారి సంఖ్య క్రమంగఅ తగ్గుతూ  వస్తోంది. ప్రస్తుతం మొత్తమ్ పాజిటివ్ కేసులలో ఇంకా చికిత్సలో ఉన్నవారి శాతం 21.16%  మాత్రమే ఉంది.

 WhatsApp Image 2020-09-03 at 10.11.41 AM.jpeg

ఆస్పత్రులలో సమర్థవంతమైన చికిత్స, ఐసొలేషన్ లో ఉన్నవారి పర్యవేక్షణ, ఆవసరమైనవారికి ఆస్కిజెన్ అందజేయటం, బాధుతులను సకాలంలో తరలించటానికి మెరుగైన అంబులెన్స్ సేవలు సకాలంలో చికిత్స అందించటానికి దోహదం చేశాయి. నిపుణులైన డాక్టర్ల సాంకేతిక సహకారం, మార్గదర్శనం, న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య్ల టెలీమెడిసిన్ కన్సల్టేషన్లు, అవసరాన్నిబట్టి స్టెరాయిడ్స్, యాంటీ కొయాగ్యులెంట్స్ వాడకం   కోవిడ్ బాధితులచికిత్సలో సత్ఫలితాలనిచ్చాయి. ఈ చర్యలన్నిటి ఫలితంగా మొత్తం పాజిటివ్ లలో మరణాల సాతం తగ్గుతూ వచ్చి ఈ రోజుకు అది  ప్రపంచవ్యాప్తంగా 3.3% ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం 1.75% శాతంగా నమోదైంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

****



(Release ID: 1651020) Visitor Counter : 212