ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వంలో మానవ వనరుల నిర్వహణను మిషన్ కర్మయోగి విప్లవాత్మకంగా మెరుగుపరుస్తుంది: ప్రధాని
హెచ్ ఆర్ నిర్వహణలో నిర్దిష్ట పాత్ర పోషణలోకి వెళ్ళటానికి,
అవిచ్ఛిన్నంగా నేర్చుకోవటానికి ఐ-గాట్ వేదిక సహాయం
Posted On:
02 SEP 2020 7:48PM by PIB Hyderabad
మిషన్ కర్మయోగి వలన కలగబోయే ప్రయోజనాలమీద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అనేక ట్వీట్లు చేశారు.సివిల్ సర్వీసుల సామర్థ్యతా నిర్మాణం కోసం ఉద్దేశించిన ఈ జాతీయ కార్యక్రమం వలన మానవ వనరుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. పెద్ద ఎత్తున అత్యాధునిక మౌలిక సదుపాయాలను వాడుకుంటూ సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.
" హెచ్ ఆర్ నిర్వహణలో నిర్దిష్ట పాత్ర పోషణలోకి వెళ్ళటానికి, అవిచ్ఛిన్నంగా నేర్చుకోవటానికి ఐ-గాట్ వేదిక సహాయం చేస్తుంది. సివిల్ సర్వెంట్లు మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, పారదర్శకత, టెక్నాలజీల సాయంతో నవకల్పనల దిశగా పయనించటానికి మిషన్ కర్మయోగి దోహదం చేస్తుంది" అని ట్వీట్ చేశారు.
***
(Release ID: 1650831)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam