మంత్రిమండలి
భూగర్భశాస్త్రం, ఖనిజవనరుల రంగంలో పరస్పర సహకారానికి ఇండియా, ఫిన్లాండ్‌ల మధ్య అవగాహనా ఒప్పందాన్ని ఆమోదించిన కేంద్ర కేబినెట్.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, భూగర్భశాస్త్రం, ఖనిజవనరుల రంగంలో పరస్పర సహకారానికి భారత ప్రభుత్వ గనుల శాఖ కు చెందిన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు, ఫిన్లాండ్ ప్రభుత్వ ఉపాధి ఆర్థిక శాఖకు చెందిన జియలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ కు మధ్య అవగాహనా ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
Posted On:
02 SEP 2020 4:09PM by PIB Hyderabad
ఈ ఒప్పందం భూ గర్భ శాస్త్రం, శిక్షణ, ఖనిజాల అన్వేషణ, ఖనిజం ఏ మేరకు సరిపోతుందన్న దానిపై విశ్లేషణ, 3/4 డి మోడలింగ్, భూప్రకంపనలు, ఇతర భూభౌతిక సర్వేలలో పరస్పర సహకారానికి వీలు కల్పిస్తుంది.
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ కు మధ్య శాస్త్ర విజ్ఞాన సంబంధాలను బలోపేతం చేయడానికి దీనిని నిర్దేశించారు.
పరస్పర ఆర్థిక, సామాజిక పర్యావరణ ప్రయోజనం కోసం , ఈ ఒప్పందంలో పాల్గొంటున్న పక్షాల మధ్య భూగర్భ శాస్త్ర రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి , ఒక ఫ్రేమ్‌వర్క్ ను, వేదికను అందించడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. అలాగే భూగర్భ శాస్త్రం , ఖనిజ వనరుల రంగాలలో అన్వేషణ , మైనింగ్ ను ప్రోత్సహించడానికి భౌగోళిక డేటా నిర్వహణ సమాచార వ్యాప్తిపై అనుభవాలను పంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) భారత ప్రభుత్వానికి చెందిన అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన భూ విజ్ఞాన సంస్థ. ఇది జాతీయ స్థాయిలో భూగర్భ శాస్త్ర విజ్ఞాన సమాచారాన్ని , ఖనిజ వనరులకు సంబంధించిన సమాచారాన్ని రూపొందించి , ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతీకరిస్తుంటుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సంస్థ క్షేత్రస్థాయి సర్వేలు, గగనతల సర్వే, సముద్రతల సర్వే, ఖనిజాల లభ్యత, పరిశోధన, బహుళ భూ విజ్ఞాన, భూ సాంకేతిక, భూ పర్యావరణ, ప్రకృతి విపత్తుల సర్వేలు, గ్లేసియాలజీ, భూ ప్రకంపనల అధ్యయనం, మౌలిక పరిశోధనల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ కు బహుళ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమ్మిళితం చేయడం, ఖనిజాల అన్వేషణ, 3/4 డి మోడలింగ్ పై ప్రత్యేక దృష్టితో విశ్లేషించడంలో నైపుణ్యం కలిగి ఉంది. అలాగే విపత్తుల నిర్వహణ, పర్యావరణ ప్రభావ అంచనా రూపొందించడం, సామాజిక ఆర్థిక అంశాల ప్రాధాన్యత,నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. దీనిని జిఐఎస్ ఆధారిత నమూనాలో కనీస పరిజ్ఞానం కలవారు ఉపయోగించవచ్చు.
***
(Release ID: 1650704)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam