ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గడచిన 24 గంటల్లో భారతదేశంలో కోలుకున్న వారి సంఖ్య 65,081 గా నమోదైంది, కొత్త కేసులు 69,921 రిపోర్ట్ అయ్యాయి
గత 24 గంటల్లో 819 మరణాలు సంభవించాయి
Posted On:
01 SEP 2020 1:43PM by PIB Hyderabad
గత 5 రోజులుగా ప్రతి రోజు కోలుకున్నవారి సంఖ్య 60,000 పైగా నమోదవుతుండగా, గడచిన 24 గంటల్లో భారత్ లో 65,081 మంది రికవర్ అయినట్టు నమోదయింది. ఇప్పటి వరకు కోవిడ్-19 నుండి కోలుకున్న వారి సంచిత సంఖ్య 28,39,882 కి పెరిగి, 77% రికవరీ రేటు నమోదైంది. క్రియాశీలంగా ఉన్న కేసుల సంఖ్య కన్నా కోలుకున్నవారి సంఖ్య 3.61 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. యాక్టీవ్ కేసులు ఈ రోజుకి 7,85,996 ఉంటే, కోలుకున్నవారి సంఖ్య 20.53 లక్షలుంది. జులై నుండి ఆగస్టు చివరి వారం వరకు కోలుకున్నపేషెంట్ల సంఖ్య 4 రేట్లు పెరిగింది.
గత 24 గంటల్లో, ఐదు రాష్ట్రాలు దేశంలో కొత్త కేసులను అత్యధికంగా నమోదు చేశాయి. అవి మహారాష్ట్ర (11,852), ఆంధ్రప్రదేశ్ (10,004), కర్ణాటక (6,495), తమిళనాడు (5,956), ఉత్తర ప్రదేశ్ (4,782). గత 24 గంటల్లో5 రాష్ట్రాలు కలిపి దేశం మొత్తంతో చుస్తే 56% కేసులను జత చేశాయి.
అయితే ఈ ఐదు రాష్ట్రాలు కూడా గత 24 గంటల్లో గరిష్టంగా నయం అయి డిశ్చార్జి అయినా రోగుల సంఖ్యను నమోదుచేశాయి. మొత్తం దేశంలో ఉన్న 65,081 ధ్రువీకరణ ఆయిన కేసుల్లో 58.04% మంది ఈ 5 రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. మహారాష్ట్రలో 11,158 మంది రోగులు కోలుకోగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సంబంధించిన గణాంకాలు 8,772 మరియు 7,238 గా ఉన్నాయి. తమిళనాడు 6,008 మంది, ఉత్తర ప్రదేశ్ 4,597 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు.
గత 24 గంటల్లో పై 5 రాష్ట్రాల్లో 536 మరణాలు సంభవించగా ఇవి దేశంలో మొత్తం మరణాల సంఖ్య (819)లో 65.4% ఉన్నాయి. మహారాష్ట్రలో 184 మంది మరణించారు, కర్ణాటకలో 113 మంది, తమిళనాడు (91), ఆంధ్రప్రదేశ్ (85), ఉత్తర ప్రదేశ్ (63) మరణించారు.
కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు & సలహాలపై అన్ని ప్రామాణికమైన, నవీకరించిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ మరియు @ MoHFW_INDIA. కోవిడ్-19 కి సంబంధించిన సాంకేతిక ప్రశ్నలు technicalquery.covid19[at]gov[dot]in మరియు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ని సంప్రదించవచ్చు. కోవిడ్-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) నెంబర్ కి సంప్రదించవచ్చు. కోవిడ్-19 లోని రాష్ట్రాలు/ యుటిల హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వద్ద కూడా అందుబాటులో ఉంది.
****
(Release ID: 1650378)
Visitor Counter : 239
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam