హోం మంత్రిత్వ శాఖ

మాజీ రాష్ట్ర‌ప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్మృత్య‌ర్థం ఏడు రోజుల అధికారిక సంతాప దినాలు

Posted On: 31 AUG 2020 7:27PM by PIB Hyderabad

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, ఆగ‌స్టు 31, 2020న న్యూఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌, రెఫ‌ర‌ల్ ఆస్ప‌త్రిలో  మ‌ర‌ణించార‌న్న విష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం తీవ్ర విచారంతో వెల్ల‌డిస్తోంది.
మ‌ర‌ణించిన ఆ మ‌హ‌నీయుని స్మృత్య‌ర్థం గౌర‌వ‌సూచ‌కంగా ,దేశ‌వ్యాప్తంగా తేదీ 31-08-2020 నుంచి 06-09-2020 వ‌ర‌కు, రెండు రోజుల‌తో క‌లుపుకుని,అధికారిక సంతాప‌దినాలు పాటించ‌డం జ‌రుగుతుంది. దేశ‌వ్యాప్తంగా జాతీయ‌ప‌తాకాన్ని రెగ్యుల‌ర్‌గా ఎగుర‌వేసే భ‌వ‌నాల‌న్నింటిపై గ‌ల ప‌తాకాన్నిఈ సంతాప‌దినాల‌లో అవ‌న‌తం చేస్తారు. ఎలాంటి అధికారిక వినోద కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌రు.
అధికారికంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే స్థ‌లం , తేదీ, స‌మ‌యం త‌ర్వాత తెలియ‌జేస్తారు.

***(Release ID: 1650122) Visitor Counter : 120