ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజుకు సగటున 8 లక్షల పరీక్షలతో భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షలు

ప్రతి పది లక్షల జనాభాలో 27,000 కు పైబడ్డ పరీక్షలు

Posted On: 26 AUG 2020 2:26PM by PIB Hyderabad

 

సకాలంలో పరీక్షలు జరపటం ద్వారా త్వరగా కోవిడ్ బాధితులను గుర్తించటానికి వీలవుతోంది. దీంతో ఈ మహమ్మారిమీద పోరాటంలో భారత్ సరైన వ్యూహం అమలు చేయగలుగుతోంది. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే కేంద్ర ప్రభుత్వ వ్యూహం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయ కృషి, పెద్ద ఎత్తున పరీక్షలు జరపటానికి  వీలుగా మౌలిక సదుపాయాల పెంపు ఫలితంగా  రోజుకు పది లక్షల పరీక్షలు జరపగలిగే దిశగా భారత్ దూసుకుపోతోంది.

 


వరుసగా ఏడు రోజుల సగటు సంఖ్యలు గమనిస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పట్టుదలతో సమన్వయంతో కోవీద్ మీద సాగిస్తున్న పోరాటం అర్థమవుతుంది. ఇప్పటివరలు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 3,76,51,512 కి చేరుకోగా కేవలం గడిచిన 24 గంటల్లోనే 8,23,992 పరీక్షలు జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతుండగా బాధితులను తొలిదశలోనే గుర్తించటం సాధ్యమవుతోంది. అందువల్లనే స్వల్ప లక్షణాలున్నారిని ఇళ్ళలోనే ఏకాంతవాసంలో ఉంచటం, తీవ్రలక్షణాలున్న వారిని ఆస్పత్రులలో చేర్చటం లాంటి చర్యల ద్వారా త్వరగా కోలుకునేట్టు చేశారు. 


పరీక్షల సంఖ్య ప్రస్తుతం ప్రతి పదిలక్షల్లో 27,284 కావటానికి లాబ్ ల సంఖ్య పెరగటమే కారణం. దేశవ్యాప్తంగా పరీక్షలకోసం అవసరమైన లాబ్ ల నెట్ వర్క్ విస్తరిస్తూ వస్తోంది. దీంతో మొత్తం లాబ్ ల సంఖ్య ప్రస్తుతం 1540 కి చేరింది. అందులో ప్రభుత్వం ఆధ్వర్యంలో 992, ప్రైవేటు రంగంలో 548  లాబ్ లు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి: 


తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  790  (ప్రభుత్వ:  460 + ప్రైవేట్:  330)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 632  (ప్రభుత్వ: 498 + ప్రైవేట్: 134)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 118  (ప్రభుత్వ: 34  + ప్రైవేట్84) 
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
  కో విడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

***



(Release ID: 1648747) Visitor Counter : 192