ప్రధాన మంత్రి కార్యాలయం

రేపటి రోజు న ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పరిధి లో ఆర్థిక సహాయ సదుపాయాన్ని ప్రారంభించి, పిఎమ్-కిసాన్ లో భాగం గా ప్రయోజనాల ను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

ఒక లక్ష కోట్ల రూపాయల ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పంటకోత అనంతర నిర్వహణ సంబంధి మౌలిక సదుపాయాల తో పాటు సాముదాయిక వ్యవసాయ ఆస్తుల సృజ‌న కు ఉత్ప్రేరకం గా పనిచేయయగలదు

పిఎమ్-కిసాన్ యొక్క ఆరో కిస్తీ లో భాగం గా 8.5 కోట్ల మంది కి పైగా రైతుల కు 17,000 కోట్ల రూపాయల విలువైన నిధుల ను విడుదల చేయడం జరుగుతుంది

Posted On: 08 AUG 2020 1:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అనగా ఆగస్టు 9వ తేదీ నాడు, ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఒక లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయాన్ని ‘ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ రూపం లో ప్రారంభించనున్నారు.   పిఎమ్-కిసాన్ లో భాగం గా 8.5 కోట్ల మంది కి పైగా రైతుల కు ఆరో కిస్తీ గా 17,000 కోట్ల రూపాయల విలువైన నిధుల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు.   దేశవ్యాప్తం గా లక్షలాది రైతులు, సహకార సంఘాలు, ఇంకా పౌరులు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.  ఈ కార్యక్రమం లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ కూడా పాల్గొంటారు.

ఒక లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయం తాలూకు కేంద్రీయ రంగ పథకాన్ని ‘‘ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’’ పేరిట  ఒక లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయం తాలూకు కేంద్రీయ రంగ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.  పంటకోత ల అనంతర నిర్వహణ సంబంధి మౌలిక సదుపాయాలు మరియు చలవ గిడ్డంగి, సేకరణ కేంద్రాలు, ప్రోసెసింగ్ యూనిట్ లు మొదలైన సాముదాయిక వ్యవసాయ సంపత్తుల ను ఏర్పాటు చేయడం లో ఈ నిధి ఓ ఉత్ప్రేరకం వంటి పాత్ర ను పోషించనుంది.  రైతులు వారి యొక్క ఉత్పత్తి కి మరింత అధిక విలువ ను రాబట్టుకొనేలా ఈ కోవ కు చెందిన ఆస్తులు తోడ్పాటు ను అందించగలవు.  అది ఎలాగంటే, రైతులు వారి యొక్క ఉత్పత్తుల ను నిలవ చేసుకొనేందుకు, వృథా ను తగ్గించుకొనేందుకు, ఇంకా ప్రోసెసింగ్ ను ఇనుమడింపచేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తుల కు విలువ ను జోడించడం వంటి పద్ధతుల ను అనుసరించడం ద్వారా అధిక ధరల కు వ్యవసాయ ఉత్పత్తుల ను విక్రయించుకొనేందుకు వీలు ఉంటుంది.  ఆర్థిక సహాయ సదుపాయం ద్వారా ఒక లక్ష కోట్ల రూపాయల ను- బహుళ రుణ ప్రదాన సంస్థ ల భాగస్వామ్యం తో- మంజూరు చేయడం జరుగుతుంది;  12 ప్రభుత్వ రంగ బ్యాంకుల లో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈసరికే డిఎసి&ఎఫ్ డబ్ల్యు తో ఎమ్ఒయుల పై సంతకాలు చేశాయి.  ఈ పరియోజన ల స్వయంభరణశక్తి ని అధికం చేయడం కోసం లబ్ధిదారుల కు 2 కోట్ల రూపాయల వరకు పరపతి పూచీ తో పాటు 3 శాతం వడ్డీ సంబంధి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది.  పథకం యొక్క లబ్ధిదారుల లో రైతులు, పిఎసిఎస్, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ లు, ఎఫ్ పిఒ లు, ఎస్ హెచ్ జి లు, జాయింట్ లయబిలిటి గ్రూప్స్ (జెఎల్ జి), బహుళప్రయోజనాత్మక సహకార సంఘాలు, వ్యవసాయ సంబంధి నవ పారిశ్రామికులు, స్టార్ట్ అప్ స్, ఇంకా సెంట్రల్/ స్టేట్ ఏజెన్సి లేదా స్థానిక సంస్థ ప్రాయోజితం చేసిన పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ ప్రాజెక్టు లు ఉంటాయి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎమ్-కిసాన్) పథకాన్ని 2018వ సంవత్సరం లో డిసెంబర్ ఒకటో తేదీ నాడు ప్రవేశపెట్టడమైంది.  ఈ పథకం 9.9 కోట్ల మంది కి పైగా రైతుల కు 75,000 కోట్ల రూపాయల కు పైగా నేరు నగదు ప్రయోజనాన్ని సమకూర్చింది.  దీనితో వారు వారి యొక్క వ్యవసాయ సంబంధి అవసరాల ను నెరవేర్చుకొనే వీలు తో పాటు వారి యొక్క కుటుంబాల కు దన్ను గా నిలచే వీలు కూడా ఏర్పడింది.   పిఎమ్-కిసాన్ పథకానికి రూపకల్పన చేయడం, మరి ఈ పథకాన్ని అమలు లోకి తీసుకురావడం వంటి పనులు ఒక అనుపమానమైనటువంటి వేగం తో జరిగాయి.  ఈ పథకం లో భాగం గా నిధుల ను అవి దారిమళ్లడాన్ని నిరోధించడానికి మరియు రైతుల కు సౌకర్యాన్ని పెంపు చేయడానికి గాను లబ్ధిదారుల కు చెందిన రూఢిపరచినటువంటి బ్యాంకు ఖాతా ల లోకే నేరు గా బదలాయించడం జరుగుతున్నది.  లాక్ డౌన్ వేళ లో సుమారు 22,000 కోట్ల రూపాయల మేరకు రైతుల కు సహాయం గా ఇవ్వడం ద్వారా ‘కోవిడ్-19’ విశ్వమారి కాలం లో వారికి సాయపడం లో ఈ పథకం ఊతం గా నిలచింది.   
 

****
 



(Release ID: 1644398) Visitor Counter : 276