ప్రధాన మంత్రి కార్యాలయం

'శ్రీ రామ జన్మభూమి మందిరం' శంకుస్థాపన సందర్భంగా రేపు నిర్వహించే బహిరంగ కార్యక్రమానికి హాజరుకానున్న - ప్రధానమంత్రి.

Posted On: 04 AUG 2020 6:36PM by PIB Hyderabad

అయోధ్యలో 'శ్రీ రామ జన్మభూమి మందిరం' శంకుస్థాపన సందర్భంగా రేపు జరిగే బహిరంగ కార్యక్రమానికి ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి ముందు, హనుమన్ గర్హి లో నిర్వహించే పూజ, దర్శనాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు.  ఆ తర్వాత ఆయన శ్రీ రామ జన్మభూమిని చేరుకుని, అక్కడ 'భగవాన్ శ్రీ రామ్‌లాలా విరాజ్ మాన్' యొక్క పూజ, దర్శనాలలో కూడా పాల్గొంటారు.  అనంతరం, ఆయన అక్కడ ఒక పారిజాత మొక్కను నాటుతారు. ఆ తర్వాత భూమి పూజ నిర్వహిస్తారు. 

శంకుస్థాపన కు గుర్తుగా ప్రధానమంత్రి ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు.  'శ్రీ రామ జన్మభూమి మందిర్' పై ఒక స్మారక తపాలా బిళ్ళను కూడా ఆయన ఈ సందర్భంగా విడుదల చేస్తారు.

****(Release ID: 1643464) Visitor Counter : 31