ప్రధాన మంత్రి కార్యాలయం

సర్వోన్నత న్యాయస్థానం నూతన భవనాన్ని కలసి ప్రారంభించిన మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ మరియు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 30 JUL 2020 1:14PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ మారిశస్ లోని సర్వోన్నత న్యాయస్థానం యొక్క నూతన భవనాన్ని ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంయుక్తం గా ప్రారంభించారు.  భారతదేశం సహాయాన్ని అందించినటువంటి ఒకటో మౌలిక సదుపాయాల రంగ పరియోజన, ఇంకా ప్రపంచ వ్యాప్త వ్యాధి కోవిడ్ ప్రబలిన తరువాత రాజధాని నగరం పోర్ట్ లుయిస్ లో ప్రారంభానికి నోచుకొన్న భవనం ఇదే.  ఈ ప్రముఖ ప్రాజెక్టు ను 28.12 మిలియన్ యుఎస్ డాలర్ మేర భారత ప్రభుత్వం నుండి లభించిన గ్రాంట్ అసిస్టెన్స్ తో పూర్తి చేయడం జరిగింది.


ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అభివృద్ధి కై సహకారాన్ని అందించాలి అనేటటువంటి భారతదేశం యొక్క అంతర్నిహిత దర్శనం లో మానవ ప్రయోజనాల కు పట్టం కట్టిన సంగతి ని ప్రముఖం గా ప్రస్తావించారు.  మారిశస్ కు మరియు భారతదేశానికి మధ్య గల సన్నిహిత సంబంధాల ను మరింత గా పరిపుష్టం చేయడం లో ప్రజాహితం ప్రధానం గా గల మౌలిక సదుపాయ సంబంధి పరియోజన లు పోషిస్తున్నటువంటి పాత్ర ను కూడా ఆయన కొనియాడారు.  ఆధునిక రూపురేఖ లు మరియు అత్యాధునిక సదుపాయాల మేలుకలయిక గా వెలసిన సర్వోన్నత న్యాయస్థానం యొక్క నూతన భవనం మారిశస్ న్యాయ వ్యవస్థ కు అలాగే భారతదేశం మరియు మారిశస్ ల ఉమ్మడి విలువల కు ఒక దీటైన ఆసనం గా కూడా  పేరు తెచ్చుకొంటుందని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ ప్రాజెక్టు కాలసూచీ మేరకే ఆరంభిక అంచనాల కంటే తక్కువ వ్యయంతో పూర్తి అయిన సంగతి ని కూడా ఆయన ప్రస్తావించారు. 

మారిశస్ తో అభివృద్ధి పరంగా ఏర్పరచుకొన్న సహకారం నిజానికి అభివృద్ధి తో ముడిపడిన భాగస్వామ్యాల ను ఏర్పరచుకోవాలన్న భారతదేశం యొక్క వైఖరి కి కేంద్రస్థానం లో నిలచింది అని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశం అందించే అభివృద్ధి సంబంధి సహకారం ఎటువంటి షరతుల తో లభించడం గాని, లేదా ఏ రాజకీయ ప్రయోజనాలతోనో, ఇంకా వాణిజ్య ప్రయోజనాలతోనో ప్రభావితం కావడం గాని జరగదు అని ఆయన స్పష్టం చేశారు.  మా భాగస్వాములంటే ఉన్న గౌరవ భావమే భారతదేశం అందించే అభివృద్ధి సంబంధి సహకారానికి కీలకమైన సూత్రం అని, అంతే కాక అభివృద్ధి పరం గా మేము నేర్చుకొన్నటువంటి పాఠాల ను ఇతరుల తో పంచుకోవాలనేది మా ముఖ్య ప్రేరణ గా ఉందని ఆయన అన్నారు. ఇది, ‘ఆదరణ’, ‘వైవిధ్యం’, ‘భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని శ్రద్ధ వహించడం’, ఇంకా ‘నిరంతర వికాసం’ అనే ప్రముఖ విలువల రూపం లో భారతదేశం యొక్క అందించే అభివృద్ధి సంబంధి సహకారాన్ని ప్రత్యేకమైంది గా నిలబెడుతున్నదని ఆయన నొక్కిచెప్పారు. 

మారిశస్ ప్రజల కార్యసాధనల ను చూసి భారతదేశం గర్వపడుతున్నదని ప్రధాన మంత్రి పేర్కొంటూ, భారతదేశం-మారిశస్ భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల లో మరింత ఉన్నత శిఖరాల కు ఎదగడం ఖాయం అనే విషయం లో తనకు విశ్వాసం ఉన్నదని చెప్పారు. 

ఈ ప్రాజెక్టు కోసం భారతదేశం అందజేసిన సమర్ధన ఇరు దేశాల మధ్య గల మైత్రి మరియు సహకారం తాలూకు సన్నిహిత బంధానికి అద్దం పడుతున్నదంటూ ప్రధాని శ్రీ జగన్నాథ్ తన గాఢమైన ప్రశంస ను వ్యక్తం చేశారు.  భారతదేశం యొక్క సహాయం తో సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని నిర్మించడం మారిశస్ లో మౌలిక సదుపాయాల ఆధునికీకరణ దిశ లో ఒక క్రొత్త మైలురాయి గా ఉన్నదని, ఇది మారిశస్ న్యాయ వ్యవస్థ ను మరింత దక్షత కలిగిందిగా, మరింత మంది కి అందుబాటు లోకి తెచ్చేది గాను, ఇంకా మరిన్ని వర్గాల ను కలుపుకుపోయేది గాను తీర్చిదిద్దడం లో సహాయకారి కాగలదని ఆయన అన్నారు.

భారతదేశం అనుసరిస్తున్నటువంటి ‘సాగర్ - సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియన్ [ SAGAR ]దార్శనికత కు అనుగుణం గా, సర్వోన్నత న్యాయస్థానం యొక్క నూతన భవనం హిందూ మహాసముద్ర ప్రాంతం లో మారిశస్ కు ఆధారపడదగిన భాగస్వామ్య దేశం గా భారతదేశం యొక్క భూమిక ను, అలాగే ఉభయ దేశాల మధ్య భవిష్యత్తు ప్రధానంగా ఉండే భాగస్వామ్యాన్ని బలపరచుకోవాలన్న భారతదేశం యొక్క అచంచల వచనబద్ధత ను కళ్ల కు కడుతున్నది. 


***



(Release ID: 1642551) Visitor Counter : 193