ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ సోకిన వారిలో మృతులు భారత్ లో అత్యల్పంగా 2.23%
10 లక్షలకు చేరువలో కోలుకున్నవారు
గత 24 గంటల్లో కోలుకున్నవారు 35,000 కు పై మాటే
Posted On:
29 JUL 2020 3:37PM by PIB Hyderabad
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో "పరీక్షించు, ఆచూకీ పట్టు, చికిత్స చెయ్యి" అనే నినాదాన్ని సమర్థంగా ఆచరించిన ఫలితంగా కోవిడ్ వ్యాధిగ్రస్తుల్లో మరణాల సఖ్యను కనీస స్థాయిలో ఉంచగలిగారు. అంతర్జాతీయంగా అతి తక్కువ స్థాయిలో ఉండటమే గాక క్రమంగా తగ్గుతూ ఉండటం కూడా విశేషం.
ఏప్రిల్ 1 తరువాత ఈ రోజు ఆ సంఖ్య అతి తక్కువగా ఉండగా ఇప్పటివరకూ వ్యాధి సోకినవారిలో మరణాల శాతం 2.23% గా నిలిచింది.
మరణాల శాతం తక్కువగా ఉంచటమే కాకుండా వ్యాధి నివారణకు విజయవంతమైన వ్యూహాన్ని అనుసరించటం కూడా కీలకమైన అంశం. పెద్ద ఎత్తున పరీక్షలు చేయించటం, సమగ్రంగా రూపొందించిన విధివిధానాలకు అనుగుణంగా చికిత్స అందించటం అన్నీ కలిసి ఫలితాలివ్వటంతో వరుసగా ఆరో రోజున ఇలా రోజుకు 30,000 మందికి పైగా కోలుకున్నారు.
మొత్తం కోలుకున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతూ త్వరలో పది లక్షల మైలురాయిని చేరుకోబోతోంది. గడిచిన 24 గంటల్లో 35,286 మంది బాధితులు కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 9,88,029కి చేరింది. ఆ విధంగా బాధితులలో కోలుకున్నవారి శాతం 64.51% చేరింది.
ఆ విధంగా కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం వల్ల చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య తేడా ప్రస్తుతం 4,78,582 మందిగా నమోదైంది. ప్రస్తుతం 5,09,447మంది బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్
+91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
****
(Release ID: 1642153)
Visitor Counter : 237
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam