ప్రధాన మంత్రి కార్యాలయం

బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల స్టేక్ హోల్డ‌ర్ల‌తో జ‌రిగే మేథోమ‌ధ‌న స‌మావేశంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 28 JUL 2020 5:31PM by PIB Hyderabad

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డ‌ర్ల‌తో రేపు (29-07-2020) సాయంత్రం జ‌రిగే మేధోమ‌ధ‌న స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొంటారు. భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌, ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించేందుకు ఏర్పాటైన ఈ స‌మావేశంలో ఆయ‌న పాల్గొంటారు.
రుణ ఉత్ప‌త్తులు, స‌మ‌ర్ధ పంపిణీ విధానాలు, సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికార‌త‌,
ఆర్థిక రంగం  స్థిరత్వం ,సుస్థిర‌త‌ల‌కు  ముందుచూపుతో కూడిన వివేక‌వంత‌మైన విధానాలు వంటి అంశాలు ఈ సంద‌ర్భంగా చ‌ర్చించ‌నున్నారు.
ఎం.ఎస్‌.ఎం.ఇలతో సహా మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, స్థానిక తయారీ రంగానికి ఫైనాన్సింగ్ వంటివాటి ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో బ్యాంకింగ్ రంగం అత్యంత‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఆర్థిక స‌మ్మిళితత్వం, సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికార‌త సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌నుంది.
ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన‌నున్నారు.

***



(Release ID: 1641847) Visitor Counter : 220