ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నేపథ్యంలో 20 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్ల మేర ఆదాయపు పన్ను రిఫండ్‌లు జరిపిన ఆదాయ పన్ను శాఖ
Posted On:
03 JUL 2020 12:42PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పన్ను చెల్లింపుదారులకు సహాయపడటానికి ఆదాయపు పన్ను శాఖ వేగంగా పన్ను రిఫండ్‌లు జరిపింది. ఏప్రిల్ 8వ తేదీన వెల్లడించిన ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆదాయపు పన్ను శాఖ చెల్లింపుదారులకు సహాయపడాలన్న భావనతో ఏప్రిల్ 8 నుండి జూన్ 30, 2020 మధ్య కాలంలో నిమిషానికి దాదాపు 76 కేసుల వేగంతో పన్ను వాపసులను జరిపింది. కేవలం 56 రోజుల వ్యవధిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీటీడీ) 20.44 లక్షలకు పైగా కేసులకు సంబంధించి రూ.62,361 కోట్ల మేర ఆదాయపు పన్ను రిఫండ్లను జరిపింది.
ఈ చర్య పన్ను చెల్లింపుదారుల పట్ల ఐ-టీ శాఖ చూపుతున్న అనుకూల ధోరణిని ప్రతిబింబించడమే కాకుండా కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి వంటి క్లిష్ట సమయంలో వేగంగా ఐ-టీ పన్నుల రిఫండ్‌తో చెల్లింపుదారుల చేతిలో తగు విధంగా నగదు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకున్నట్టయింది. మొత్తం 19,07,853 కేసులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూ.23,453.57కోట్ల పన్ను రిఫండ్లను జరిపింది. ఇదే సమయంలో కార్పొరేట్ పన్ను వాపసులు కూడా మెరుగ్గానే నమోదు అయ్యాయి. 1,36,744 కేసుల్లో రూ.38,908.37 కోట్ల పన్ను రిఫండ్‌ను చెల్లింపుదారులకు జారీ చేశారు. ఈ పరిమాణాన భారీ సంఖ్యలో పన్ను రిఫండ్లను శాఖ పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో జారీ చేసింది. వీటిని పన్ను చెల్లింపుదారుల బ్యాంక్ ఖాతాలలోకి నేరుగా జమ చేయబడ్డాయి.
గతంలో మాదిరిగా కాకుండా, పన్ను చెల్లింపుదారుడు పన్ను వాపసుల విడుదలకు ఐ-టీ శాఖను అభ్యర్థించాల్సిన అవసరం లేకుండానే వారు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పన్ను వాపసు పొందేలా చర్యలు తీసుకున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు డిపార్ట్మెంట్ యొక్క ఈ-మెయిళ్ళకు తక్షణం ప్రతిస్పందనను అందించాలని సీబీడీటీ మరోసారి పునరుద్ఘాటించింది. తద్వారా వారి కేసులలో వాపసులు ప్రాసెస్ కూడా వేగంగా చేయబడి వెంటనే రిఫండ్ జారీ చేయబడుతాయని వివరించింది. ఐ-టీ శాఖ ఆదాయపు పన్ను వాపసు ఇవ్వడానికి ముందు రీకన్సిలేషన్ లోపం/ వివిధ అసమతుల్యతల సయోధ్య నిర్ధారణకు గాను ఈ -మెయిల్‌ల ద్వారా పన్ను చెల్లింపుదారుల నుంచి అవుట్ స్టాడింగ్ డిమాండ్, వారి బ్యాంక్ ఖాతాల సంఖ్యలను నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తుంది. పన్ను చెల్లింపుదారుల నుండి సత్వర స్పందనల వల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేయడానికి ఐ-టీ విభాగానికి వీలు కలుగుతుందని తెలిపింది.
****
(Release ID: 1636246)
Visitor Counter : 274
Read this release in:
Punjabi
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam