ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా టీకాలు వేయడానికి ప్రణాళిక మరియు సన్నాహాలను సమీక్షించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది
ఈ జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణకు ప్రధానమంత్రి నాలుగు మార్గదర్శక సూత్రాలను సూచించారు
Posted On:
30 JUN 2020 2:52PM by PIB Hyderabad
టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే, కోవిడ్-19 కు వ్యతిరేకంగా టీకాలు వేయడానికి ప్రణాళిక మరియు సన్నాహాలను సమీక్షించడానికి, ఈ రోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అధ్యక్షత వహించారు.
భారతదేశపు విస్తారమైన మరియు విభిన్న జనాభాకు టీకాలు వేయడం, మందుల సరఫరా నిర్వహణ, హాని ఎక్కువగా ఉన్న జనాభాకు ప్రాధాన్యత ఇవ్వడం, ఈ ప్రక్రియలో పాల్గొన్న వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, అలాగే ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో ప్రైవేటు రంగం మరియు పౌర సమాజం పాత్ర వంటి విషయాల గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.
ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రధానమంత్రి నాలుగు మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు : మొదటి సూత్రం : టీకాలు ప్రారంభించే సమయంలో, ముందుగా హాని కలిగించే సమూహాలను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలి, ఉదాహరణకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యేతర ఫ్రంట్ లైన్ కరోనా యోధులు మరియు సాధారణ జనాభాలో హాని కలిగించే వ్యక్తులు; రెండవది : “ఎవరికైనా, ఎక్కడైనా” టీకాలు వేయడం జరగాలి, అంటే, వ్యాక్సిన్ వేయడానికి ఎటువంటి నివాస సంబంధిత నిబంధనలు విధించకూడదు; మూడు : ఆ టీకా సరసమైనదిగా, సార్వత్రికమైనదిగా ఉండాలి - ఏ వ్యక్తిని వదిలివేయకూడదు; మరియు నాలుగు : ఉత్పత్తి నుండి టీకా వరకు మొత్తం ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో నిజ సమయంలో పర్యవేక్షించాలి మరియు మద్దతు ఇవ్వాలి.
అన్నింటినీ అత్యంత సమర్థవంతంగా, సమయానుసారంగా టీకాలు వేయడానికి చేపట్టే ఈ జాతీయ కార్యక్రమానికి వెన్నుముకలా నిలిచే సాంకేతిక పద్ధతులను విస్తృత స్థాయిలో అంచనా వేయాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇంత పెద్ద ఎత్తున టీకాలు వేసే ఈ కార్యక్రమానికి సవివరమైన ప్రణాళికను రూపొందించే పని వెంటనే చేపట్టాలని ప్రధానమంత్రి ఆదేశించారు.
టీకా అభివృద్ధి ప్రయత్నాల ప్రస్తుత స్థితిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా టీకాలు వేసే ప్రయత్నాలలో ఉన్నతమైన పాత్ర పోషించాలన్న భారతదేశ నిబద్ధతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
****
(Release ID: 1635431)
Visitor Counter : 320
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam