ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

'పీఎం ఎఫ్ఎంఈ ప‌థ‌కం'తో రూ.35,000 కోట్ల పెట్టుబ‌డులు, 9 లక్షల మందికి ఉపాధి అవ‌కాశాలు: హర్సిమ్రత్ కౌర్ బాదల్

ఈ ప‌థ‌కంలో సమాచారం, శిక్షణ, మెరుగైన ఎక్స్పోజర్ మరియు ఫార్మలైజేషన్ ద్వారా 8 లక్షల సంస్థ‌ల‌కు ప్రయోజనం

“పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట‌ర్‌ప్రైజ‌స్‌ (పీఎం ఎఫ్ఎంఈ) పథకం” ప్రారంభించిన శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్

పీఎం ఎఫ్ఎంఈ ప‌థ‌కం మార్గదర్శకాలు విడుదలచేసిన స‌ర్కారు

Posted On: 29 JUN 2020 1:33PM by PIB Hyderabad

 

“ఆత్మ నిర్భ‌ర్‌ భారత్ అభియాన్” లో భాగంగా కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సోమ‌వారం (29వ తేదీన‌) 'పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం ఎఫ్ఎంఈ) పథకం'ను ప్రారంభించారు. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ‌ల స‌హాయ మంత్రి రామేశ్వర్ తేలి స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రార‌భించారు.

ఈ పథకం ద్వారా మొత్తం రూ.35,000 కోట్ల పెట్టుబడులు వ‌చ్చే అవకాశం ఉన్న‌ట్టు మంత్రి తెలిపారు. దీనికి తోడు దాదాపు 9 లక్షల మంది నైపుణ్యం మరియు పాక్షిక‌ నైపుణ్యం క‌లిగిన వారికి ఉపాధి ల‌భించ‌గ‌ల‌ద‌ని మంత్రి వివరించారు‌. ఈ ప‌థ‌కంలో సమాచారం, శిక్షణ, మెరుగైన ఎక్స్‌పోజర్, ఫార్మలైజేషన్ ద్వారా 8 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ఈ సందర్భంగా పథకం యొక్క పూర్తి మార్గదర్శకాలను విడుదల చేశారు. స్థానిక ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ప్రాధాన్య‌త‌ను ఎత్తిచూపిన కేంద్ర మంత్రి, ప‌ల్లెల్లో గ్రామీణ పారిశ్రామికవేత్తలు తయారు చేసే ఆహార ఉత్పత్తులు స్థానిక జనాభాకు కావాల్సిన భారతీయ ఆహార ఉత్పత్తులను సరఫరా చేసే సుదీర్ఘ సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ స్థానిక యూనిట్ల ప్రాముఖ్యత మరియు స‌మాజంలో వాటి పాత్రను గురించి గౌరవ ప్రధాని ఈ ఏడాది మే 12వ తేదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ వివ‌రించారు.


స్థానిక ఉత్ప‌త్తుల‌కు స్వరంగా మారాలి  "సంక్షోభ సమయాల్లో స్థానిక యూనిట్ల ఉత్ప‌త్తులు మ‌న డిమాండ్‌ను నెరవేర్చాయి, ఈ విధానం మమ్మల్ని రక్షించింది. స్థానిక‌త అనేది అవసరం మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. స్థానికాన్ని మన జీవిత మంత్రంగా చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని సమయం మనకు నేర్పింది. ఈ రోజు గ్లోబల్ బ్రాండ్లుగా భావిస్తున్న చాలా సంస్థ‌ల్లో తొల‌త స్థానికంగా మొదలైన‌వే. ప్రజలు వాటిని ఉపయోగించడం ప్రారంభించ‌డం, ప్రోత్సహించడం వాటిని బ్రాండింగ్ చేయడం, స‌గర్వంగా నిల‌బెట్టిన‌ కార‌ణంగా ఆయా ఉత్పత్తులు త‌రువాత కాలంలో గ్లోబల్ బ్రాండ్లుగా మారాయి. కావున‌, ఈ రోజు నుండి ప్రతి భారతీయుడు తమ స్థానిక ఉత్ప‌త్తుల‌కు స్వరంగా మారాలి, స్థానిక ఉత్పత్తులను కొనడమే కాదు, వాటిని స‌గర్వంగా ప్రోత్సహించాలి. మన దేశం ఈ విధంగా చేయగలదని నాకు నమ్మకం ఉంది.” అని మంత్రి అన్నారు.


అసంఘటిత ఆహార ప్రాసెసింగ్ రంగంలో 25ల‌క్ష‌ల యూనిట్లు ఆహార ప్రాసెసింగ్ రంగం ఎదుర్కొంటున్న వివిధ ర‌కాల సవాళ్ళ గురించి మంత్రి వివ‌రించారు. ప్ర‌ధానంగా అసంఘటిత ఆహార ప్రాసెసింగ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంద‌ని తెలిపారు. ఇది వారి పనితీరును మరియు వారి ఎదుగుద‌ల‌ను పరిమితం చేస్తుందని బాదల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలకు ప్రాప్యత లేకపోవడం, శిక్షణ లేమి, త‌గిన సంస్థాగత రుణ స‌దుపాయం పొందే వీలు లేకుండా ఉండ‌డం, ఉత్పత్తుల నాణ్యత నియంత్రణపై ప్రాథమిక అవగాహన లేకపోవడం; మరియు బ్రాండింగ్ మ‌రియు మార్కెటింగ్ నైపుణ్యాలు లేకపోవడం త‌దిత‌రాలు ఉన్నాయ‌ని మంత్రి అన్నారు. ఈ సవాళ్ల కారణంగా అసంఘటిత ఆహార ప్రాసెసింగ్ రంగం భారీగా సామర్థ్యం ఉన్నప్పటికీ .. ఉత్పత్తి పరంగా త‌గిన విలువ జోడింపు విష‌యంలో చాలా త‌క్కువ స్థాయిలో ఉంద‌ని మంత్రి వివ‌రించారు. దాదాపు 25 లక్షల యూనిట్లతో కూడిన అసంఘటిత ఆహార ప్రాసెసింగ్ రంగం మొత్తం ఆహార ప్రాసెసింగ్ రంగంలో 74 శాతం ఉపాధికి దోహదపడుతుందని కేంద్ర ఎఫ్‌పీఐ మంత్రి బాద‌ల్‌ వివ‌రించారు. ఈ యూనిట్లలో దాదాపు 66 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో 80 శాతం కుటుంబ ఆధారిత సంస్థల‌ని.. ఇవి జీవనోపాధి గ్రామీణ గృహాలకు మద్దతు ఇస్తున్నాయ్నారు. త‌ద్వారా పట్టణ ప్రాంతాలకు వలసలను తగ్గించాయ‌ని అన్నారు. ఈ యూనిట్లు ఎక్కువగా సూక్ష్మ సంస్థల వర్గంలోనే ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు.

పీఎం ఎఫ్ఎంఈ పథకం వివరాలు


ప్రస్తుత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఆధునికీక‌ర‌ణ కోసం ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహకారాన్ని అందించే ఉద్దేశ్యంతో కేంద్ర‌ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌పీఐ) అఖిల భారతస్థాయిలో “మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం ఎఫ్‌ఎంఈ) పథకాన్ని.. కేంద్రపు ప్ర‌యోజిత  పీఎం ఫార్మలైజేషన్” ను ప్రారంభించింది. 2020-21 నుండి 2024-25 వరకు ఐదేండ్ల కాలానికి గాను రూ.10,000 కోట్లతో దీనిని అమలు చేయ‌నున్నారు. 


ఈ పథకం వ్యయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి‌లో పంచుకోనున్నాయి. ఈశాన్య మరియు హిమాలయ ప్రాంతంలోని రాష్ట్రాలు 90:10 నిష్పత్తిలోనూ.. శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు 60:40 నిష్పత్తిలో మరియు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ప‌థ‌కం వ్య‌యాన్ని పూర్తిగా  వంద శాతం కేంద్ర‌మే భ‌రించ‌నుంది. ఈ సంస్థ‌ల‌కు కావాల్సిన ఆయా ముడిస‌రుకులు సేకరించడం, సాధారణ సేవలను పొందడం మరియు ఉత్పత్తుల మార్కెటింగ్ పరంగా భారీ స్థాయి ప్రయోజనాన్ని పొందటానికి ఈ పథకం 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్స్‌ (ఓడీఓడీపీ) విధానాన్ని ఈ ప‌థ‌కం అనుసరిస్తుంది. ఆయా రాష్ట్రాలు ప్రస్తుత అందుబాటులో ఉన్న క్ల‌స్ట‌ర్ల‌ను మరియు ముడి పదార్థాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఒక జిల్లాకు ఆహార ఉత్పత్తిని ఎంపిక చేస్తాయి. ఓడీఓడీపీ ఉత్పత్తి త్వ‌ర‌గా పాడైపోయే ల‌క్ష‌ణం ఉన్న ఉత్పత్తి ఆధారిత ఉత్పత్తి లేదా తృణధాన్యాల ఆధారిత ఉత్పత్తులు లేదా ఒక జిల్లాలో మరియు వాటి అనుబంధ రంగాలలో విస్తృతంగా ఉత్పత్తి చేయబడిన ఆహార ఉత్పత్తి కావచ్చు. అటువంటి ఉత్పత్తుల యొక్క సచిత్ర జాబితాలో మామిడి, బంగాళాదుంప (ఆలు), లిట్చి, టమోటా, టాపియోకా, కిన్నూ, భుజియా, పెథా, పాపడ్, ఊర‌గాయ‌లు, చిరుధాన్యాల ఆధారితమైన ఉత్పత్తులు, మత్స్య, పౌల్ట్రీ, మాంసం మరియు పశుగ్రాసం త‌దిత‌రాలున్నాయి.

ఓడీఓడీపీ, ఇత‌ర ఉత్ప‌త్త‌లకు మ‌ద్ద‌తు


ఈ ప‌థ‌కంలో ఓడీఓడీపీ ఉత్పత్తులను ఉత్పత్తి చేసేవారికి గాను అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేసే యూనిట్లకు కూడా త‌గిన మద్ద‌తు ఉంటుంది. ఓడీఓడీపీ ఉత్ప‌త్తుల‌కు సాధారణ మౌలిక సదుపాయాలు మరియు బ్రాండింగ్ & మార్కెటింగ్ మద్దతు ఉంటుంది. వ్య‌ర్థాల నుంచి త‌గిన‌ సంపద సృష్టించ‌గ‌ల ఉత్పత్తులు, ల‌క్షిత జిల్లాల చిన్న అటవీ ఉత్పత్తుల‌పై కూడా ఈ కొత్త ప‌థ‌కం దృష్టి సారించ‌నుంది. దీనికి తోడు ఇప్పటికే ఉన్న వ్య‌క్తిగ‌త మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తమ యూనిట్‌ను ఆధునికీక‌ర‌ణ‌ చేయాలనుకుంటే క్రెడిట్-లింక్డ్ మూల‌ధ‌నంపై 35 శాతం సబ్సిడీ పొందవచ్చు. అర్హత కలిగిన ప్రాజెక్ట్ వ్యయంలో ఒక్క యూనిట్‌కు గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల మేర సీలింగ్‌తో దీనిని అందిస్తారు. స్వయం సహాయక సంఘ సభ్యుల‌కు నిర్వ‌హ‌ణ మూల‌ధ‌నం మ‌రియు చిన్న సాధ‌నాల కొనుగోలు నిమిత్తం సీడెడ్ మూలధనంగా రూ. 40,000 స‌హాయాన్ని అందించ‌నున్నారు. వ్యాల్యూ చైన్‌తో పాటు మూలధన పెట్టుబడి కోసం ఎఫ్‌పీఓలు / ఎస్‌హెచ్‌జీలు / ఉత్ప‌త్తి సహకార సంస్థలకు 35 శాతం మేర‌ క్రెడిట్ లింక్డ్ గ్రాంట్ ఇవ్వబడుతుంది. ఎఫ్‌పీఓలు / స్వయం సహాయక సంఘాలు / సహకార సంస్థలు లేదా ప్రభుత్వ యాజమాన్య ఏజెన్సీలు లేదా ప్రైవేట్ సంస్థలు  క్ల‌స్ట‌ర్‌లోని సూక్ష్మ త‌ర‌హ సంస్థ‌ల‌కు ల‌బ్ధి చేకూర్చేలా సాధారణ ప్రాసెసింగ్ సౌకర్యం, ల్యాబ్, గిడ్డంగి, చలువ గిడ్డంగులు, ప్యాకేజింగ్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్‌తో సహా ఇత‌ర సాధారణ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేప‌డితే వారికి 35 శాతం క్రెడిట్ లింక్డ్ గ్రాంట్ రూపంలో త‌గిన మద్దతు ఇవ్వబడుతుంది. క్లస్టర్లలో పెద్ద సంఖ్యలో మైక్రో యూనిట్లకు త‌గిన‌ ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలో 50% గ్రాంట్ ఉన్న మైక్రో యూనిట్లు మరియు సమూహాల కోసం బ్రాండ్లను అభివృద్ధి చేయడానికి గాను మార్కెటింగ్ & బ్రాండింగ్ మద్దతూ ఇవ్వబడుతుంది. ఈ పథకం సామర్థ్యం పెంపొందించడం మరియు పరిశోధనపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. రాష్ట్రాలు ఎంపిక చేసిన‌ రాష్ట్రస్థాయి సాంకేతిక సంస్థలతో పాటు ఎంఓఎఫ్‌పీఐ ఆధ్వ‌ర్యంలోని రెండు శిక్ష‌ణ మరియు పరిశోధనా సంస్థలైన ఎన్ఐఎఫ్‌టీఈఎం, ఐఐఎఫ్‌పీఐ ద్వారా యూనిట్ల వారికి ఉత్పత్తి అభివృద్ధి, తగిన విధంగా మేటి ప్యాకేజింగ్ మరియు సూక్ష్మ యూనిట్లకు అనువైన‌ యంత్రాల విష‌య‌మై శిక్షణా మ‌ద్ద‌తు ఇవ్వ‌బ‌డుతుంది.


ఎంఐఎస్ విధానంలో ప‌ర్య‌వేక్ష‌ణ‌ ఈ పథకంలోని అన్ని ప్రక్రియలు  ఎంఐఎస్ విధానంలో ప‌ర్య‌వేక్షించ‌బ‌డ‌తాయి. వ్యవస్థాపకుల దరఖాస్తులు, వాటి ప్రాసెసింగ్, రాష్ట్రాలు మరియు ఎంఓఎఫ్‌పీఐ చేత వివిధ ప్రాజెక్టుల ఆమోదం, గ్రాంట్ మరియు ఇతర నిధుల విడుదల మరియు ప్రాజెక్ట్ పర్యవేక్షణతో సహా వివిధ కార్య‌క‌లాపాలు దీని ద్వారానే స‌మీక్ష జ‌రు‌ప‌బ‌డుతుంది. ఈ పథకం కింద సహాయం పొందాలనుకునే వ్యక్తిగత స్థాయి పారిశ్రామికవేత్తలు, ఇతర వాటాదారులు ఆయా రాష్ట్రాలోను, వివిధ కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ఏర్పాటు చేసే జిల్లా స్థాయిలో ప‌థ‌కం అమ‌లు, ప‌థ‌క సంప్ర‌దింపు కేంద్రాల‌కు సంబంధించవచ్చు.

ఆపరేషన్ గ్రీన్స్ మ‌రింత‌గా విస్త‌ర‌ణ‌ 


ఆపరేషన్ గ్రీన్స్‌ను టీఓపీ (టమోటా-ఉల్లిపాయ-బంగాళాదుంప) పంటల నుండి అన్ని ఇత‌ర త్వ‌ర‌గా పాడైపోయే పండ్లు మ‌రియు కూరగాయలకూ (టీఓపీ నుండి మొత్తం) విస్తరించారు. ఎంఓఎఫ్‌పీఐ శాఖ‌ అమ‌లు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్స్ పథకంను టమోటా, ఉల్లిపాయ మరియు బంగాళాదుంప (టీఓపీ) పంటల నుండి ఇతర నోటిఫైడ్ హార్టికల్చర్ పంటలకు విస్తరించింది, వాటి రవాణాకు మరియు మిగులు ఉత్పత్తి ప్రాంతం నుండి ప్రధాన వినియోగ కేంద్రాలకు నిల్వ చేయడానికి సబ్సిడీ క‌ల్పించ‌బ‌డుతుంది. లాక్‌డౌన్ వంటి ఇత‌ర ప‌రిస్థితుల్లో పండ్లు మరియు కూరగాయల పెంపకందారులను త‌క్కువ‌కు అమ్ముకోవ‌డం నుండి రక్షించడం మరియు పంట చేతికొచ్చాక న‌ష్టం క‌లుగ‌కుండా చూసేందుకు గాను స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

అర్హత పంటలు:

పండ్లుః మామిడి, అరటి, జామ‌, కివి, లిట్చి, బొప్పాయి, నిమ్మ‌, పైనాపిల్, దానిమ్మ, జాక్‌ఫ్రూట్; కూర‌గాయ‌లుః టమోటా, ఫ్రెంచ్ బీన్స్, కాక‌రకాయ‌, వంకాయ‌, క్యాప్సికమ్, క్యారెట్, క్యాలీఫ్లవర్, మిరపకాయలు (ఆకుపచ్చ),  ఉల్లిపాయ, బంగాళాదుంప మరియు ఓక్రా త‌దిత‌రాలు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు ఆధారంగా భవిష్యత్తులో ఏదైనా ఇతర పండ్లు / కూరగాయలను ఈ జాబితాలో చేర్చవచ్చు.

పథకం వ్యవధి

 నోటిఫికేషన్ తేదీ (11.06.2020)నుండి ఆరు నెలల కాలానికి

అర్హత కలిగిన సంస్థలు 

ఆహార ప్రాసెసర్లు, ఎఫ్‌పీఓ / ఎఫ్‌పీసీ, సహకార సంఘాలు, వ్యక్తిగత రైతులు, పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్ / మార్కెటింగ్‌లో నిమగ్నమై ఉన్న లైసెన్స్ పొందిన కమిషన్ ఏజెంట్, ఎగుమతి దారులు, రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ / కో-ఆపరేటివ్ ఫెడరేషన్లు, రిటైలర్లు మొదలైనవారు.

చేయూత సరళి

ఖర్చు నిబంధనలకు లోబడి, రెండు విభాగాల ఖర్చులో 50 శాతం సబ్సిడీని మంత్రిత్వ శాఖ అందిస్తుంది: అవేమిటంటే.. అర్హతగల పంటలను మిగులు ఉత్పత్తి క్లస్టర్ నుండి వినియోగ కేంద్రానికి రవాణా చేయడం; మరియు / లేదా అర్హతగల పంటలకు తగిన నిల్వ సౌకర్యాల నియామకం (గరిష్టంగా 3 నెలల వరకు);

సబ్సిడీ కోసం దావా సమర్పణ

పైన పేర్కొన్న ముఖ్యమైన ప్రమాణాలకు లోబడి అర్హత క‌లిగిన‌ సంస్థలు, నోటిఫైడ్ మిగులు ఉత్పత్తి క్లస్టర్ నుండి నోటిఫైడ్ పంటల రవాణా మరియు / లేదా నిల్వ కార్య‌క్ర‌మాన్ని ఎంఓఎఫ్‌పీఐ నుండి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా చేపట్టవచ్చు.. ఆ తరువాత ఆన్‌లైన్ పోర్టల్ https: / /www.sampada-mofpi.gov.in/Login.aspx లో దరఖాస్తుదారుడు క్ల‌యిమ్ దాఖ‌లు చేయ‌వ‌చ్చు. అయితే పండ్లు మరియు కూరగాయల రవాణా / నిల్వ చేయడానికి ముందే ద‌ర‌ఖాస్తుదారుడు పోర్టల్‌లో నమోదై ఉండాల్సి  ఉంటుంది.

ఎస్సీ / ఎస్టీ ఫుడ్ ప్రాసెసర్ల నిమిత్త‌ ఉచిత ఆన్-లైన్ నైపుణ్య‌త కార్య‌క్ర‌మం

ఎస్సీ మరియు ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన వ్యవస్థాపకులకు ఎన్ఐఎఫ్‌టీఈఎం, ఎఫ్ఐసీఎస్ సంస్థ‌ల సౌజ‌న్యంలో ఉచిత‌ ఆన్‌లైన్ నైపుణ్య‌త శిక్ష‌ణా తరగతుల్ని ప్రారంభించాలని ఎంఓఎఫ్‌పీఐ యోచిస్తున్నట్లు శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. బేకింగ్, జామ్, ఊర‌గా‌యల‌ త‌యారీ త‌దిత‌ర 41 కోర్సులు మరియు వీటిలో ఉద్యోగ అవ‌కాశాల‌ను ఇప్ప‌టికీ ఎంఓఎఫ్‌పీఐ గుర్తించింద‌ని మంత్రి తెలిపారు. వీటికి డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచ‌నుంది. ఈ కోర్సుల‌లో శిక్షణ పొంది ధ్రువప‌త్రం పొందిన‌ వారికి మెరుగైన ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయి. అంతే కాకుండా వీరు తమ సొంత వెంచర్‌ను  ప్రారంభించుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. ఎన్ఐఎఫ్‌టీఈఎం ద్వారా మంత్రిత్వ శాఖ రూపొందించిన హ్యాండ్‌బుక్‌లు మరియు ఫెసిలిటేటర్ గైడ్‌ల‌ను త‌గిన డిజిటల్ కంటెంట్‌తో ఈ-లెర్నింగ్ ఫార్మాట్ మ‌రియు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ సేవగా మార్చబడుతుందని తెలిపారు. ఇవి ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలలో ఎఫ్ఐసీఎస్ఐ ద్వారా వెబ్‌లోనూ మరియు ఆండ్రాయిడ్ ఆధారిత ఆప్ రూపంలో అందుబాటులో ఉంచబడతాయ‌ని మంత్రి తెలిపారు.


****

 (Release ID: 1635234) Visitor Counter : 236