ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
చికిత్సలో ఉన్న కేసులకంటే కోలుకున్న కేసులే అధిక పెరుగుదల
లక్షకు పైబడిన తేడా
58.56% కు పెరిగిన కోలుకుంటున్న శాతం
రోజుకు పరీక్షలు 2.3 లక్షలకు పైమాటే
Posted On:
28 JUN 2020 12:27PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటిపోయింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 1,06,661 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇప్పటివరకు 3,09,712 మంది కోలుకోగా కోలుకున్నవారి శాతం 58.56% గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 13,832 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం 2,03,051 మంది కోవిడ్ బాధితులు ఉండగా వారందరికీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్ ) చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1036 కు చేరింది. వీటిలో 749 ప్రభుత్వ లాబ్ లు, 287 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
- తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 567 (ప్రభుత్వ: 362 + ప్రైవేట్: 205)
- ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 382 (ప్రభుత్వ: 355 + ప్రైవేట్: 27))
- సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 87 (ప్రభుత్వ: 32 + ప్రైవేట్: 55)
రోజూ 2,00,000 కు పైగా శాంపిల్స్ కు పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పరీక్షలు జరిపిన శాంపిల్స్ మరో 2,31,095 పెరగటంతో ఇప్పటివరకు పరీక్షలు జరిపిన మొత్తం శాంపిల్స్ సంఖ్య 82,27,802 కు చేరింది.
జూన్ 28 నాటికి కోవిడ్ చికిత్సకు సంబంధించిన వైద్య మౌలిక సదుపాయాలు ఎంతగానో బలోపేతం అయ్యాయి. మొత్తం 1055 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు ఉండగా వాటిలో 1,77,529 ఐసొలేషన్ పడకలు, 23,168 ఐసియు పడకలు, 78,060 ఆక్సిజెన్ సౌకర్యంతో కూడిన పడకలు ఉన్నాయి. 2,400 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటిలో 1,40,099 ఐసొలేషన్ పడకలు, 11,508 ఐసియు పడకలు, 51,371 ఆక్సిజెన్ సౌకర్యంతో కూడిన పడకలు ఉన్నాయి
పైగా 8,34,128 పడకలతో మొత్తం 9,519 కోవిడ్ సంరక్షణ కేంద్రాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులొ ఉన్నాయి. కేంద్రం ఇప్పటివరకు 187.43 లక్షల ఎన్95 మాస్కులు, 116.99 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఇ) కిట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేసింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
*****
(Release ID: 1634992)
Visitor Counter : 293
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam