ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం


రోజుకు 2 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు 1000 కి చేరిన లాబ్ ల సంఖ్య

Posted On: 24 JUN 2020 3:05PM by PIB Hyderabad

కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు గణనీయంగా పెరిగినమాటకు రుజువుగా రోజుకు పరీక్షీంచిన బాధితుల సంఖ్య రెండు లక్షల మైలు రాయి దాటింది. గత 24 గంటలలో సాధించిన ఈ సంఖ్య ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధికం.

 

నిన్న 2,15,195 శాంపిల్స్ పరీక్షించగా ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 73,52,911 కు చేరింది. ప్రభుత్వ లాబ్ లలో 1,71,587 పరీక్షలు చేయగా ప్రైవేట్ లాబ్ లలో  43,608 పరీక్షలు చేశారు. ప్రైవేట్ లాబ్ లలో జరిపిన పరీక్షలు కూడా గరిష్ఠంగా నమోదయ్యాయి.

 

వ్యాధి నిర్థారణ పరీక్షాకేంద్రాల సంఖ్య పెరుగుతున్నదనటానికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా మొత్తం లాబ్ ల సంఖ్య 1000 కి చేరింది. వాటిలో ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు  730 కి  చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 270  కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 1000 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

 

తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 557 (ప్రభుత్వ: 359  + ప్రైవేట్:  198)

ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 363 (ప్రభుత్వ: 343 + ప్రైవేట్: 20)

సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 80   (ప్రభుత్వ: 28 + ప్రైవేట్: 52)

 

కోవిడ్-19  నుంచి కోలుకుంటున్నవారి శాతం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.  బాధితులలో కోలుకున్నవారి శాతం 56.71% కు చేరింది.  ఇప్పటివరకు 2,58,684 మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,495 మంది కోవిడ్-19  బాధితులు  కోలుకున్నారు.

 

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,83,022. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

 

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

 

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

 

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

******


(Release ID: 1634025) Visitor Counter : 246