ప్రధాన మంత్రి కార్యాలయం

యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగపు తెలుగు అనువాదం

Posted On: 21 JUN 2020 7:48AM by PIB Hyderabad

నమస్కారం!! 


6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అభినందనలు. అంతర్జాతీయ యోగా దినోత్సవమన్నది ఒక సంఘీభావ చిహ్నం. ఈ రోజు విశ్వ సౌభ్రాతృత్వ భావనను సందేశంగా పంపుతుంది. మానవత్వపు ఏకత్వాన్ని సూచించే రోజు ఇది. అలా మనందరినీ దగ్గరకు చేరేచేదే యోగా. మన మధ్య దూరాన్ని తగ్గించేదే యోగా. నా జీవితం - నా యోగా పేరుతో చేపట్టిన వీడియో బ్లాగింగ్ పోటీలో ప్రపంచం నలుమూలలనుంచి పాల్గొంటున్నవారే యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం ఈ కరోనా సంక్షోభ సమయంలోనూ యోగా ఎంతగా విస్తృతి చెందినదో ఈ స్పందన అద్దం పడుతోంది.

మిత్రులారా,
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినొత్సవానికి  " ఇంటి దగ్గర యోగా- కుటుంబంతో యోగా" అనే నినాదాన్ని తీసుకున్నాం.ఈ రోజు మనం సమూహాలకు దూరంగా, మన కుటుంబాలతో కలిసి యోగా ఆచరిస్తున్నాం. పిల్లలు, పెద్దలు, యువతీయువకులు, వృద్ధులు అలా ప్రతి ఒక్కరూ యోగా ద్వారా అనుసంధానమైనప్పుడు ఇల్లంతా శక్తి ప్రవాహంతో నిండిపోతుంది. అందుకే ఈ సారి యోగా దినోత్సవం ఉద్వేగాన్ని కూడా నింపుకుంది. మన కుటుంబ బంధాన్ని మరింత గట్టిపరచటం కూడా నిజం

మిత్రులారా,
కరోనా సంక్షోభం కారణంగా ఈరోజు ప్రపంచం యోగా ఆవశ్యకతను మరింతగా గుర్తించగలిగింది. మన రోగ నిరోధక శక్తి బలంగా ఉంటేమనం మరింత సమర్థంగా ఈ రోగాన్ని ఎదుర్కోగలం. రోగ నిరోధకశక్తిని పెంచగలిగే యోగాసనాలు చాలా ఉన్నాయి. ఈ యోగాసన భంగిమలు మన దేహపు బలాన్ని పెంచిజీవ ప్రక్రియలను కూడా బలోపేతం చేస్తాయి

కానీ కోవిడ్-19 వైరస్ ప్రత్యేకంగా మన శ్వాస వ్యవస్థ మీద దాడి చేస్తుంది. అందుకే మన శ్వాస వ్యవస్థను దృఢంగా తయారుచేసేది ప్రాణయామం అనే శ్వాస పరమైన వ్యాయామం. అనులోమ విలోమ ప్రాణయామం బాగా ప్రసిద్ధి చెందినది. అది సమర్థంగా పనిచేస్తుంది.  అయితే అనేక రకాల ప్రాణయామాలున్నాయి. వాటిలో శీతలి, కఫల్బతి, భ్రమరి, భస్త్రిక లాంటివి చాలా ఉన్నాయి.

ఈ అన్ని రకాల టెక్నిక్ లు, యోగాసన రూపాలు మన శ్వాస వ్యవస్థతోబాటు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. అందుకే మీ రోజువారీ కార్యాచరణలో ప్రాణయామాన్ని కలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అనులోమ-విలోమానికి తోడుగా అనేక భిన్నమైన ప్రాణయామ టెక్నిక్ లు జోడించాల్సిందిగా కోరుతున్నా. కోవిడ్-19 బాధితులు పెద్ద సంఖ్యలో ప్రపంచం నలుమూలలా నేడు యోగా అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని ఓడించటంలో యోగా శక్తి బాగా సాయపడుతోంది.

మిత్రులారా,
మన ఆత్మ విశ్వాసాన్ని పెంచటానికి కూడా యోగా ఉపయోగపడటం వలన సంక్షోభాలను అధిగమించి గెలుపు సాధించగలుగుతున్నాం. మానసిక ప్రశాంతతనిచ్చి మనలో క్రమ శిక్షణ పెరగటానికి యోగా ఉపయోగపడుతుంది. స్వామి వివేకానంద అనేవారు " సంక్షోభ సమయంలోనూ పూర్తి నిర్మలమైన మనసుతో. సంపూర్ణమైన ప్రశాంతత అనుభూతి చెందగలిగినవాడే ఆదర్శవంతమైన మానవుడు" అని స్వామి వివేకానంద చెప్పేవారు.

పట్టువదలకుండా, కష్ట కాలంలోనూ స్థిరచిత్తంతో ఉండగలిగినవాడే సమర్థుడైన మానవుడు. ఇలాంటి సమయాల్లో యోగా తగినంత బలాన్నిస్తుంది.  మీరూ గమనించే ఉంటారు - యోగాభ్యాసం చేసే వ్యక్తి ఎప్పుడూ ఎలాంటి సంక్షోభ సమయంలోనూ సహనం కోల్పోడు.

యోగ అంటే సమత్వమ్ యోగ ఉచ్యతే. అంటే - అదే విధంగా ఉంటూ ప్రతి పరిస్థితిలోనూ అలాగే ముందుకు సాగటం. అది అనుకూలమైనా, ప్రతికూలమైనా, విజయమైనా, విఫలమైనా, సమ్తోషమైనా, దుఃఖమైనా.

మిత్రులారా,
ఆరోగ్యకరమైన భూగోళం కోసం మనల్ని పరితపించే చేసేది యోగా. ఐకమత్యం కోసం పనిచేసే శక్తిగా అది ఉద్భవించింది. మానవత్వపు బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దానికి వివక్ష అన్నదే లేదు. జాతి, తెగ, వర్ణ, లింగభేదాలతో, విశ్వాసాలతో, దేశాలతో సంబంధం లేకుండా అతీతంగా ఉంటుంది యోగా.

ఎవరైనా యోగాభ్యాసాన్ని అనుసరించవచ్చు. కొంత సమయం, కొంత చోటు ఉంటే చాలు. యోగా మనకు శారీరక బలాన్నే కాదు, మానసిక సమతుల్యతను, ఉద్వేగపు స్థిరత్వాన్ని, ఎదురైన సవాళ్ళను ఎదుర్కోగలిగే ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది.

మిత్రులారా,
మన ఆరోగ్యపు నాదాలను, ఆశలను సంలీనం చేయగలిగితే ప్రపంచం ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మానవాళిని చూడటానికి ఎంతో సమయం పట్టదు. ఇది నిజం కావటానికి కచ్చితంగా యోగా మనకు సాయపడుతుంది.

మిత్రులారా,
మనం యోగా ద్వారా సమస్యలకు పరిష్కారాన్ని, ప్రపంచ సంక్షేమాన్ని సాధించటం గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే మీకు యోగేశ్వర్ కృష్ణుడి కర్మయోగ గురించి గుర్తుచేయాలనుకుంటున్నా. గీత లో కృష్ణుడు యోగ గురించి వివరిస్తూ అంటాడు- "యోగః కర్మసు కౌశలమ్ " అని. యోగ అంటే కార్యంలో సమర్థతే అని దీని అర్థం. ఈ మంత్రం మనకెప్పుడూ బోధించేది ఏంటంటే యోగ మనకు జీవుతంలో మరింత సమర్థులుగా తయారవటానికి తగిన సామర్థ్యాన్ని సృష్టిస్తుంది. మన చేయాల్సిన పనులన్నీ మనం క్రమశిక్షణతో పూర్తి చేస్తే అది కూడా ఒక రకమైన యోగాభ్యాసమే.

మిత్రులారా,
కర్మయోగం ఇంకా ఏం చెబుతున్నదంటే ...
యుక్త ఆహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు
యుక్త స్వప్నా వ బోధస్య భవతి దుఃఖహా

అంటే, యోగా అంటే సరైన ఆహారం తీసుకోవటం, సరైన ఆట ఆడటం, నిద్రపోవటం, లేవటం లాంటి విషయాల్లో సరైన అలవాట్లు పాటించటం, మన విధులు సక్రమంగా నిర్వర్తించటం అన్నమాట. ఈ విధమైన కర్మయోగ తో మనకు అన్ని సమస్యలకూ పరిష్కారాలు లభిస్తాయి.  పైగా నిస్వార్థమైన పని, ప్రతి ఒక్కరికీ స్వార్థరహితంగా సేవచేయటమే కర్మయోగా.  భారత తత్వంలోనే కర్మయోగ సిద్ధాంతం ఇమిడి ఉంది. యావత్ ప్రపంచం భారతదేసపు నిస్వార్థ సేవా తత్పరతను గుర్తించింది.

మిత్రులారా, 
మనం యోగ, కర్మయోగ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నప్పుడు వ్యక్తిగా, సమాజంగా, దేశంగా కూడా మన శక్తి ఎన్నోరెట్లు పెరుగుతుంది. ఈరోజు మనం ఇదే స్ఫూర్తితో ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. మన ఆరోగ్యానికీ, మన ఆప్తుల ఆరోగ్యానికీ అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని. ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా మనం ఉమ్మడిగా ఒక కుటుంబంగా, ఒక సమాజంగా ముందుకు సాగుదాం.
" ఇంటి దగ్గర యోగా- కుటుంబంతో యోగా" అనే నినాదాన్ని  మన జీవితాల్లో ఒక భాగం చేసుకుందాం. ఆ పని చేస్తే మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ నమ్మకంతోనే మీ అందరికీ మరోమారు  యోగా దినోత్సవ శుభాకాంక్షలు!

లోకాః సమస్తాః సుఖినో భవంతు


ఓం !

https://youtu.be/N9K_goSCAIQ

 


(Release ID: 1633178) Visitor Counter : 281