ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన‌ మంత్రి కి మరియు కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో కు మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌

Posted On: 16 JUN 2020 10:27PM by PIB Hyderabad

కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. 

కోవిడ్-19 కి సంబంధించి వారి వారి దేశాల లో రూపుదాల్చుతున్న తాజా స్థితి ని గురించిన సమాచారాన్ని నేత లు ఈ సందర్భం లో ఒకరి కి మరొకరు తెలియజెప్పుకొన్నారు.  ఆరోగ్య సంక్షోభాన్ని మరియు ఆర్థిక సంకటాన్ని పరిష్కరించడం కోసం అంతర్జాతీయ సహకారాన్ని తీసుకొనేందుకు గల సంభావ్యత ను గురించి కూడా చర్చించారు.  
  
భారతదేశం- కెనడా భాగస్వామ్యం ప్రపంచం లో మానవీయ విలువల ప్రబోధాన్ని విస్తరింపచేయడం సహా కోవిడ్-19 అనంతరం రూపుదాల్చబోయేటటువంటి ప్రపంచ హితం కోసం పనిచేయగల ఒక శక్తి గా మారగలదనే సంగతి ని వారు ఒప్పుకొన్నారు. 

డబ్ల్యుహెచ్ఒ సహా బహుళపార్శ్విక సంస్థల ను పటిష్టపరచవలసిన అవసరం ఉందని నేత లు నొక్కిచెప్పారు.  ఆరోగ్య పరమైనటువంటి, సాంఘిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి మరియు రాజకీయ పరమైనటువంటి అంశాల పై వివిధ అంతర్జాతీయ వేదికల లో కలిసికట్టుగా, సన్నిహితం గా కృషి చేయడానికి వారు తమ సమ్మతి ని ప్రకటించారు.

కెనడా లోని భారతీయ పౌరుల కు ఇటీవలి కాలం లో కెనడా అధికారులు అందించిన సహాయానికి, వారి ని స్వదేశాని కి పంపించడాని కి కెనడా అధికారులు అందించిన తోడ్పాటు కు గాను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.  ఇదే విధం గా ప్రధాని శ్రీ ట్రూడో కూడా కెనడా పౌరులు స్వదేశాని కి తిరిగి వచ్చేందుకు భారతదేశం మార్గాన్ని సుగమం చేసినందుకు గాను తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఉభయ నేత లు వారి పరస్పర సమాలోచనల ను రాబోయే రోజుల లో సైతం కొనసాగించాలని సమ్మతించారు.  ప్రజాస్వామిక విలువల తో పెనవేసుకొన్న పెద్ద ఆర్థిక వ్యవస్థ లు అయినటువంటి భారతదేశం మరియు కెనడా పలు ప్రపంచ అంశాల పై స్వాభావికంగానే ఏక కేంద్రాభిముఖత్వాన్ని కలిగి ఉన్నాయనే విషయం పట్ల కూడా వారు వారి యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేశారు.


***



(Release ID: 1632219) Visitor Counter : 168