ప్రధాన మంత్రి కార్యాలయం
2020 జూన్ 18వ తేదీన వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Posted On:
17 JUN 2020 7:16PM by PIB Hyderabad
బొగ్గు రంగంలో ఆత్మ నిర్భారత సాధించాలనే ఉద్దేశ్యంతో, బొగ్గు మంత్రిత్వ శాఖ ఫిక్కీ సహకారంతో సి.ఎం.(ఎస్.పి) చట్టం మరియు ఎం.ఎం.డి.ఆర్. చట్టం నిబంధనల ప్రకారం 41 బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఈ వేలం ప్రక్రియతో, భారత బొగ్గు రంగంలో, వాణిజ్య మైనింగ్ ప్రారంభానికి, నాంది పలికినట్లైంది. దేశం తన ఇంధన అవసరాలను తీర్చడంలో స్వయం సమృద్ధిని సాధించడానికీ, పారిశ్రామికాభివృద్ధికీ ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుంది. బొగ్గు అమ్మకం కోసం బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించడం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో భాగం. ఈ కార్యక్రమం 2020 జూన్ 18వ తేదీన ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఐ.సి., ఎమ్.ఈ.ఐ.టి.వై. కి చెందిన ఎన్.ఈ.జి.డి. మరియు ఫిక్కీ కి సంబంధించిన వివిధ నెట్ వర్క్ ల ద్వారా అందరూ వీక్షించవచ్చు.
వేలం ప్రక్రియ ప్రారంభం
విద్యుత్తు, స్టీల్, అల్యూమినియం, స్పాంజ్ ఐరన్ మొదలైన అనేక ప్రాథమిక పరిశ్రమల ఉత్పాదకాలకు ముఖ్య వనరు అయిన మైనింగ్ రంగంలో ఆత్మనిర్భారత సాధించటానికి దేశం కోసం తన దార్శనికతను వివరించే వేలం ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ ప్రల్హాద్ జోషి కూడా హాజరుకానున్నారు.
ఈ మైలురాయి దశ ప్రైవేటు భాగస్వామ్యాన్ని, ఉత్పత్తిని పెంచుతుంది, పోటీని ప్రేరేపిస్తుంది. అధిక పెట్టుబడుల ద్వారా తాజా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుంది. స్థిరమైన మైనింగ్ కోసం మార్గం సుగమం అవుతుంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగౌతాయి. వాణిజ్య మైనింగ్ ప్రారంభించడం ద్వారా, మైనింగ్, విద్యుత్ మరియు స్వచ్ఛమైన బొగ్గు రంగాలకు సంబంధించిన పెట్టుబడిదారులకు బొగ్గు రంగంలో అవకాశాలను భారతదేశం పెంపొందించింది.
ఫిక్కీ అధ్యక్షుడు డాక్టర్ సంగీతా రెడ్డి, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మరియు టాటా సన్స్ చైర్మన్ శ్రీ ఎన్. చంద్రశేఖరన్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాన్ని వెబ్ టెలికాస్ట్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు, మైనింగ్ పరిశ్రమ వ్యవస్థాపకులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు.
వేలం ప్రక్రియ యొక్క ముఖ్య నిబంధనలు
బొగ్గు గనుల కేటాయింపు కోసం రెండు దశల ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియను అవలంబిస్తున్నారు. ఒప్పందంతో కూడిన బిడ్ నమూనా పత్రాలు, వేలం ప్రక్రియ యొక్క వివరణాత్మక కాలపరిమితి, వేలం కోసం ప్రతిపాదిస్తున్న బొగ్గు గనులతో సహా వేలం ప్రక్రియ గురించిన అన్ని వివరాలను ఎమ్.ఎస్.టి.సి. సంస్థ రూపొందించిన ఈ వెబ్ లింక్ నుండి పొందవచ్చు.
http://cma.mstcauction.com/auctionhome/coalblock/index.jsp
దేశానికి ప్రయోజనాలు :
* 225 మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించిన అనంతరం, ఈ గనులు 2025-26 నాటికి దేశంలో అంచనా వేసిన మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 15 శాతం చేస్తాయి.
* 2.8 లక్షలకు పైగా ప్రజలకు ఉపాధి కల్పన: సుమారు 70,000 మందికి ప్రత్యక్షంగానూ, సుమారు 2,10,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
* వచ్చే 5-7 సంవత్సరాల్లో దేశంలో సుమారు 33,000 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడులు వస్తాయని అంచనా.
* ఈ గనులు ఏటా 20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తాయి.
* 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల ద్వారా అంతర్జాతీయ పద్ధతులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు మైనింగ్ కార్యకలాపాల్లో యాంత్రీకరణను తీసుకువచ్చే అవకాశం ఉంది.
* స్వతంత్ర థర్మల్ విద్యుత్ ప్లాంట్ మరియు స్వంత విద్యుత్ ప్లాంట్ల ద్వారా దిగుమతుల ప్రత్యామ్నాయంతో పాటు, స్వావలంబన ఫలితంగా విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది.
* ఎక్కువ విశ్వసనీయతతో పరిశ్రమలకు నిరంతర బొగ్గు నిల్వలను నిర్ధారించడం ద్వారా నియంత్రిత మరియు నియంత్రించబడని రంగాలకు ప్రోత్సాహం.
* జాతీయ బొగ్గు సూచిక అమలుతో స్వేచ్ఛా మార్కెట్ నిర్మాణం వైపు కదులుతుంది.
* పరిశుభ్రమైన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకునే పద్ధతిని ప్రోత్సహించడం మరియు బొగ్గు గ్యాసిఫికేషన్ మరియు ద్రవీకరణకు ప్రోత్సాహంతో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం.
*****
(Release ID: 1632217)
Visitor Counter : 375
Read this release in:
Bengali
,
Assamese
,
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam