ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

రికవరీ రేటు 52.8 శాతానికి పెరిగింది.

Posted On: 17 JUN 2020 2:06PM by PIB Hyderabad

గత 24 గంటల్లో,  6,922 మంది కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకున్నారు.   దీంతో, ఇంతవరకు మొత్తం 1,86,934 మంది కోవిడ్ -19 రోగులు చికిత్స అనంతరం కోలుకున్నట్లయింది.  రికవరీ రేటు 52.8 శాతానికి  పెరిగింది.  ప్రస్తుతం, 1,55,227 మంది కోవిడ్-19 రోగులు వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

ప్రభుత్వ ప్రయోగశాల సంఖ్య 674 కు పెరిగింది. కాగా, ప్రయివేటు ప్రయోగశాలల సంఖ్య 250 కి పెరిగింది ( మొత్తం 924 ప్రయోగశాలలు).  

వాటి  వివరాలు  విధంగా ఉన్నాయి : 

రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 535 (ప్రభుత్వ347 + ప్రయివేటు188) 

ట్రూ-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 316 (ప్రభుత్వ : 302  + ప్రయివేటు : 14 

సి.బి-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 73 (ప్రభుత్వ: 25 + ప్రయివేటు: 48)   

గత 24 గంటల్లో 1,63,187 నమూనాలను పరీక్షించడం జరిగింది.  దీంతో ఇంతవరకు మొత్తం 60,84,256 నమూనాలను పరీక్షించినట్లైంది.  

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA . 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 
       technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  
       ncov2019[at]gov[dot]in     మరియు    @CovidIndiaSeva. 

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +191-11-23978046  లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

*****



(Release ID: 1632066) Visitor Counter : 215