ప్రధాన మంత్రి కార్యాలయం

అన్ లాక్ 1.0 అనంతరం ఉత్పన్నమైన స్థితి పై చర్చించడం కోసం ముఖ్యమంత్రుల తో సంభాషించిన ప్రధాన మంత్రి


ప్రాణం మరియు జీవనోపాధి.. ఈ రెంటిపై మనం శ్రద్ధ వహించాలి; ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన, పరీక్ష లు, ఇంకా జాడ ను కనుగొనడాన్ని అభివృద్ధిపరచడం తో పాటు ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచాలి: ప్రధాన మంత్రి

ప్రతి ఒక్కరి ని కాపాడటానికి మరియు ప్రతి ఒక్క జీవితాన్ని రక్షించడానికి మనం ప్రయత్నించాం; దేశం లో రోగ నివృత్తి రేటు ప్రస్తుతం 50 శాతాని కి పైగా ఉంది: ప్రధాన మంత్రి

కరోనావైరస్ కారణం గా అత్యల్ప మరణాలు సంభవించిన దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉంది : ప్రధాన మంత్రి

స్వీయ భద్రత కు, కుటుంబ భద్రత కు మరియు సముదాయ భద్రత కు గాను ఏ ఒక్కరు కూడా మాస్క్ గాని లేదా ముఖాని కి ముసుగు గాని లేనిదే ఇంటి బయట కు అడుగుపెట్టడం గురించి ఆలోచన అయినా చేయరాదు: ప్రధాన మంత్రి

ఇటీవలి ప్రయాసల కారణం గా, ఆర్థిక వ్యవస్థ లో అనేక ఆశాకిరణాలు ప్రసరించడం మొదలుపెట్టాయి, మరి అవి మనం ముందుకు సాగిపోయేందుకు మనకు ప్రోత్సాహాన్ని కూడా ఇస్తున్నాయి: ప్రధాన మంత్రి


రాష్ట్రాల లో క్షేత్ర స్థితి ని గురించిన సమాచారాన్ని నివేదించిన ముఖ్యమంత్రులు, ప్రస్తుతం అందుబాటులో గల ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల ను తెలియబరచడం తో పాటు వాటి ని వృద్ధి చ

Posted On: 16 JUN 2020 5:35PM by PIB Hyderabad

అన్ లాక్ 1.0 అనంతరం తలెత్తిన స్థితి పై చర్చించడం కోసం మరి అలాగే ప్రపంచవ్యాప్త వ్యాధి కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి తగిన ముందస్తు ప్రణాళిక ను సిద్ధం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ముఖ్యమంత్రుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు.  ముఖ్యమంత్రుల తో ప్రధాన మంత్రి ఈ తీరు న సంభాషించడం ఇప్పటికి ఇది ఆరో సారి; ఇంతకు ముందు ఈ తరహా చర్చాసమావేశాలు మార్చి నెల లో 20వ తేదీ న, ఏప్రిల్ లో 2వ, 11వ, ఇంకా 27వ తేదీ లలోను మరియు మే నెల లో 11వ తేదీ న జరిగాయి. 

వైరస్ తో పోరాటానికి సకాలం లో తీసుకొన్నటువంటి నిర్ణయాలు

విశ్వమారి ని ప్రతిఘటించడం కోసం సకాలం లో తీసుకొన్నటువంటి నిర్ణయాలు దేశం లో ఆ వ్యాధి యొక్క వ్యాప్తి ని అదుపుచేయడం లో ప్రభావవంతం గా పనిచేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  మనం సింహావలోకనం చేసుకొన్నప్పుడు, ప్రపంచానికి మనం సహకారాత్మక సమాఖ్య పద్ధతి కై ఒక ఉదాహరణ ను ఆవిష్కరించిన సంగతి ని ప్రజలు గుర్తుంచుకొంటారు అని ఆయన అన్నారు.

మనం ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించాము అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రస్తుతం అన్ని విధాలైన రవాణా సాధనాలు తెరచుకొన్నాయని, వలసపోయిన శ్రామికుల లో లక్షలాది శ్రామికులు తిరిగి వారి వారి గ్రామాల కు వచ్చారని, అలాగే వేలాది భారతీయులు విదేశాల నుండి తిరిగి వచ్చారని, మరి భారతదేశం లో జనాభా భారీ గా ఉన్నప్పటికీ కూడాను కరోనావైరస్ ప్రపంచం లో మిగిలిన దేశాల లో మాదిరి గా ప్రాణాపాయకరమైనటువంటి రూపాన్ని సంతరించుకోలేదని ఆయన నొక్కిచెప్పారు.  భారతీయులు కనబరచినటువంటి క్రమశిక్షణ ను ప్రపంచవ్యాప్త స్వాస్థ్య నిపుణులు ప్రశంసిస్తున్నారని, దేశం లో ప్రస్తుతం రోగ నివృత్తి రేటు 50 శాతాని కి మించిందని ఆయన తెలిపారు.  కరోనావైరస్ కారణం గా అత్యల్ప మరణాలు సంభవించిన దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉందని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.  క్రమశిక్షణ ను పాటిస్తే, అన్ని నియమాల కు కట్టుబడితే, కరోనావైరస్ కనిష్ఠ స్థాయి నష్టం తో సరిపెడుతుందన్నదే మనం నేర్చుకోవలసిన ఒక పెద్ద పాఠం అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  మాస్క్ ను గాని లేదా ముఖాని కి ముసుగు ను గాని వాడటానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని, వాటిలో ఏ ఒక్కటయినా లేకుండా ఎవ్వరూ కూడా ఇంటి బయట కు వెళ్లకూడదని ఆయన నొక్కిచెప్పారు. ఇది సంబంధిత వ్యక్తికే కాక ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి మరియు సముదాయాని కి కూడాను ముఖ్యమేనని స్పష్టంచేశారు.  ‘దో గజ్ దూరీ’ (ఒక మనిషి కి మరియు మరొక మనిషి కి నడుమ రెండు గజాల ఎడం పాటించడం) మంత్రాన్ని అనుసరించడం గురించి, చేతుల ను సబ్బు తో శుభ్రపరచుకొంటూ ఉండడం గురించి, మరి అలాగే సేనిటైజర్ ను వాడడం గురించి కూడా ఆయన వివరించారు.  క్రమశిక్షణ ఏ మాత్రం సడలినా అది వైరస్ తో మనం చేస్తున్నటువంటి యుద్ధాన్ని బలహీనపరుస్తుందంటూ ఆయన ముందుజాగ్రత్త ను చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ లో ఆశాకిరణాలు


గడచిన వారం లో చేసిన ప్రయత్నాల తో ఆర్థిక వ్యవస్థ లో అనేక ఆశాకిరణాలు ప్రసరించడం మొదలుపెట్టాయని, వాటి లో అంతకు పూర్వం తగ్గుతూ వచ్చిన విద్యుత్తు వినియోగం లో మళ్లీ పెరుగుదల, ఈ సంవత్సరం మే మాసం లో ఎరువుల విక్రయాల లో వృద్ధి ప్రముఖం గా చోటు చేసుకోవడం, క్రిందటి ఏడాది తో పోల్చితే ఖరీఫ్ కు విత్తనాలు చల్లడం లో వృద్ధి ఆరోగ్యకరమైన రీతి లో నమోదు కావడం,  ద్వి చక్ర వాహనాల ఉత్పత్తి పెరగడం, రిటైల్ లావాదేవీల లో డిజిటల్ పేమెంట్స్ లాక్ డౌన్ కన్నా పూర్వపు స్థాయి కి చేరుకోవడం, మే నెల లో సుంకాల వసూళ్ల లో పెరుగుదల, ఇంకా ఎగుమతుల లో అకస్మాత్తు గా పెరుగుదల కనిపించడం వంటి  పరిణామాలు ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.  ఈ సూచనలు అన్నీ ముందుకు సాగిపోయేందుకు మనకు ఉత్తేజనను ఇస్తున్నాయని ఆయన అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క లాభాలు

రాష్ట్రాల లో వ్యవసాయం, తోట ల పెంపకం, మత్స్య పోషణ ఇంకా ఎమ్ఎస్ఎమ్ఇ లకు ఎనలేని ప్రాముఖ్యం ఉందని,  సంబంధిత ఏర్పాటుల కు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో చోటు కల్పించడమైందని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఎమ్ఎస్ఎమ్ఇ లకు సకాలం లో రుణాలను సమకూర్చడం కోసం చేసిన ఏర్పాటుల ను గురించి ఆయన వివరిస్తూ, బ్యాంకర్స్ కమిటీ ల ద్వారా పరిశ్రమల కు పరపతి ని శీఘ్రం గా పంపిణీ చేసినట్లయితే ఆ పరిశ్రమ లు వెంటనే పనిచేయడం మొదలుపెట్టగలుగుతాయి; అదే కాలం లో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. చిన్న కర్మాగారాల కు మార్గనిర్దేశం చేయవలసిన అవసరం మరియు చేయూత ను అందించవలసిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.  వ్యాపారానికి, పరిశ్రమ కు ఊతం అందించడం కోసం వేల్యూ చైన్ ల విషయం లో కలసి కృషి చేయడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రాల లో స్పెసిఫిక్ ఇకొనామిక్ ఏక్టివిటీ పాయింట్స్ రోజూ 24 గంటలూ పనిచేయాలని, అలాగే ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోగలిగేలా సరకు నింపడాన్ని, సరకు దింపడాన్ని వేగవంతం చేయాలన్నారు.

వ్యవసాయ రంగం లో తీసుకువచ్చిన సంస్కరణల ద్వారా రైతుల కు సిద్ధించబోయే లాభాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  ఆ ప్రయోజనాల లో వ్యవసాయ దిగుబడుల ను విక్రయించడానికి నూతన మార్గాలు, ఆదాయం లో పెరగుదల తద్ద్వారా ఆర్థిక వ్యవస్థ లో డిమాండు పెరుగుదల కు అవకాశం వంటివి ఉన్నాయి.  సేంద్రియ ఉత్పత్తుల కు, వెదురు ఉత్పత్తుల కు మరియు ఆదివాసీ ఉత్పత్తి కి క్రొత్త బజారు ల ను తెరవడం తో ఆదివాసీ ప్రాంతాల కు మరియు ఈశాన్య ప్రాంతానికి సేద్యం మరియు తోట పంట ల పెంపకం వంటి రంగాల లో  నూతన అవకాశాలు అందిరాగలవన్నారు. స్థానిక ఉత్పత్తుల కోసం ఒక క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్రాలు కూడా లబ్ధి ని పొందుతాయని ఆయన అన్నారు.  ఉత్తమమైన ప్రోసెసింగు తో పాటు ప్రభావాన్వితమైనటువంటి క్రయవిక్రయాల కోసం ప్రతి బ్లాకు స్థాయి లోను, ప్రతి జిల్లా స్థాయి లో అటువంటి ఉత్పత్తుల ను గుర్తించడం జరగాలన్నారు.  ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగం గా చేసిన ప్రకటన లు త్వరిత గతి న ఫలితాల ను అందించేటట్టు చూడటం కోసం కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన ఉద్ఘాటించారు.
 

ముఖ్యమంత్రులు ఆడిన మాట లు 

ఈ రోజు న జరిగిన సంభాషణ రెండు రోజుల సంవాదం లో ఒకటో భాగం, మరి నేటి సంభాషణ లో పాలుపంచుకొన్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో పంజాబ్, అసమ్, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ ఖండ్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపుర్, నాగాలాండ్, లద్దాఖ్, పుదుచేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరమ్, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్ రా నగర్ హవేలీ & దమన్ దీవ్, సిక్కిమ్ ఇంకా లక్షద్వీప్ లు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్నటువంటి సవాలుభరిత కాలం లో ప్రధాన మంత్రి అందిస్తున్న నాయకత్వానికి గాను మరియు వైరస్ తో సమష్టి గా పోరు సలపడం కోసం దేశాన్ని  ఏకతాటిపై నిలుపుతున్నందుకు గాను ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు పలికారు.  వారి వారి రాష్ట్రాల లో ఇప్పుడు అందుబాటు లో ఉన్నటువంటి ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల ను గురించి ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని, అలాగే వాటి ని మరింత గా అభివృద్ధిపరచడం కోసం సాగిస్తున్న ప్రయత్నాల ను గురించిన సమాచారాన్ని వారు సమర్పించారు.  వారు తాము నడుపుతున్న చైతన్య ప్రచార ఉద్యమాల ను, సొంత ఊళ్ల కు తిరిగివచ్చిన శ్రామికుల కు అందజేస్తున్నటువంటి సాయాన్ని గురించి, ఆరోగ్య సేతు ఏప్ యొక్క వినియోగాన్ని గురించి మరియు రాష్ట్రాల లో ఆర్థిక కార్యకలాపాల ను మళ్లీ మొదలుపెట్టడం గురించి కూడా తమ సంభాషణల లో ప్రస్తావించారు.

ప్రాణం పైన మరియు జీవనోపాధి పైన శ్రద్ద

ముఖ్యమంత్రులు వారి అభిప్రాయాల ను వెల్లడించినందుకు గాను ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  ప్రాణం పట్ల మరియు బ్రతుకుదెరువు పట్ల శ్రద్ధ తీసుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలంటూ ఆయన నొక్కిచెప్పారు.  ఒక ప్రక్క ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన ను పెంచుతూనే పరీక్ష లు నిర్వహించడం, (వైరస్) జాడ ను కనుగొనడం పై  చూపుల ను సారించాలని, మరొక ప్రక్క ఆర్థిక కార్యకలాపాల ను కూడా పెంపొందింపచేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుత అవసరాల తో పాటు రాబోయే కాలం యొక్క ఆవశ్యకతల ను దృష్టి లో పెట్టుకొని మరీ నిర్ణయాలు తీసుకోవడం అవసరమన్నారు.

వైరస్ తో అపాయం ఇంకా సమసిపోలేదన్న వాస్తవాన్ని మరియు ఆర్థిక వ్యవస్థ కు తలుపు ను తెరుస్తున్నందున జాగరూకత తో ఉండాలన్న అవసరాన్ని నాయకులు అదే పని గా నూరిపోస్తూ ఉండాలని ఆయన కోరారు. 

హోం మంత్రి శ్రీ అమిత్ శాహ్ మాట్లాడుతూ, మనం ఇంత వరకు విశ్వమారి తో ఓ విజయవంతమైన సమరాన్ని సాగించామని, ముందు ఉన్నటువంటి దారి దీర్ఘమైనటువంటిదంటూ మాస్క్/ ముఖాని కి ముసుగు ను వాడడం, దో గజ్ దూరీ ని పాటించడం వంటి ప్రధాన మంత్రి ఇచ్చిన సూచనల ను అందరూ అనుసరించాలన్నారు.

సన్నాహాల పై అంత క్రితం సమీక్ష

ప్రపంచవ్యాప్త వ్యాధి కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి భారతదేశం ఏం చేస్తున్నదీ సమీక్షించడం కోసం జూన్ 13 వ తేదీ న ప్ర‌ధాన మంత్రి సీనియర్ మంత్రులతో మరియు అధికారుల తో ఒక సమగ్రమైన సమావేశాన్ని నిర్వహించారు.  జాతీయ స్థాయి లో పరిస్థితి తో పాటు విశ్వమారి సందర్భం లో ఏ విధం గా సమాయత్తం అయిందీ ఈ సమావేశం లో సమీక్షించడమైంది.

మొత్తం కేసుల లో మూడింట రెండు వంతుల కేసులు 5 రాష్ట్రాల లో ఉన్నాయని, భారీ దామాషా లో కేసులు పెద్ద నగరాల లో ఉంటున్నాయన్న విషయాలను పరిశీలన లోకి తీసుకొన్నారు.  ఎదురవుతున్నటువంటి సవాళ్ల ను, మరీ ముఖ్యం గా పెద్ద నగరాల లో ఎదురవుతున్నటువంటి సవాళ్ల ను దృష్టి లో పెట్టుకొని, పరీక్షల ను హెచ్చించడం తో పాటు నిత్యం పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసుల ను ప్రభావవంతం గా సంబాళించడం కోసం పడకల సంఖ్య ను మరియు సేవల ను కూడా అధికం చేయడం గురించి చర్చించారు. 

నగరం వారీ గా మరియు జిల్లా వారీ గా అవసరపడే ఆసుపత్రి పడక లు/ఐసలేశన్ బెడ్స్ అంశం పై ఇంపావర్డ్ గ్రూపు చేసిన సిఫారసుల ను ప్రధాన మంత్రి పరిశీలించి, రాష్ట్రాల తో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల తో సంప్రదింపులు జరిపి అత్యవసర ప్రణాళిక రచించవలసింది గా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల ను ఆదేశించారు.  రుతుపవన కాలం ఆరంభం అవుతున్న సంగతి ని గమనించి తగిన సన్నాహాల కు సైతం రంగం సిద్ధం చేయవలసిందంటూ మంత్రిత్వ శాఖ కు ఆయన సలహా ఇచ్చారు.


***(Release ID: 1631978) Visitor Counter : 318