హోం మంత్రిత్వ శాఖ

దిల్లీలో కరోనా కట్టడికి కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

ప్రజా సంక్షేమం దృష్ట్యా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని అన్ని పార్టీలకు శ్రీ అమిత్‌ షా సూచన
ప్రధాని మోదీ నేతృత్వంలో అంతా కలిసికట్టుగా కొవిడ్‌పై పోరాడాల్సిన అవసరం ఉంది: అమిత్‌ షా
రాజకీయ పార్టీల ఐక్యత ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది, దిల్లీలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి సాయపడుతుంది: అమిత్‌ షా

Posted On: 15 JUN 2020 4:08PM by PIB Hyderabad

దిల్లీ వాసుల సంక్షేమం కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని అన్ని పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా: అమిత్‌ షా 
కొత్త పద్ధతులతో కొవిడ్‌ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది: అమిత్‌ షా

    దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా చెప్పారు. దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి శ్రీ అమిత్‌ షా అధ్యక్షత వహించారు.


కరోనాపై పోరులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతా కలిసి నడుద్దామని అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు.


 (Release ID: 1631710) Visitor Counter : 222