గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నేపథ్యంలో పట్టణ రవాణా సేవలు అందించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు / నగరాలు / మెట్రో రైలు కంపెనీలు తీసుకోవలసిన చర్యలు

సూచనలు (అడ్వైజరీ) జారీచేసిన గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ

Posted On: 12 JUN 2020 11:44AM by PIB Hyderabad

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాలు మరియు మెట్రో రైల్ కంపెనీలకు జారీ చేసిన సలహాలో మూడు అంచుల వ్యూహాన్ని సూచించింది, దీనిని దశలవారీగా అమలుచేయవచ్చు.  [స్వల్పకాలిక (6 నెలల లోపు), మధ్యకాలిక (ఒక ఏడాది లోపల) & దీర్ఘకాలిక (1-3 సంవత్సరాలు)].

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా జారీ చేసిన (అడ్వైజరీ) సలహాలలోని అంశాలు :- 

i)        మోటార్లు అవసరం లేకుండా నడిచే రవాణా వ్యవస్థ  (ఎన్.‌ఎమ్.‌టి) ని ప్రోత్సహించండి, పునరుద్ధరించండి. అన్ని పట్టణ ప్రయాణాలు ఐదు కిలోమీటర్ల లోపులో ఉన్నందున, ఈ కోవిడ్-19 సంక్షోభంలో అమలు చేయడానికి ఎన్.‌ఎమ్.‌టి. సరైన అవకాశాన్ని అందిస్తుంది. ఎందుకంటే దీనికి తక్కువ ఖర్చు, తక్కువ మానవ వనరుల వినియోగంతో సులభంగా, త్వరగా వినియోగించుకోవచ్చు. స్కేలబుల్ మరియు పర్యావరణ హితంగా ఉంటుంది

ii)          ప్రయాణికుల పట్ల ఎక్కువ విశ్వాసంతో ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించడం, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా తక్కువ / మధ్యతరగతి ప్రయాణికుల రోజువారీ రవాణా అవసరాలు తీరడానికి చాలా ముఖ్యమైన చర్య.   అయితే, సరైన పరిశుభ్రత, నియంత్రణ మరియు సామాజిక దూరం పాటించడం వంటి చర్యలను అనుసరించడం ద్వారా ప్రజా రవాణాను ఉపయోగించడం ద్వారా సంభవించే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. 

iii)          వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని చురుకుగా ఉపయోగించాలి. ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఐ.టి.ఎస్), స్వదేశీ నగదు రహిత మరియు భీమ్బి, ఫోన్‌పే, గూగుల్ పే, పే.టి.ఎం. మొదలైన చేతితో ముట్టుకోవలసిన అవసరం లేకుండా వినియోగించే వ్యవస్థల సాంకేతికతలను వినియోగించాలి. అదేవిధంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్.‌సి.ఎం.సి) వినియోగం కూడా ప్రజా రవాణా వ్యవస్థల కార్యకలాపాలలో ఒకరికొకరు కలిసే సందర్భాలను తగ్గిస్తుంది. 

మన జీవన విధానాన్నీ, మన స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ రవాణా వ్యవస్థలను అకస్మాత్తుగా ప్రభావితం చేసిన, కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ సలహాలను (అడ్వైజరీని) జారీ చేయడం జరిగింది.  

1.          ప్రజా రవాణాలో ప్రయాణించేవారి సంఖ్య దాదాపు 90 శాతం దాకా పడిపోయిన దాఖలాలు కనబడుతున్నాయి.   దీనివల్ల, వాయు కాలుష్యం దాదాపు 60 శాతం వరకు తగ్గినట్లు కూడా గమనించడమైనది.  ప్రజా రవాణాలో మునుపటి స్థాయిలో ప్రయాణించే వారి సంఖ్య ను తిరిగి తీసుకురావడం నగరాలకు పెద్ద సవాలుగా పరిణమించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో సురక్షితంగా ప్రయాణించడానికి అనువైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. ప్రధానంగా వ్యక్తిగత వాహనాలపై ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు. 

2.           కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల వినియోగం తిరిగి రాకుండా ఉండటానికి, ప్రపంచంలోని అనేక నగరాలు ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, రహదారులను మళ్లించడం, సైకిళ్లను వినియోగించేవారికి, పాదచారులకు వీధుల్లో ప్రత్యేక దారులను కేటాయించడం, మోటార్లు వాడని రవాణా వాహనాలకు (ఎన్.ఎమ్.టి) ప్రాధాన్యత మండలాలను ఏర్పాటు చేయడం, పాప్-అప్ బైక్ లేన్లు & సైడ్ వాక్స్, సైక్లింగ్‌ కు మరింత ప్రాచుర్యం కల్పించడానికి వీలుగా పార్కింగ్ వసతి, ఛార్జింగ్ పరికరాలను అందుబాటులో ఉంచడం మరియు ఆర్ధిక సహాయాన్ని కల్పించడం వంటి చర్యలు తీసుకుని ప్రోత్సహిస్తున్నాయి. 

కోవిడ్-19 దృష్ట్యా ఎన్‌ఎమ్‌టిని ప్రోత్సహించడానికి ఈ నగరాలు ఇటీవల తీసుకున్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

*          న్యూయార్క్ నగరంలో  సైకిలు పై ప్రయాణించేవారి సౌకర్యం కోసం 40 మైళ్ల  పొడవునా కొత్త ఎన్.‌ఎమ్.‌టి. దారులను పెంచింది ;

*          అమెరికా లోని ఓక్లాండ్ లో  మోటారు వాహనాలకు అనుమతిలేని విధంగా 10 శాతం వీధులను మూసివేసింది ;

*          కొలంబియా లోని బొగోటా లో సైకిలు పై రాత్రి పూట ప్రయాణించే వారి కోసం 76 కిలోమీటర్ల రహదారిని కేటాయించింది ;

*          ఇటలీ లోని మిలన్‌ లో 22 మైళ్ల పొడవైన వీధులను సైకిలు పై ప్రయాణించేవారికి అనువుగా మార్చడం జరిగింది ; 

*          న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో, రోడ్డు పక్కన కారు పార్కింగుల‌ను తొలగించి, ఇప్పటికే ఉన్న బైక్ మరియు ఫుట్ మార్గాలను విస్తృతం చేయడంతో పాటు 17 కిలోమీటర్ల తాత్కాలిక సైకిలు దారులను నిర్మించారు.  దీనితో పాటు, అలాగే, పాప్ అప్ బైక్ లేన్లను ఏర్పాటు చేయడానికి ఆక్లాండ్ నగరం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. 

*          చైనాలో బైక్ షేరింగ్ యొక్క ప్రచారం లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణాలలో 150 శాతం పెరుగుదలకు దారితీసింది; 

*          యు.కే. లో, పాదచారులు, పౌరులు సామాజిక దూరం మార్గదర్శకాలను పాటించడానికి వీలుగా మరియు దుకాణాల ముందు క్యూలో వేచి ఉండడానికి వీలు కల్పిస్తూ స్థానిక వ్యాపారాలు రహదారి స్థలాన్ని ఖాళీగా ఉంచుతారు. 

3.          గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  నిర్వహించిన వివిధ అధ్యయనాల ప్రకారం,  పట్టణ ప్రయాణీకులలో 16 నుండి 57 శాతం మంది పాదచారులనీ, వీరిలో నగర పరిమాణాన్ని బట్టి 30 నుండి 40 శాతం మంది సైకిళ్లను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.  దీనిని ఒక అవకాశంగా పరిగణించి, ఈ పరీక్షా సమయాల్లో ఈ రకమైన విధానాల ప్రాధాన్యతను పెంచి, ప్రయాణికులకు మరొక ప్రైవేట్ వాహన ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తేవాలి. ఇది శుభ్రంగా, సురక్షితంగా మరియు భద్రంగా ఉంటుంది. ఇది ఇతర విధానాలతో అనుసంధానించబడి అందరికీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటుంది.   జాతీయ పట్టణ రవాణా విధానం -2006 (ఎన్.యు.టి.పి) అమలుకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది.   టి.ఎమ్.‌టి.  పరిశ్రమలో పనిచేసేవారికి ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

4.          భారతదేశం 18 ప్రధాన నగరాల్లో 700 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు మార్గాన్నీ, అదేవిధంగా దేశంలోని 11 నగరాల్లో 450 కిలోమీటర్ల పొడవునా బి.ఆర్.టి. నెట్‌వర్క్ ను కలిగి ఉంది. ఈ మార్గాల్లో ప్రతీ రోజు 10 మిలియన్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు.  సామాజిక దూరం వంటి నిబంధనలు పాటిస్తున్నందున, వారి సామర్థ్యాలు కరోనా వైరస్ కు ముందు  స్థాయితో పోలిస్తే, కేవలం  25 నుండి 50 శాతం వరకు మాత్రమే ఉపయోగించబడతాయి.  ఈ ప్రజా రవాణా వ్యవస్థల డిమాండ్ మరియు సరఫరాలో చోటుచేసుకున్న ఇటువంటి నాటకీయ, క్రియాశీల మార్పులను ప్రత్యామ్నాయ రవాణా మార్గాలతో భర్తీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

5.          విషయ నిపుణులు, పరిశ్రమ నిపుణులు, ఆపరేటర్లు, ప్రపంచ బ్యాంక్ మరియు దేశంలోని మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని ప్రముఖ పట్టణ రవాణా నిపుణులతో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక సార్లు చర్చలు జరిపింది. కోవిడ్-19 అనంతరం పట్టణ ప్రజల  చైతన్యంలో చాలా మార్పు ఉంటుందని వారు స్పష్టంగా పేర్కొన్నారు.  ఈ పరీక్షా సమయాల్లో ప్రజా రవాణాలో ప్రయాణించాలంటే, ప్రజల మనస్సులలో మెదిలే అభద్రతా భావనతో, రహదారిపై ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరుగుతుంది.  ఇది కాలుష్యాన్ని సృష్టించడంతో పాటు, ఇతర ప్రజా రవాణా వాహనాలకు సరైన స్థలం దొరకదు. రహదారి భద్రత దెబ్బతింటుంది. రహదారులపై తీవ్రమైన రద్దీ పెరగడంతో  పాటు వాయు కాలుష్య స్థాయి కూడా పెరుగుతుంది.  

6.          ఏది ఏమైనా, భారతదేశంలో, వ్యక్తిగత వాహనాల యాజమాన్యం ఇప్పటికీ తక్కువ స్థాయిలో ఉంది.  అధిక సంఖ్యలో ప్రజా రవాణా వినియోగదారులు ఉన్నారు. వినియోగదారులకు పరిమిత రవాణా అవకాశాలు ఉన్నాయి. ఈ వినియోగదారులకు సురక్షితమైన మరియు నమ్మదగిన రవాణా అవకాశాలను కల్పించడం ప్రస్తుతం నగరాల ప్రాధాన్యతగా ఉంది. ముఖ్యంగా సామాజిక దూరం విధించిన సామర్థ్య పరిమితుల కారణంగా ఇక ముందు ఇది సాధ్యం కాకపోవచ్చు.  ప్రజా రవాణాలో భాగంగా, బస్సులు మరియు మెట్రో రెండూ అనేక నగరాలకు వెన్నెముకగా నిలిచాయి.  సామర్థ్యం సగం కంటే ఎక్కువ ఉన్నందున, ఆర్థిక వ్యవస్థలు పునః ప్రారంభమయ్యే సమయానికి, నగరాలు పూర్వవైభవాన్ని పొందటానికి వీలుగా,  ప్రత్యామ్నాయ రవాణా అవకాశాలను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. 

7.          వివిధ ప్రజా రవాణా వ్యవస్థలను సందర్శించి, హరిత, కాలుష్య రహిత, సౌకర్యవంతమైన, స్థిరమైన విధానాలను ఎంపిక చేసుకోడానికి  కోవిడ్-19 మనకు అవకాశం ఇచ్చింది.  ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో అన్ని రకాల చెల్లింపులు చేయడానికి మరియు ప్రయాణికులకు సమాచార వ్యవస్థను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించడం వంటి అంశాలపై,  మోటార్లు అవసరం లేకుండా నడిచే రవాణా వ్యవస్థ  (ఎన్.‌ఎమ్.‌టి)  మరియు ప్రజా రవాణా  వ్యవస్థలు ప్రధానంగా దృష్టి పెట్టాలి.  షాపింగ్ ప్రదేశంలో పాదచారులకు, ప్రజలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి.  

*****



(Release ID: 1631246) Visitor Counter : 267